AP BJP Chief : సోము అవుట్ - తెరపైకి సత్యకుమార్-చివరి క్షణంలో పురంధేశ్వరి పేరు ఖరారు..

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును ఆ పదవి నుంచి తొలగించారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకని పలు రాష్ట్రాల్లో మార్పులు చేర్పులు చేస్తున్న బీజేపీ అధిష్టానం .. సోము వీర్రాజును కూడా ఆ పదవి నుంచి తప్పించింది. ఆయన స్ధానంలో జాతీయ నేత పురంధేశ్వరిని కొత్త అధ్యక్షురాలిగా నియమించినట్లు తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఇవాళ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును తొలగిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ఆయనకే ఫోన్ చేసి చెప్పేశారు. బీజేపీ ఆఫీసులో అల్లూరి సీతా రామరాజు జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోము వీర్రాజుకు ఇవాళ జేపీ నడ్డా నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సోముకు జేపీ నడ్డా ఫోన్ చేసి..మీ టర్మ్‌ పూర్తయింది. మిమ్మల్ని తప్పిస్తున్నాం.. రాజీనామా చేయాలంటూ సూచించారు. దీంతో సోము రాజీనామా చేయబోతున్నారు.

ఇంతవరకూ బాగానే ఉన్నా సోము వీర్రాజు స్ధానంలో జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను నియమిస్తున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో సత్యకుమార్ ను కాదని, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. సత్యకుమార్ తో పాటు సుజనా చౌదరి పేర్లు కూడా వినిపించినా పురంధేశ్వరి పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం.

 somu veerraju

మరోైవైపు గత ఎన్నికల తర్వాత కన్నా లక్ష్మీనారాయణ స్ధానంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అప్పటికే పార్టీలో ఉన్న ఇతర నేతలతో పొసగలేదు. అయినా అధిష్టానం మాత్రం ఆయన్ను కొనసాగిస్తూ వచ్చింది. ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలతో పాటు కాపు నేతలతోనూ సోము విభేదాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజును మారుస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే ఇది ఆలస్యంకావడంతో కన్నావంటి నేతలు పార్టీని వీడి పోయారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష మార్పు జరిగింది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యునిగా చోటు కల్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+