జగన్ సొంత జిల్లాలో ఇంకా ఆగని దందాలు, బ్రేకులు వెయ్యాలని టీడీపీ ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుకకు ఎంత డిమాండ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేం అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లే ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక అందిస్తున్నారు.

టన్ను ఇసుకకి ప్రభుత్వానికి రూ. 340 చొప్పున చెల్లించాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పలు ప్రాంతాలలో ఇసుక రీచ్ ల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసి ఇసుకను విక్రయిస్తున్నారని ఆరోపఫలు ఉన్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోని వీరనాయపునపల్లె మండలంలోని ఎర్రబల్లె ఇసుక రేవులో అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఇసుక విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Leaders illegally moving sand from Kadapa district to other districts

మంగళవారం ఒక్కరోజే సుమారు 100 టిప్పర్లు, లారీల్లో ఇసుకను అక్రమంగా కడప, నంద్యాల, గిద్దలూరు, ఓర్వకల్లు, కర్నూలు, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాలకు తరలించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాకు ఇసుక కావాలని ట్రిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లు తీసుకొని ఇసుక రీచ్ ల దగ్గరికి వెళ్ళామని, అయితే మమ్మల్ని కాదని దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఒక్కొక్క ట్రక్కుకు 20 టన్నుల ఇసుక ఇచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

20 టన్నుల ఇసుకకి రూ. 8, 000 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా అదనంగా రూ. 4000 వసూలు చేస్తున్నారని, ఇసుక రీచ్ దగ్గర స్లిప్పులు ఇచ్చే వ్యక్తి అదనంగా మరో రూ. 500 వసూలు చేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇలా ఇక్కడ తీసుకున్న ఇసుకను కర్నూలు, నంద్యాల, ఓర్వకల్లు, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల్లో ట్రక్కు ఇసుక రూ. 80 వేల వరకు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.

బుధవారం కూడా ఇసుక రీచ్ ల దగ్గర స్థానికులకు బయట నుండి వచ్చిన వాళ్ళకి ఇసుక తీసుకునే విషయంలో వాగ్వాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న ఎంపీడీవో సచివాలయంలో స్లిప్పులు ఇస్తామని, స్థానికులకు ప్రాధాన్యత ఇస్తామని, ఇసుక కోసం వచ్చిన అందరికి ఇసుక ఇస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది వైసీపీ నాయకులు అక్రమంగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని మంగళవారం మాత్రమే సుమారు 100 టిప్పర్లలో ఇసుకను తరలించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన స్థానిక టీడీపీ నాయకులు చంద్రబాబు ప్రభుత్వానికి ఫిర్యాదు చెయ్యడానికి సిద్దం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+