విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడుపు మండి రాజకీయాల్లోకి వచ్చా: పవన్

By Pratap
|
Google Oneindia TeluguNews
 Live: Pawan Kalyan speech at Visakha

విశాఖపట్నం: జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం సభకు గురువారం పెద్ద యెత్తున అభిమానులు తరలి వచ్చారు. అబిమానులు జనసేన జెండాలు ధరించి సమావేశానికి వచ్చారు. కేరింతలు కొడుతూ నినాదాలు చేస్తూ అభిమానులు కనిపించారు. సభా స్థలి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జనసందోహం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు 2014 అడుగుల జెండాను ఆవిష్కరించారు.

పవన్ కళ్యాణ్ చాలా ఆలస్యంగా సాయంత్రం 7.20 నిమిషాల ప్రాంతంలో వేదికపైకి వచ్చారు. వేదిక మీద కలియదిరుగుతూ అబిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. నేరుగా మైక్ వద్దకు వెళ్లి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/YOZkIn39ElA?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

అందరి రాజకీయ నాయకుల మాదిరిగా వేషభాషలు వేసుకోకపోతే ఫరవా లేదా అని అడిగారు. వేసుకున్న ప్యాంట్ ఇంగ్లాండు నుంచి వచ్చిందా అని అడిగారు. వైజాగ్ అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. నటుడిగా తనకు ఓనమాలు నేర్పింది వైజాగ్ అని ఆయన అన్నారు హోటల్ నుంచి సముద్రం కనిపిస్తా ఉంది, ఒకప్పుడు భిమీలీలో తిరిగేవాడినని, రామకృష్ణా బీచ్‌లో జాగింద్ చేస్తూ ఉండేవాడినని ఆయన అన్నారు. తెలుగు ప్రజలంతా ఏకమై గొంతెత్తి ఇరిస్తే

పల్లకీలు మోసి ఢిల్లీ పీఠం మీద కూర్చోబెడితే మనకే వెన్నుపోటు పొడిచారని, నిర్దాక్షిణ్యంగా తోసేయాలని, కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని ఆయన అన్నారు. రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంద సమస్యలు సృ,ష్టించడానికి కాదని, సమస్యలు పరిష్కరించడానికి అని ఆయన అన్నారు.

పల్లకీలు మోయించి, పదే పదే అవమానించారని ఆయన అన్నారు. కలిసి ఉన్నవారిని విడగొట్టి కనీసం పశ్చాత్తాపం కూడా లేదని ఆయన అన్నారు. ఈ ప్రాంతానికి వచ్చి ప్రజలకు చెప్పాలని కూడా అనుకోవడం లేదని ఆయన అన్నారు. అవినీతి, లంచగొండితనం ఉన్నాయని, ప్యాకేజీలు మనకు న్యాయం చేయగలవా అని అన్నారు. ఎంగిలి మెతుకుల్లా ప్యాకేజీలు విసిరేస్తున్నారని ఆయన అన్నారు.

బాధలు, మోసాలే జనసేన పార్టీ పెట్టడానికి కారణమని, కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థను రూపుమాపాలంటే మూలాల నుంచి కూలదోయాలని ఆయన అన్నారు. అలాంటి రాజకీయాలను కూలదోయాలంటే బలమైన సిద్ధాంతాలు కావాలని అన్నారు. ప్రతి ఐదేశ్లకోసారి సిద్ధాంతాలు మార్చే కాంగ్రెసు కాదని ఆయన అన్నారు. కాలాలు మారినా మారని సిద్ధాంతాలు కావాలని అన్నారు. అన్ని సిద్ధాంతాలు చదివానని, తన నుంచి పుట్టిన సిద్ధాంతం లక్ష్యం వైపు చూస్తుందని ఆయన అన్నారు. ఇజమే జనసేన సిద్ధాంతమని ఆయన అన్నారు.

జనసేన సిద్ధాంతాన్ని జాతికి, మీకు, ఈ దేశానికి పేరుపేరునా అంకితం ఇస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రతి ఐదేళ్లకోసారి కండువాలు, జెండాలు మార్చే నాయకుల మాదిరిగా తాను రాజకీయాల్లోకి రాలేదని ఆయన అన్నారు. మన ప్రాంతాలన్నీ ఒక రాష్ట్రంగా ఉండేదని, దాన్ని విడగొట్టారని ఆయన అన్నారు.

రోమన్ చక్రవర్తులు ఎంగిలి మెతుకులు విసిరినట్లు తెలుగు ప్రజలకు ప్యాకేజీలు విసిరారని ఆయన అన్నారు. కడుపు మండి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. భారత జాతికి తూట్లు పొడిచారని ఆయన అన్నారు. 120 ఏళ్ల చరిత్ర అంటారు, ఇది కాంగ్రెసు చేసిన నిర్వాకమని అన్నారు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లుగా ఉందని ఆయన అన్నారు.

మహాత్మా గాంధీ ఇంటి పేరు పెట్టుకున్నంత మాత్రాన వాళ్లు వీళ్లయిపోరని, గాంధీ డిఎన్ఎ వాళ్ల రక్తంలోకి వెళ్లి ఉంటే ఇలా ఉండేది కాదని ఆయన అన్నారు. అవకాశవాదం ముసుగు కాంగ్రెసు వేసుకుందని ఆయన అన్నారు. పది కోట్ల ప్రజలు ఏకమై గొంతెత్తితే కాంగ్రెసును మట్టిలో కలిపేయవచ్చునని ఆయన అన్నారు. తనకు అధికార వ్యామోహం లేదని, విమర్శలు చేసేవారి పప్పులు ఉడకవని ఆయన అన్నారు.

కాంగ్రెసు నాయకులు తమ వ్యాపారాలు వారు చేసుకుంటూ ప్రజలను కూడా చూడాలని ఆయన అన్నారు. సముద్రం వంగి సలాం చేయదని, మనందరం చేయెత్తితే ఒక దేశం జెండాకున్నంత పవరుందని ఆయన అన్నారు. రాజకీయ జూదాన్ని నిలదీయడానికే జనసేన పార్టీ పెట్టానని ఆయన అన్నారు.

తకన క్లారిటీ లేదని అన్నారని, అయితే తాను పోటీ చేయడానికి రాలేదని, రాజకీయాలను సమూలంగా మార్చడానికి వచ్చానని, తనకు పొలిటికల్ మైండ్ లేదని అన్నారని, అది లేకపోతే ఇక్కడ కలుసుకోగలమా అని అన్నారు. రాజకీయ నాయకులు బూతులు తిట్టుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తాను ప్రతి పార్టీనీ తిడుతూ ఉంటానని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన కన్నా, విభజించిన తీరే ఎక్కువ బాధేసిందని చెప్పారు. ఫ్లోరోసిస్ సమస్యపై పోరాడానికి జిట్టా బాలకృష్ణా రెడ్డిని వాడుకుని వదిలేశారని ఆయన పరోక్షంగా కెసిఆర్‍‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బెదిరింపులకు ఎదురొడ్డే ధైర్యం జనసేనకు ఉందని ఆయన అన్నారు. అవినీతి రాజకీయ నాయకులను మూలం నుంచి పెకిలించి వేయడమే జనసేన మానిఫెస్టో అని ఆయన అన్నారు. ఏ ఒక్కరి మీదా, ఏ ఒక్క పార్టీ మీద పోరాటం కాదని, అవినీతి మీద పోరాటమని, సామాజిక న్యాయం చేయడమే మన జెండా అని ఆయన అన్నారు. మార్పులు తేవాలంటే అందరూ ఆశించిన సిద్దాంతాలు కావాలని, అందుకే ఇజం తెచ్చానని ఆయన అన్నారు. రాబోయే ఎన్నకల కోసం ఈ ఇజం కాదని, భావి తరాల కోసం ఇది అని పవన్ కళ్యాణ్ అన్నారు.

జెండాలోని ఆరు కోణాలు ఆరు సిద్ధాంతాలను చెబుతాయని అన్నారు. చట్టం అందరికీ సమానంగా పనిచేయడం అందులో ఒకటి అని ఆయన అన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్లు దానికి తూట్లు పొడిస్తే మనకు ఎలా నమ్మకం కుదురుతుందని ఆయన అన్నారు. వేనవేల కోట్లు దోచేసేవారిని ఏమీ చేయరని ఆయన అన్నారు. సిబిఐని ముందు పెడుతారు గానీ వేలకు వేలు దోచేశారని చెబుతారని, బెయిల్ ఇచ్చేయాలని చెబుతారని ఆయన అన్నారు. వాళ్లకు అనుకూలంగా ఉంటే దోపిడీ చేసుకో ఫరవాలేదని కాంగ్రెసు నాయకుల విధానమని, అనుకూలంగా లేకపోతే కేసులు పెట్టి లొంగిన తర్వాత వదిలేయాలంటూరని ఆయన అన్నారు. అందరికీ చట్టం సమానంగా పనిచేయాలనేదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. ఇందుకు జనసేన పోరాడుతుందని అన్నారు.

