రెమ్యునరేషన్ లో టాప్ 5 తెలుగు హీరోలు
ప్రభాస్:తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలు ఎవరు అని విశ్లేషిస్తే ముందుగా స్ఫురణకు వచ్చే పేరు ప్రభాస్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కి విడుదలవుతున్నాయి. సాహో, రాధే శ్యామ్ ఈకోవలోనే ఉంటాయి. ప్రస్తుతం అనేక ప్రాజెక్టులను ప్రభాస్ లైన్లో పెట్టారు. ఒక్కొక్క సినిమాకి రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.
అల్లు అర్జున్:రెమ్యునరేషన్ అందుకునే టాప్ 5 హీరోల్లో అల్లు అర్జున్ ద్వితీయ స్థానంలో నిలిచారు. పుష్ప సినిమా తర్వాత బన్నీ పాన్ ఇండియా కథానాయకుడిగా మారిపోయాడు.
ఒక్కొక్క సినిమాకు రూ. 60 కోట్ల నుంచి రూ.125 కోట్ల వరకు తీసుకుంటున్నారట. ఇవి కాక కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్:ఈ జాబితాలో మూడోస్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ దక్కించుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో హిట్టు కొట్టిన తారక్ ఒక్కొక్క సినిమాకి రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారట.
రామ్ చరణ్:రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఆచార్య సినిమా ఇబ్బంది పెట్టినా ఆయన రెమ్యూనరేషన్ మాత్రం మారలేదు. దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు తీసుకుంటున్నారట. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు.
మహేష్ బాబు:సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా హీరోగా ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఆయన క్రేజ్ మాత్రం అనితర సాధ్యం. ఇప్పటికీ అమ్మాయిలందరికీ రాకుమారుడిగా మహేష్ బాబు ఉన్నారు. ఒక్కొక్క సినిమాకి రూ.60 నుంచి రూ.80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications