కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేశ్‌ పాదయాత్ర వేళ కొత్త ట్విస్ట్ - వాట్ నెక్స్ట్..!?

|
Google Oneindia TeluguNews

టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పై ఇప్పుడు లేఖల సమరం కొనసాగుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. లోకేష్ యాత్రకు అనుమతి కోరుతూ డీజీపీకి ఆ పార్టీ నేత వర్ల రామయ్య లేఖ రాసారు. దీని పైన స్పందించిన డీజీపీ లేఖ పంపారు. యాత్రకు సంబంధించిన వివరాలు కోరారు. పూర్తి సమాచారం అందించాలని సూచించారు. దీనికి టీడీపీ కౌంటర్ గా మరో లేఖ రాసింది. అందులో నాడు గాంధీ చేసిన యాత్ర నుంచి జగన్ పాదయాత్ర వరకు ఏం జరిగిందీ వివరించారు. జగన్ అనుమతి తీసుకోలేదని ప్రస్తావించారు. లోకేష్ పాదయాత్ర కోసం డీజీపీ కోరిన వివరాలు అవసరం లేదని టీడీపీ పేర్కొంది. దీంతో..ఇప్పుడు ఏం జరబోతోందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

లోకేష్ యాత్రలో పొల్గొనే వారెవరెవరు

లోకేష్ యాత్రలో పొల్గొనే వారెవరెవరు


లోకేష్ యువగళం యాత్రకు అనుమతి కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య ఇప్పటికే డీజీపీతో పాటుగా హోం శాఖ కార్యదర్శికి లేఖలు పంపారు. ఆ తరువాత హార్డ్ కాపీలను అందించారు. చిత్తూరు జిల్లా అధికారులకు లేఖలు రాసారు. సమయం సమీపిస్తుండటంతో మరోసారి అనుమతి పైన టీడీపీ నేత లేఖ పంపారు. దీని పైన డీజీపీ ప్రత్యుత్తరం రాసారు. యాత్రకు సంబంధించి మరింత సమాచారం కోరారు.
జిల్లాల వారీగా పాదయాత్ర సాగే రూట్ మ్యాప్ ఇవ్వాలని డీజీపీ ఆ లేఖలో కోరారు. యాత్రలో పొల్గొనే పరివారంతో పాటుగా వాహనాలు వివరాలు.. స్థానికంగా బాధ్యత తీసుకొనే వారి సమాచారం పంపాలని లేఖలో కోరారు. ఆదివారం డీజీపీ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరై లేదా లిఖిత పూర్వకంగా వివరాలు సమర్పించాలని డీజీపీ తన లేఖలో పేర్కొన్నారు.

డీజీపీ లేఖపై టీడీపీ ఆగ్రహం

డీజీపీ లేఖపై టీడీపీ ఆగ్రహం


లోకేష్ యాత్రకు అనుమతి కోరుతూ తాము రాసిన లేఖపైన డీజీపీ స్పందనకు సమాధానంగా వర్ల రామయ్య పలు ప్రశ్నలు సంధించారు. గతంలో పాదయాత్రలు చేసిన వారిని ఎవరినైనా ఇవన్నీ అడిగారా అని ప్రశ్నిస్తూ వెంటనే టీడీపీ మరో లేఖ రాసింది. అందులో గాంధీ చేసిన యాత్ర నుంచి ప్రతిపక్ష నేతగా జగన్ నిర్వహించిన పాదయాత్ర వరకు అన్ని అంశాలను ప్రస్తావించింది. తాజాగా డీజీపీ కోరిన వివరాలను అప్పట్లో వీరిని ఎవరూ అడగలేదని లేఖలో పేర్కొంది. ఇటీవల రాహుల్‌ గాంధీ ఏపీలో కూడా కొంత దూరం పాదయాత్ర చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించింది. తాత్కాలిక ప్రణాళిక ప్రకారం ఈ యాత్ర కుప్పంలో ప్రారంభమై 125అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఇచ్ఛాపురం చేరుతుందని లేఖలో పేర్కొంది. తాము ఇచ్చిన రూట్‌ మ్యాప్‌ ఆధారంగా స్థానిక పోలీస్‌ యంత్రాంగం అంచనా వేయాలని సూచించింది. ప్రజలు ఇబ్బంది పడకుండా పోలీస్‌ యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గతంలో చేసింని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా ఎవరినీ ఇటువంటి ప్రశ్నలు వేసి వేధించలేదంటూ వ్యాఖ్యానించారు.

నాటి జగన్ యాత్రను ప్రస్తావిస్తూ

నాటి జగన్ యాత్రను ప్రస్తావిస్తూ


ఇదే సమయంలో జగన్ పాదయాత్ర సందర్భంగా ఎటువంటి వివరాలు ఇవ్వలేదని టీడీపీ వెల్లడించింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి రాసిన లేఖను టీడీపీ బయట పెట్టింది. నాడు జగన్ వ్యక్తిగత కార్యదర్శి డీజీపీకి లేఖ రాసినట్టు వెల్లడించింది. జగన్ జడ్‌ కేటగిరీ భద్రతలో ఉన్నారని, అందుకనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోండని ఆయన కోరారని గుర్తు చేసింది. సవివర రూట్‌ మ్యాప్‌ను ప్రతి జిల్లాలో పోలీస్‌ అధికారులకు తమ పార్టీ నేతలు అందజేస్తారని మాత్రమే నాడు లేఖలో పేర్కొన్నారని వివరించింది. ఇప్పుడు డీజీపీ అడుగుతున్న వివరాలేవీ అప్పుడు జగన్‌ ఇవ్వకపోయినా ఆయన పాదయాత్రకు తాము అనుమతి ఇవ్వడంతో పాటు భద్రత కల్పించామని టీడీపీ వెల్లడించింది. దీంతో..ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు టీడీపీ లేఖ..వారిస్తున్న సమాధానం పైన ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారుతోంది..

English summary
On Lokesh Yuvagalam Yatra DGP seek more details from party on yatra route map and leaders participation, TDP serious on DGP letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X