అదృశ్యం: టెక్కీ ఆత్మహత్య?, షాపింగ్‌కు వెళ్లి కొడుకుతో వైద్యుడు

హైదరాబాద్: లైట్‌బగ్‌ బీపీవో సీఈవో లక్ష్మినరసింహం అదృశ్యం కావడం కలకలంరేపుతోంది. ఈనెల 13న బెంగళూరు వెళ్లిన లక్ష్మినరసింహం తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు జవహార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసి లక్ష్మినరసింహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రైవేటు కంపెనీ సీఈవో లక్ష్మినరసింహం అదృశ్యం కేసును కీలకంగా తీసుకున్న పోలీసులు దర్పాప్తును ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా లక్ష్మినరసింహం తన సోదరుడు చిన్నాకు పంపిన చివరి మెయిల్‌ను పోలీసులు కనుగొన్నారు. నేను జీవితంలో ఓడిపోయాను...ఓటమితో ఉండలేను అని, చిన్నా...అమ్మానాన్నను జాగ్రత్తగా చూసుకో, ఐయామ్‌ సారీ... మిస్‌యూ ఆల్‌ అనే సారంశాన్ని పోలీసులు గుర్తించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు నరసింహం సూసైడ్‌ చేసుకున్నాడా లేక మరే ఇతర కారణాలా అన్న దానిపై దర్యాప్తు చేపట్టారు.

Light bug CEO missing in Bengaluru: doctor missing from Hyderabad

ఇదిలావుంటే, షాపింగ్‌కు వెళ్లిన ఓ వైద్యుడు కుమారుడితో సహా కనిపించకుండా పోయాడు. హైదరాబాదులోని కెపిహెచ్‌బి స్టేషన్ పరిధిలో ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సౌజన్య శ్రీదేవి, డాక్టర్ దిలీప్ కుమార్ (40) దంపతులు ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్నారు. సౌజన్య జెఎన్‌టిలులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

దిలీప్ కుమార్ చందానగర్‌లోని సాయి సౌజన్య ఆస్పత్రిలో వైద్యుడు. నిరుడు అక్టోబర్ 25వ తేదీన సౌజన్య, దిలీప్ కుమార్‌ల కుమారుడు సాయి (4)తో కలిసి షాపింగ్‌కు వచ్చారు. ప్రగతినగర్ విజేత సూపర్ మార్కెట్ సమీపంలో కారు ఆపారు. పాల ప్యాకెట్ కోసం సౌజన్య సూపర్ మార్కెట్లోకి వెళ్లి తిరిగి వచ్చేసరికి కారులో ఉన్న దిలీప్‌తో పాటు కుమారుడు సాయి కనిపించలేదు.

Light bug CEO missing in Bengaluru: doctor missing from Hyderabad

దాంతో బంధువుల ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లో వాకబు చేసిన ఫలితం దక్కలేదు. దీంతో సౌజన్య తన భర్త, కుమారుడు అదృశ్యమయ్యారంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+