రాంగోపాల్ వర్మను మించిపోయిన డీజీపీ-పోలీసులతో నాకు ప్రాణహాని-తప్పు చేస్తే ఉరిశిక్షకైనా సిద్ధమే : చింతమనేని
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిప్పులు చెరిగారు. మీకు పదవి వ్యామోహం ఉంటే వైసీపీకి మరో రూపంలో సాయం చేయండి గానీ ఇలా కేసులు పెట్టి వేధించవద్దని డీజీపీని ఉద్దేశించి పేర్కొన్నారు. కుర్చీ పాకులాటలో తనలాంటి చిన్నవాళ్లతో చెలగాటం ఆడవద్దని విజ్ఞప్తి చేశారు. తనపై కేసులు పెట్టడానికి ఎవరు దొరక్క ఎస్సైలతోనూ కేసులు పెట్టించారని అన్నారు. ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ప్రశ్నించారు.

దొంగ కేసులు పెట్టారు : చింతమనేని
'గతంలో ఓ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చింతమనేని బాధితులు ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. నాపై దొంగ కేసులు నమోదు చేశారు. భోగాపురంలో ఎవరో ఎస్సీ వ్యక్తి భూమిలో ఎవరో ఇల్లు కట్టుకుంటే... నాపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అక్కడ భవన నిర్మాణం చేపట్టిన వ్యక్తులు ఆ ఎస్సీ వ్యక్తిని కులం పేరుతో దూషించారని... ఆ సందర్భంగా తమ వెనుక చింతమనేని ఉన్నాడని చెప్పారని... అందుకే నాపై కేసు పెట్టామని చెబుతున్నారు. అసలా స్థలం ఎవరిదో... అక్కడ భవనం ఎవరు నిర్మించారో నాకేమీ తెలియదు. ఇవన్నీ కట్టుకథలు...' అని చింతమనేని మండిపడ్డారు.

టీడీపీ జెండా పట్టుకోవద్దనే... ఇలా భయపెడుతున్నారు : చింతమనేని
డీజీపీ నిజాయితీగా,నీతిగా ఉండాల్సిందిపోయి ఒక పార్టీ వారిని వేధిస్తున్నారని చింతమనేని ఆరోపించారు. ప్రతీ మండల స్థాయి నాయకుడి మీద ఐదు కంటే తక్కువ లేకుండా కేసులు నమోదు చేశారన్నారు. నిన్న గాక మొన్న నర్సీపట్నంలో భారీ పోలీస్ బందోబస్తుతో తనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. రాత్రిపూట ప్రైవేట్ వాహనాల్లో తనను చింతపల్లి సబ్ డివిజన్ ఆఫీస్‌కు ఎందుకు పంపించారని ప్రశ్నించారు. తానెలాంటి తప్పులు చేయలేదని... ఎవరికీ భయపడేది లేదని అన్నారు.తానేమీ అక్రమార్జన చేయలేదని... దుర్మార్గాలు చేయలేదని అన్నారు. అలాంటి తనపై డీజీపీకి ఎందుకింత ప్రేమ... తానొక్కడినే బకరా దొరికానా అని ప్రశ్నించారు. సీఎం జగన్ మెప్పు పొందేందుకే డీజీపీ టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ జెండా పట్టుకుని బయటకొస్తే... పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

పోలీసులతో నాకు ప్రాణహాని : చింతమనేని
పోలీసులతో తనకు ప్రాణహాని ఉందని చింతమనేని ప్రభాకర్ అన్నారు. తనకు సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించమని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పారు. నాఅక్రమ కేసుల సినిమా చూపించడంలో డీజీపీ రాంగోపాల్ వర్మను మించిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లు ఎందరో ఉండగా మీడియా సమావేశంలో నాపేరే డీజీపీ ఎందుకు ప్రస్తావించారు అని ప్రశ్నించారు. 6093 ఆర్థిక నేరగాడి గురించి ప్రజలకు తెలిపే ప్రయత్నం ఎందుకు చేయలేదన్నారు. తనపై ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయమన్నారు. నిజంగా తన తప్పుంటే ఉరిశిక్షకైనా సిద్ధమేనని, కేసులు తొలగించమని దేహీ అని ఎవర్నీ అడగలేదని చింతమనేని పేర్కొన్నారు.

ఎన్‌కౌంటర్‌కు కుట్ర అంటూ...
రెండు రోజుల క్రితం చింతమనేని ప్రభాకర్ డీజీపీపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలి అరెస్ట్ తర్వాత తాను తిరిగి వస్తానని అనుకోలేదని, తనను ఎన్ కౌంటర్ చేయడానికి ప్లాన్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతోనే తన హత్యకు ప్రణాళికలు రచించారని ఆరోపించారు.ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన ఆయన తనపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని, నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని కోరుతూ చింతమనేని ప్రభాకర్ తన ఫిర్యాదును అందించారు.ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో రాష్ట్ర డీజీపీ, విశాఖ పట్నం జిల్లా ఎస్పీ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీలు తన హత్యకు కుట్ర పన్నారని చింతమనేని ప్రభాకర్ ఆరోపిస్తున్నారు.

ఇటీవల చింతమనేని అరెస్ట్...
దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్‌ను ఇటీవల విశాఖ జిల్లా నర్సీపట్నంలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో చింతమనేని అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది పదికి పైగా వాహనాలలో వచ్చి అలజడి సృష్టించి వెళుతున్నట్లుగా ఇక్కడి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. ఈ సమాచారం మేరకు చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేయగా చింతమనేని ప్రభాకర్ అనుమానాస్పదంగా అందులో కనిపించారని వెల్లడించారు. ప్రాథమిక విచారణలో అనుమానాస్పదంగా ఏజెన్సీ గ్రామాలలోకి వెళ్లడానికి వచ్చిన వ్యక్తి టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని గుర్తించామని, అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెబుతూ పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చింతమనేని ప్రభాకర్ చేశారని వెల్లడించారు.

అబ్బయ్య చౌదరి వార్నింగ్
చింతమనేని అరెస్టు,ఆరోపణలపై రెండు రోజుల క్రితం దెందలూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తీవ్ర స్థాయిలో స్పందించారు. చింతమనేని వ్యాఖ్యలపై ఎప్పుడూ పెద్దగా స్పందించని ఆయన... ఈసారి తీవ్ర స్థాయిలో స్పందించారు. నిజంగా తాము కేసులు పెట్టడం మొదలు పెడితే ఈ రోజు టిడిపి నాయకులు ఇళ్లళ్లో ఉండగలరా అని ప్రశ్నించారు. ఈ రోజు నీ సెంటర్లోనే ఉన్నాను ఖబర్దార్ చింతమనేని ప్రభాకర్.. అంటూ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వార్నింగ్ ఇచ్చారు.మరోసారి నీ నోటి వెంట సీఎం గురించి మాట వస్తే చూస్తూ ఊరుకోబోమని, చర్మం ఒలిచేస్తామని హెచ్చరించారు. పులి కడుపున పుట్టాను చేతకాక కాదు, తాటతీస్తా గుర్తుపెట్టుకో అని మండిపడ్డారు. నియోజకవర్గంలోని తమ కార్యకర్తలంతా ఓర్పుతో ఉన్నారని... తాను సై అంటే చర్మం వలిచేస్తారని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.దుగ్గిలలో 10 సంవత్సరాల నుండి అంబేద్కర్ విగ్రహం పెడతాం అంటే అడ్డుపడ్డావని ఆరోపించారు. దెందులూరు నియోజకవర్గంలో 750 కోట్లు రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications