అబ్జెక్షన్ యువరానర్... లాయర్ సిద్ధార్థ్ లూథ్రా!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ విషయంలో పోలీసులు, సీఐడీ పూర్తిస్థాయిలో నిబంధనలను ఉల్లంఘించాయంటూ ఆయన తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టులో వాదనలు వినిపించారు. బాబును అరెస్ట్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ లో పేరు లేదని, అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ ఐఆర్ ఇస్తామన్నారని, 24 గంటలు గడిచిన తర్వాత కూడా ఎఫ్ ఐఆర్ కాపీని అధికారికంగా ఇవ్వలేదన్నారు. మూడు గంటల్లో రిమాండ్ రిపోర్ట్ ఇస్తామన్నారని, అరెస్ట్ చేసిన 24 గంటలకు కూడా చంద్రబాబుకుకానీ, ఆయన తరఫు న్యాయవాదులకు కానీ అది అందలేదని చెప్పారు.

శనివారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టిన సీఐడీ చీఫ్ సాయంత్రానికల్లా ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారని, 24 గంటల సమయం ముగిసిన తర్వాతే కోర్టులో ప్రవేశపెట్టారని గుర్తుచేస్తున్నారు. ఆయన వయసు, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా 48 గంటలపాటు నిద్ర లేకుండా చేయడమంటే సామాన్య విషయం కాదని, తన క్లైంట్ అతి కష్టం మీద ఆదివారం ఉదయం ఆరుగంటలకు కోర్టుకు చేరుకున్నారన్నారు. గవర్నర్ అనుమతి లేని విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.

lawyer sidharth luthra arguments for tdp chief chandrababu

తన క్లైంట్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమైన చర్యేనని, ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసిందన్నారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ పూర్తి అయిందని, తీర్పు రిజర్వు చేశారని, ఆ కేసులో ఉన్నవారంతా ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారన్నారు. తన క్లైంట్ ను నంద్యాల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నా అలా చేయలేదని, వారు అనుకున్నచోటే ప్రవేశపెట్టారన్నారు. సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తించదని, ఈ కేసులో ఏ35 భాస్కర ప్రసాద్ ను అరెస్ట్ చేసినందన చంద్రబాబు అరెస్ట్ అవసరంలేదన్నారు.

ఎఫ్ ఐఆర్ లో పేరు లేనప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని, రిమాండ్ రిపోర్ట్ లో అధికారి వాడిన భాషను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సీఐడీ ఆరోపణ చేసినట్లు బాబు లండన్ వెళ్లడంలేదన్నారు. సీఐడీ అధికారులు ఉదయం ఆరుగంటలకు అరెస్ట్ చేశామని చెబుతున్నారని, కానీ తన క్లైంట్ ను శుక్రవారం రాత్రి 11.00 గంటలకు పోలీసులు చుట్టుముట్టారని, వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించారని, చంద్రబాబు అప్పటినుంచే అరెస్ట్ చేసినట్లుగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సీఐడీ అధికారుల 48 గంటల కాల్ డేటా కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఇది అనుబంధ పిటిషన్ మాత్రమేనని, రిమాండ్ రిపోర్ట్ వరకు మాత్రమే వాదనలు పరిమితం చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+