Tirumala : తిరుమలలో చిరుత సంచారం... భయాందోళనలో భక్తులు...
తిరుమలలో గత కొద్దిరోజులుగా చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఆదివారం(జులై 11) తిరుమల మొదటి ఘాట్ రోడ్‌లో చిరుత సంచరించింది. ఏనుగుల ఆర్చి సమీపంలోని ఓ చెట్టు కింద అది సంచరిస్తున్న సమయంలో భక్తులు దాన్ని గమనించారు. సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారు. సాధారణంగా ఈ మార్గంలో జింకలు ఎక్కువగా ఉంటాయి. జింకల కోసమే చిరుత ఆ వైపు వచ్చినట్లు భావిస్తున్నారు. చిరుతలు ఇలా తరుచూ ఘాట్ రోడ్డులో సంచరిస్తుండటంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
నిజానికి ఈ మార్గంలో భక్తులు జింకలకు తరుచూ ఆహార పదార్థాలు అందిస్తుంటారు. దీంతో అవి అటువైపు రావడం అలవాటుగా మార్చుకున్నాయి. అదే సమయంలో జింకల కోసం చిరుతలు మాటు వేస్తున్నాయి. కాబట్టి భక్తులు జింకలకు ఆహార పదార్థాలు ఇవ్వొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

శుక్రవారం(జులై 8) తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయ సమీపంలో ఓ చిరుత సంచారం కలకలం రేపింది. దీంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఘాట్ రోడ్డు అందాలను సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న సమయంలో హఠాత్తుగా చిరుత కనిపించింది. దీంతో భక్తులు అక్కడినుంచి పరుగులు తీశారు. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటువైపు వెళ్లే వాహనదారులను అప్రమత్తం చేశారు.
ఇదే శుక్రవారం సన్నిధానం అతిథి గృహం సమీపంలోని రెస్టారెంట్ వద్ద కూడా చిరుత సంచరించింది. అక్కడి పందులను వేటాడేందుకు చిరుత వచ్చింది. చిరుత రాకను గుర్తించి రెస్టారెంట్ సిబ్బంది పరుగులు తీశారు. వెంటనే చిరుత సంచారంపై భక్తులు, టీటీడీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. గతేడాది లాక్‌డౌన్ సమయంలోనూ తిరుమలలో చిరుతలు,ఎలుగుబంట్లు,ఏనుగులు ఇతర జంతువులు సంచరించిన సంగతి తెలిసిందే.
-
లడ్డూ వ్యవహారం లో సుప్రీం తాజా ఆదేశాలు..!! -
భారీగా నిధులు విడుదల చేసిన టీటీడీ -
తిరుమల క్యూ లైన్ లో నినాదాలు- టీటీడీ తాజా అప్పీల్ -
భక్తులకు షాక్!: వెంకటేశ్వర స్వామి ప్రసాదశాలలో గ్యాస్ కష్టాలు! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications