అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొత్తులు లేకుండా చంద్రబాబు గెలవలేరా - సీఎం జగన్ అంతలా దెబ్బ కొట్టారా..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ ను ఓడించాలంటే టీడీపీకి పొత్తు ఉండాల్సిందేనా. జగన్ ఒంటరి పోరాటానికి సిద్దమతే, చంద్రబాబు ఎందుకు కాలేకపోతున్నారు. చంద్రబాబుకు సంక్షోభాలు కొత్త కాదు. కానీ, ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఎంతో కాంగ్రెస్ సీఎంలు..వైఎస్సార్ వరకు చంద్రబాబు రాజకీయంగా పోరాడారు. కానీ, ఇప్పుడు సీఎం జగన్ తో జరుగుతున్న రాజకీయ పోరాటం మరో ఎత్తు. రానున్న ఎన్నికలు టీడీపీకి - చంద్రబాబు సమర్ధతకు పరీక్షగా మారుతున్నాయి.

పొత్తులు లేకుండా గెలుపు సాధ్యం కాదా

పొత్తులు లేకుండా గెలుపు సాధ్యం కాదా

2014లో పవన్ - బీజేపీతో కలిసి అధికారం దక్కించుకున్నా.. 2019 ఎన్నికల ఫలితాలను మాత్రం చంద్రబాబు చాలా జీర్ణించుకోలేకపోయారు. ప్రతీ సందర్భంలోనూ ఆవేదన వ్యక్తం చేసారు. నాలుగు దశాబ్దాల పార్టీని నిలబెట్టుకోవాలి. తిరిగి అధికారంలోకి రావాలి..ఇవే లక్ష్యాలోత 2024 ఎన్నికల కోసం చంద్రబాబు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఇందు కోసం ఎన్ని విమర్శలు వచ్చినా.. పరిస్థితులు అనుకూలించకపోయినా తిరిగి జనసేనాని పవన్ కల్యాణ్ పొత్తు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా, పవన్ కల్యాణ్ తో పొత్తు ఉంటుందా..ఉండదా స్పష్టత లేని వ్యవహారంగా మారుతోంది. బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు ఉండదని స్పష్టంగా చెబుతున్నా.. తాము బీజేపీతో పొత్తు కోరుకోవటం లేదని చెప్పలేని పరిస్థితి. తమకు సహకరించకపోయినా.. వైసీపీకి అండగా నిలవకుంటే చాలని టీడీపీ నేతలు భావించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

గెలిచినా - ఓడినా సింగిల్ ఫైట్ అంటున్న వైసీపీ

గెలిచినా - ఓడినా సింగిల్ ఫైట్ అంటున్న వైసీపీ


టీడీపీ ఒంటరిగా ఎన్నికలకు వస్తామని ప్రకటించాలంటూ వైసీపీ సవాళ్లు చేస్తున్నా..టీడీపీ నేతల నుంచి స్పందన లేదు. జనసేన నేతలకు వైసీపీ ఇదే సవాల్. జగన్ తమకు ఎవరితో పొత్తులు ఉండవని చాలా స్పష్టంగా చెబుతున్నారు. 2019 ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్ నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలను విస్మరించటం పైన ప్రధానంగా ప్రచారం చేసారు. అదే సమయంలో తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో వివరించారు. తన తండ్రి తరహాలోనే ఇచ్చిన మాట కోసం నిలబడతానని నమ్మకం కలిగించారు. కానీ, ఇప్పుడు టీడీపీలో అంశాల వారీగా ప్రభుత్వ లోపాల ప్రస్తావన తగ్గి, ఇతరత్రా విషయాల పైన ఎక్కువగా ఫోకస్ చేయటం కనిపిస్తోంది. జగన్ పదే పదే ప్రస్తావించే సంక్షేమ పథకాల చాటున అవినీతి ఉందని చెబుతున్న టీడీపీ నేతలు, ఏ ఒక్క అంశాన్ని బయట పెట్టలేదు. ఇక, తాము ఇంతకు మించి సంక్షేమం అమలు చేస్తామని చెబుతున్నా.. గతంలో ఎందుకు చేయలేదంటే సమధానం చెప్పాల్సిన పరిస్థితి.

 టీడీపీని జగన్ అంతలా దెబ్బ తీసారా

టీడీపీని జగన్ అంతలా దెబ్బ తీసారా


జగన్ 2014, 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసారు. 2014లో ఓడారు. 2019లో అధికారంలోకి వచ్చారు. 2024లోనూ తిరిగి ఒంటరిగానే పోటీ చేస్తానని చెబుతున్నారు. కానీ, ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు రాజకీయంగా నిలబడాలని చూస్తున్న పవన్ కల్యాణ్.. ఏపీలో నామమాత్రపు ఓట్ బ్యాంక్ ఉన్న బీజేపీ పొత్తు కోసం ఎదురు చూడటం కొంత మంది టీడీపీ నేతలకే రుచించటం లేదు. చంద్రబాబు రాజకీయంగా చివరి వరకు పోరాటం చేస్తారని చెబుతారు. కానీ, జగన్ విషయంలో మాత్రం ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. దీని ద్వారా పరోక్షంగా జగన్ బలంగా ఉన్నారనే సంకేతాలు టీడీపీ నాయకత్వం నుంచే కనిపిస్తున్నాయి. రాజకీయంగా బలంగా ఉన్న టీడీపీ తో పాత్తు కోసం జనసేన - బీజేపీ వంటి పార్టీలు రావాల్సిన వేళ.. ఆ పార్టీల మద్దతు కోసం టీడీపీ వేచి చూడటం మద్దతుగా నిలుస్తున్న ఓట్ బ్యాంక్ పైనా ప్రభావం పడుతోంది. ఓడినా - గెలిచినా జగన్ తనను మాత్రమే తాను నమ్ముకున్నారు. కానీ, టీడీపీ నేతల్లో ఆ విశ్వసం లోపించింది. ఇప్పుడు అదే జగన్ కు వరంగా మారుతోంది. మరి.. మారుతున్న సమీకరణాల్లో జీవన్మరణ సమస్యగా మారుతున్న వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎటువంటి వ్యూహాలతో ముందుకు వస్తారో చూడాలి.

English summary
Ahead of 2024 Elections TDP Chief chandra Babu facing litmus test, wating for alliance with Janasena and BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X