సొంతగడ్డపై వివేకా ఫ్యామిలీకి భద్రత కరవు-హంతకుల బెదిరింపులు ? సీబీఐ దర్యాప్తుతో ఒత్తిడి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. గతంతో పోలిస్తే సీబీఐ అధికారులు ఈసారి ఏ క్లూ వదలకుండా దర్యాప్తు సాగిస్తున్నారు. దీంతో వివేకా హంతకులపై ఒత్తిడి పెరుగుతోంది. కడప జిల్లా పులివెందులలోని ఇంట్లోనే హత్య జరగడం, హత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో సాక్ష్యులు స్ధానికంగానే ఉండటంతో సీబీఐ వారిని సీరియస్‌గా విచారిస్తోంది. ఇందులో కీలక విషయాలు బయటపడుతున్నట్లు హంతకులకు ముచ్చెమటలు పడుతున్నాయి. అందుకే వివేకా కుటుంబాన్ని వారు బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది.

వివేకా హత్య కేసులో కీలక మలుపులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లూ వైఎస్ కుటుంబంలో జరిగిన ఈ హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై జగన్ సర్కార్ మౌనంపైనే విమర్శలు రాగా... ఇప్పుడు ఏకంగా వివేకా కుటుంబానికే ప్రాణహాని ఉన్నట్లు తేలడం కలకలం రేపుతోంది. వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు గతంతో పోలిస్తే సీరియస్‌గా దృష్టిపెట్టడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని, వారి కుటుంబ సభ్యుల్నీ నిశితంగా విచారిస్తుండంటంతో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి.

వివేకా కుటుంబానికి బెదిరింపులు ?
వివేకానందరెడ్డి హత్య తర్వాత ఎప్పుడూ లేనంత స్ధాయిలో ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో కొత్త నిజాలు బయటపడుతుండటం, వాటిని వివేకా కుటుంబ సభ్యులతో సరిపోల్చుకునేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తుండటంతో హంతకులపై మరింత ఒత్తిడి పెరిగింది. దీంతో వారు వివేకా కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వివేకా కుమార్తె సునీతారెడ్డి పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. హైప్రొఫైల్ కుటుంబం కావడం, బెదిరింపుల వ్యవహారం బయటికొస్తే విమర్శలు వస్తాయన్న భయంతో ఈ విషయం అధికారులు దాచిపెడుతున్నట్లు తెలుస్తోంది.

వివేకా ఫ్యామిలీకి ప్రాణహాని
వివేకా హత్య విషయంలో సీబీఐ అధికారులకు వివరాలు అందిస్తే ప్రాణాలు తీస్తామని ఆయన కుటుంబ సభ్యుల్ని హంతకులు, వారి అనుచరులు బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వివేకా కుమార్తె సునీతారెడ్డి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పులివెందులలో తమ కుటుంబానికి భద్రత కావాలని కోరారు. ప్రస్తుతానికి వివేకా కుమార్తె సునీతారెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నా మిగతా కుటుంబ సభ్యులు మాత్రం పులివెందులలోనే ఉంటున్నారు. దీంతో వీరికి భద్రత కల్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

వివేకా ఫ్యామిలీకి పులివెందులలో భద్రత కరవు ?
ఒకప్పుడు పులివెందులతో పాటు కడప జిల్లాలోనే హవా కొనసాగించిన వివేకానందరెడ్డి కుటుంబానికి తాజా పరిణామాల నేపథ్యంలో సొంతగడ్డపైనే వారికి భద్రత కరవవడం సంచలనం రేపుతోంది. ముఖ్యంగా సీఎం జగన్ కుటుంబానికి చెందిన వారికి పులివెందులలో భద్రత లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వివేకా హత్య కేసు విషయంలో ఇప్పటికే వైఎస్సార్ కుటుంబంలో వారిపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పులివెందులలో తమకు భద్రత లేదని వివేకా కుమార్తె చేసిన ఫిర్యాదు స్వయంగా సీఎం జగన్‌కు కూడా ఇబ్బందికరంగా మారనుంది.
-
అమెరికాలో సంవత్సరం ఆడి సంచలనం సృష్టించిన తెలుగు సినిమా -
Free Bus ఏపీలో ప్రారంభమైన కొత్త పథకం, వారికి కూడా ఇంద్రధనస్సు -
అంచనాలకు అందని బంగారం ధరలు- తలకిందులు -
ట్రంప్ ఆజ్ఞను ధిక్కరించిన సైన్యం.. AI తో ఇరాన్‌పై దాడి -
టీటీడీ వాడి అబ్బ సొత్తా- చంద్రబాబు చెబితే నిమిషంలో రాజీనామా చేస్తా- బీఆర్ నాయుడు -
IND vs WI: స్కోర్ చెప్పేసిన దాదా.. చెమటలు చిందిస్తున్న టీమిండియా -
ఖమేనీ కేవలం నేత కాదు.. కోట్ల మంది మతగురువు: ప్రధాని మోదీకి ఒవైసీ డిమాండ్ -
CBSE Board Exams Deferred: రేపు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు వాయిదా..! -
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. వీళ్లు అస్సలు మిస్ అవ్వొద్దు..! -
Silver:వెండి ధరలకు విస్ఫోటనం సంకేతాలు! సోమవారం ఏం జరగబోతుంది -
చుక్కలు చూపెడుతున్న సిలిండర్ రేట్లు- ఏటీఎఫ్ ధరలకూ రెక్కలు -
ఖమేనీ మృతి: 40 రోజుల పాటు సంతాప దినాలు: కోడలు, అల్లుడు, మనవళ్లు సైతం












Click it and Unblock the Notifications