బాబుకు గుడి కట్టనున్న హిజ్రాలు: అవసరమైతే.. అలా చేసైనా!, నాయకుడి ప్రకటన..

Subscribe to Oneindia Telugu

నంద్యాల: సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న హిజ్రాల(థర్డ్ జెండర్) సంక్షేమంపై దృష్టి పెట్టినందుకు సీఎం చంద్రబాబుపై వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబుకి ఏకంగా ఐదు కేజీల వెండి విగ్రహంతో దేవాలయం నిర్మిస్తామని హిజ్రాల ఉద్యమ నాయకుడు విజయకుమార్ ప్రకటించారు.

దేశంలోనే మొదటిసారిగా చంద్రబాబు ఏపీలో థర్డ్‌జెండర్స్‌కు లింగ వివక్షత నుంచి విముక్తి కల్పించారన్నారు. హిజ్రాల సంక్షేమ అభివృద్ది కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు సీఎం శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ, పురుషులతో పాటు హిజ్రాల ప్రాథమిక హక్కులకై కృషి చేస్తోందన్నారు.

  చంద్రబాబు-రమణ రహస్యాలను నాయిని వినేసినట్టున్నారు : ఇప్పుడెలా? | Oneindia Telugu
  LGBT community plans to build temple for Chandrababu Naidu

  ప్రభుత్వం తమ సమస్యలపై చూపిస్తున్న చొరవ నేపథ్యంలో సీఎంకు గుడి కట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకోసం తన సొంత డబ్బు రూ.10లక్షల వరకు ఖర్చు చేయనున్నట్టు తెలియజేశారు.అవసరమైతే నంద్యాల సమీపంలోని తన స్వగ్రామమైన పెద్ద కొట్టాల పల్లెలో ఉన్న ఎకరా భూమిని అమ్మి అయినా సరే సీఎంకు గుడి నిర్మిస్తానని అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  As a gesture for the setting up of the Hijra Welfare Board, the LGBT community are planning to build a temple for Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి