విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సవాంగ్ ఐపీఎస్ కు రాజీనామా చేయాలా - ఏపీ ప్రభుత్వ వాదన ఇలా : టీడీపీ ప్రభుత్వ ఉత్తర్వుల్లోనూ ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం ఆకస్మికంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేసింది. ఆయనను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో..డీజీపీ సడన్ బదిలీ పైన రాజకీయంగా దుమారం చెలరేగింది. దీని పైన టీడీపీ అధినేత చంద్రబాబు..పవన్ కళ్యాణ్ సహా పలువురు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. ఇదే సమయంలో గౌతమ్ సవాంగ్ ను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించాలని ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే, ఐపీఎస్ అధికారిగా ఉన్న సవాంగ్ కు ఇంకా 17 నెలల సర్వీసు ఉంది. ఆయన ఏపీపీఎస్సీ ఛైర్మన్ కావాలంటే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలనే అంశం తెర మీదకు వచ్చింది.

సవాంగ్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిందేనా

సవాంగ్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిందేనా

అయితే, ఆయన ఇప్పటి వరకు వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసినట్లుగా ఎటువంటి సమాచారం లేదు. కానీ, ఆయన్ను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించేందుకు ఫైల్ సిద్దం అయింది. అయితే, ఇప్పుడు సవాంగ్ ఇంకా తన 17 నెలల సర్వీసు వదులుకొని ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి స్వీకరిస్తారా..లేక, ప్రభుత్వ ఆఫర్ ను వదులుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తి కర చర్చగా మారింది. కానీ, ఇటువంటి పోస్టు ఖరారు చేసే ముందే సవాంగ్ తో మాట్లాడకుండా...ఈ నియాకమకం పైన చర్చ లేకుండానే..ప్రభుత్వం ఈ నిర్ణయం అంత ఆషామాషీగా తీసుకుంటుందా అనేది మరో చర్చ. ఇదే సమయంలో ప్రభుత్వ వర్గాల నుంచి కొత్త వాదన వినిపిస్తోంది. అసలు..ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా సవాంగ్ నియామకానికి స్వచ్ఛంద పదవీ విరమణ అవసరం లేదని చెబుతోంది.

ప్రభుత్వ వర్గాలు ఏం చెబుతున్నాయి

ప్రభుత్వ వర్గాలు ఏం చెబుతున్నాయి


ఇందు కోసం ఏపీపీఎస్సీ సర్వీస్ కమీషన్ రూల్ బుక్ తో పాటుగా..గతంలో ఏపీపీఎస్సీ సభ్యుడి నియమకానికి సంబంధించిన జీవోను ప్రస్తావిస్తోంది. ఏపీపీఎస్సీ సర్వీసు కమీషన్ 7(1)(a) ప్రకారం సదరు సభ్యుడు అపాయింట్ అయిన రోజు నుండి ఏపీపీఎస్సీ లో సర్వీస్ చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ గెజిట్ లో ఉందనే విషయాన్ని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏపీపీఎస్సీ సర్వీసు రూల్స్ లో సభ్యుడు షల్ బీ డీమ్డ్ టు హావ్ రిటైర్ ఫ్రం సచ్ సర్వీస్ ..అనే నిబంధనను ప్రస్తావిస్తోంది. దీంతో పాటుగా చంద్రబాబు ప్రభుత్వం ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఏపీపీఎస్సీ సభ్యుడి నియామకం విషయంలో జారీ చేసిన జీవోను ఇప్పుడు అధికార పార్టీ నేతలు బయటకు తీస్తున్నారు. ఆ జీవోలోనూ ఇదే ప్రొవిజన్ ను ప్రస్తావించన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

కనగరాజ్ వ్యవహారం లాంటి వాటికి ఛాన్స్ లేకుండా

కనగరాజ్ వ్యవహారం లాంటి వాటికి ఛాన్స్ లేకుండా

ఆ నిబంధనలే ఆధారంగా ఇప్పుడు గౌతమ్ సవాంగ్ నియామకం సైతం చేపట్టవచ్చని వారు చెబుతున్నారు. అయితే, గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డజ్ జడ్జి కనగ రాజన్ నియామకంలో జరిగిన వ్యవహారాన్ని సైతం పరిగణలోకి తీసుకుంటున్నారు. అటువంటి పరిస్థితులు సవాంగ్ విషయంలో తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, దీని పైన న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న తరువాతనే సవాంగ్ కు కొత్త పోస్టు విషయంలో నిర్ణయం జరిగిందని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లుగా సవాంగ్ వీఆర్ఎస్ తీసుకోకుండా ఏపీపీఎస్సీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టవచ్చా..ఎవరి వాదన ఏంటి.. ఈ విషయంలో ఏం జరగబోతోంది...ప్రభుత్వం ఏం చేయనుంది అనేది ఇప్పుడు మరింత ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Legal issues are now under discussion over the appointment of Gautam Sawang as APPSC chairman
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X