ఏపీలో రూ.102కు చేరిన లీటర్ పెట్రోల్‌ ధర-జనం గగ్గోలు-కనికరించని సర్కార్‌

ఏపీలో పెట్రోల్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల మోత తోడవడంతో పెట్రోలు ధరలు కొండెక్కుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్‌ ధరలతో ఏపీలో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విపక్షాలు నిరసనలు దిగుతున్నా, ప్రజాగ్రహం కనిపిస్తున్నా ప్రభుత్వం మాత్రం పన్నుల తగ్గింపుకు ముందుకురావడం లేదు. అసలే కరోనా సమయంలో పన్నుల రాబడి తగ్గడంతో పెట్రోల్ ధరలపై ఆలోచించే పరిస్ధితుల్లో ప్రభుత్వం లేనట్లే కనిపిస్తోంది.

 ఏపీలో పెట్రోల్ ధరల మంట

ఏపీలో పెట్రోల్ ధరల మంట

దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరల ప్రభావం ఏపీలోనూ కనిపిస్తోంది. అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే పన్నుల మోత ఎక్కువగా ఉండే ఏపీలో దీని ప్రభావం మరికాస్త ఎక్కువగా కనిపిస్తోంది. కొన్నిరోజుల క్రితమే సెంచరీ దాటేసిన లీటర్‌ పెట్రోల్ ధర.. ఇవాళ మరింత పతాకస్ధాయికి చేరిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లీటరు పెట్రోల్ ధర రూ.102 దాటిపోయింది. నిన్న నిర్ణయించిన ధర రూ.102నే ఇవాళ కూడా బంకుల్లో కొనసాగించడంతో జనం నిరసన వ్యక్తం చేస్తున్నారు.

విపక్షాల నిరసనలు

విపక్షాల నిరసనలు

ఏపీలో పెట్రోల్‌ ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల విపక్షాలు నిరసనకు దిగుతున్నాయి. కాంగ్రెస్‌, టీడీపీ, కమ్యూనిస్టులు పెరిగిన పెట్రోల్ ధరలపై కొన్నిరోజులుగా నిరసన తెలుపుతూనే ఉన్నాయి. అటు జాతీయ స్ధాయిలోనూ పెట్రో ధరల మంటపై కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. అయినా అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దిగిరావడం లేదు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశాతో పోల్చినా ఏపీలో పెట్రోల్ ధరల మంట ఎక్కువగానే ఉంది.

 పన్నుల తగ్గింపుకు సర్కార్ ససేమిరా

పన్నుల తగ్గింపుకు సర్కార్ ససేమిరా

పెట్రోల్‌ ధరల మంట సెంచరీ దాటిపోయినా ఏపీ ప్రభుత్వం మాత్రం దీనిపై పునరాలోచించేందుకు ససేమిరా అంటోంది. పెరుగుతున్నపెట్రో ధరలపై విపక్షాలు నిరసనలు చేపడుతున్నా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. పన్నుల శాతాల్ని తగ్గించడం లేదా రూపాయల్లో అయినా పెట్రోల్ ధరపై రాయితీ ఇచ్చేందుకు వీలున్నా ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో ఇవాళ 102కు చేరిన లీటరు పెట్రోల్‌ ధర భవిష్యత్తులో మరింత పెరిగినా ఇదే పరిస్ధితి తప్పదన్న వాదన వినిపిస్తోంది. గతంలో వైఎస్‌ హయాంలో గ్యాస్ ధరలు పెరిగినప్పుడు సిలెండర్‌పై రూ.25 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ భరించింది. ఆ విషయాన్ని ప్రస్తుత పరిస్ధితులతో పోల్చి జనం గుర్తు చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+