ఘనస్వాగతం: నిజామాబాద్‌కు కెసిఆర్ వరాలు(పిక్చర్స్)

నిజామాబాద్: పంట రుణాల మాఫీ హామీని నూటికి నూరు శాతం నిలుపుకుంటామని, ఈ విషయమై ఆర్‌బిఐ నుండి ఎదురవుతున్న చిక్కులను అధిగమించి రైతులందరికీ లబ్ధి చేకూరుస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇప్పటికే కేబినెట్‌లో తీర్మానం చేసి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించామని త్వరలోనే రుణ మాఫీ అమలవుతుందని ఆయన భరోసా కల్పించారు.
ముఖ్యమంత్రి హోదాలో గురువారం తొలిసారిగా నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరైన కెసిఆర్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.

దారి పొడుగునా విద్యార్థిని, విద్యార్థులు, మహిళలు తెలంగాణ కళారూపాలు, వేషధారణలతో బారులుతీరి నీరాజనాలు పలికారు. జిల్లాలోని ఆర్మూర్‌లో 114కోట్ల రూపాయలతో చేపడుతున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన మీదట స్థానిక మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెసిఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆదర్శ గ్రామం అంకాపూర్‌ను సందర్శించి రైతులతో భేటీ అనంతరం వరాల జల్లులు కురిపించారు.

ప్రభుత్వ పథకాల అమలులో అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా ప్రతి పైసా అర్హులకే చెందాలన్న సదుద్దేశంతోనే ఆగస్టు 19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వం నిర్వహించనుందని, ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, ప్రతిపక్షాలు చేసే అనవసర రాద్ధాంతంతో రుణ మాఫీ విషయమై రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కెసిఆర్ తేల్చి చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

పంట రుణాల మాఫీ హామీని నూటికి నూరు శాతం నిలుపుకుంటామని, ఈ విషయమై ఆర్‌బిఐ నుండి ఎదురవుతున్న చిక్కులను అధిగమించి రైతులందరికీ లబ్ధి చేకూరుస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

కెసిఆర్

కెసిఆర్

ఇప్పటికే కేబినెట్‌లో తీర్మానం చేసి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించామని త్వరలోనే రుణ మాఫీ అమలవుతుందని ఆయన భరోసా కల్పించారు.

కెసిఆర్

కెసిఆర్

ముఖ్యమంత్రి హోదాలో గురువారం తొలిసారిగా నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరైన కెసిఆర్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.

కెసిఆర్

కెసిఆర్

దారి పొడుగునా విద్యార్థిని, విద్యార్థులు, మహిళలు తెలంగాణ కళారూపాలు, వేషధారణలతో బారులుతీరి నీరాజనాలు పలికారు.

కెసిఆర్

కెసిఆర్

కెసిఆర్ పర్యటనలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపి కవితతో పాటు తెరాస ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

జిల్లాలోని ఆర్మూర్‌లో 114కోట్ల రూపాయలతో చేపడుతున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన మీదట స్థానిక మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెసిఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

కెసిఆర్

కెసిఆర్

ఆదర్శ గ్రామం అంకాపూర్‌ను సందర్శించి రైతులతో భేటీ అనంతరంవరాల జల్లులు కురిపించారు.

కెసిఆర్

కెసిఆర్

ప్రభుత్వ పథకాల అమలులో అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా ప్రతి పైసా అర్హులకే చెందాలన్న సదుద్దేశంతోనే ఆగస్టు 19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వం నిర్వహించనుందని, ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

కెసిఆర్

కెసిఆర్

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, ప్రతిపక్షాలు చేసే అనవసర రాద్ధాంతంతో రుణ మాఫీ విషయమై రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కెసిఆర్ తేల్చి చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

లక్ష రూపాయల్లోపు పంట రుణాలను మాఫీ చేయడం వల్ల ప్రభుత్వంపై 19వేల కోట్ల రూపాయల భారం పడుతోందని, 39లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

సిమెంటు తదితర ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగిన దృష్ట్యా, గృహ నిర్మాణాలకు ఇదివరకు ప్రకటించిన 3లక్షల రూపాయలకు అదనంగా మరో 50వేల రూపాయలను జోడిస్తూ మూడున్నర లక్షల రూపాయల చొప్పున మంజూరు చేస్తామని కెసిఆర్ ప్రకటించారు.

కెసిఆర్

కెసిఆర్

గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో లెక్కకు మిక్కిలి వేల కోట్ల రూపాయల్లో అవినీతి చోటుచేసుకుందని, ఈ అక్రమాలను నిగ్గు తేల్చేందుకే సి.ఐ.డిచే విచారణ జరిపిస్తున్నామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

బీడీ పరిశ్రమపై ఆధారపడిన వారిని గుర్తించేందుకు వీలుగా జరిపిస్తున్న సర్వే పూర్తయిన మీదట ప్రతి బీడీ కార్మికురాలికి నెలకు వేయి రూపాయల భృతిని అందిస్తామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

వచ్చే దసరా, దీపావళి నాటికి ప్రతి ఒక్కరికీ కొత్తగా రేషన్ కార్డులను అందజేస్తామని, వృద్ధులు, వితంతువులకు వేయి రూపాయలు, వికలాంగులకు 1500రూపాయల చొప్పున పెన్షన్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు.

కెసిఆర్

కెసిఆర్

వ్యవసాయ రంగంలో ఆదర్శంగా నిలుస్తున్న అంకాపూర్ గ్రామాన్ని ఆధునిక సేద్యానికి చిరునామాగా నిలుపుతామని, తెలంగాణ రాష్టమ్రంతటికీ వ్యవసాయ రంగంలో శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.

వ్యవసాయ రంగంలో ఆదర్శంగా నిలుస్తున్న అంకాపూర్ గ్రామాన్ని ఆధునిక సేద్యానికి చిరునామాగా నిలుపుతామని, తెలంగాణ రాష్టమ్రంతటికీ వ్యవసాయ రంగంలో శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. అంకాపూర్‌ను సందర్శించి స్థానిక రైతులతో భేటీ అయిన సందర్భంగా వరాల జల్లులు కురిపించారు. ఇక్కడి రైతులు ఎంతో నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన వారు కావడం వల్లే మూడు దశాబ్దాల క్రితమే సేద్యపు రంగంలో నూతన ఒరవడితో ఆర్థిక ప్రగతిని సాధించి అనేక మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+