గొర్రె కసాయి వాడిని నమ్మినట్లుగా మనం నమ్మామని, ప్రజా సంక్షేమం వదిలేయడం వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని ఆయన అన్నారు. నా కోసం, నా కుటుంబం కోసం అని రాజకీయ నాయకులు ఆలోచించడం వల్లనే రాష్ట్రాన్ని చీల్చారని అన్నారు.

అన్నయ్య అంటే ప్రేమే..

అన్నయ్యను మీరు, నేనూ ప్రేమిస్తామని, ఆ భగవంతుడి లీల, నేను ఊహించలేదు ఇలా చేస్తానని ఆయన అన్నారు. అన్నయ్య మీద ప్రేమ గుండెల్లో ఉందని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నారని, ఉన్నత ఆశయాలతో పెట్టామని ఆయన అన్నారు. కాంగ్రెసులో విలీనం చేస్తే మంచి జరుగుతుందేమోనని తాను అనుకున్నానని, ఐదేళ్ల పాటు అందుకే తాను మాట్లాడలేదని ఆయన అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఏ వైపు ఉందని ఆయన అన్నారు. ప్రజలను, పాలకులను మనం వేరుగా చూడాలని, రాజకీయ నాయకులు ప్రజల మధ్య గొడవలు పెడుతారని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ఉన్నవాడు, శ్రీకాకుళంలో ఉన్నవాడు ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఉండరు, కానీ ఒకరంటే ఒకరికి పడదని ఆయన అన్నారు.

ఆఖరి నిమిషంలో తాను పార్టీ పెట్టలేదని, దీని స్థాపన వెనక వేదన ఉందని అన్నారు. కుటుంబాన్ని వదులుకున్నానని ఆయన చెప్పారు. కొట్టుకోండని పార్లమెంటును వదిలేశారని ఆయన అన్నారు. అలాంటి పరిస్థితిని ఎందుకు తెచ్చారని ఆయన అడిగారు. మీకు ఇంగిత జ్ఝానం లేదా, రాజకీయ పరిజ్ఝానం లేదా, అనుభవం లేదా అని అడిగితే సమాధానం ఉండదని, అహంకారంతోనే అలా చేస్తున్నారని ఆయన అన్నారు. సోనియా గాంధీ విభజన తర్వాతనైనా వచ్చి ఏ పరిస్థితిలో విభజించానో చెప్పాల్సిన అవసరం గుర్తించలేదని ఆయన అన్నారు.

సోనియా తల్లి కాదు..

సోనియా గాంధీని తల్లి అంటున్నారని, ఆమె తల్లి కాదని, రాజకీయ నాయకురాలు అని ఆయన అన్నారు. సోనియాను తల్లి అనడం రాజకీయ నాయకులు మానేయాలని అన్నారు. తెలంగాణ ప్రజలకూ అన్యాయం జరిగిందని, సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేశారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఏ పరిస్థితిలో విభజించామో చెప్తారా అని తాను చూశానని ఆయన అన్నారు. సీమాంద్ర ఎంపీలు రాయపాటి, కావూరి ఉన్నారని, వారికి వ్యాపారాలు ఉన్నాయని, బొత్స సత్యనారాయణకు వ్యాపారాు ఉన్నాయని, అలాంటి వారికి తెలియకపోవచ్చునని అన్నారు. వారిని గౌరవిస్తాం, గుర్తిస్తాం గానీ ప్రజలకు అన్యాయం చేస్తుంటే మౌనంగా ఉండలేమని అన్నారు.

ఓ 14 ఏళ్ల పిల్లవాడు కెసిఆర్‌కు బెదిరిస్తూ ఫోన్ చేశారని, అది చూసి తనకు భయమేసిందని, ఇలాంటి లక్ష మంది కలిస్తే దేశం ఏమవుతుందని అన్నారు. శ్రీలంకలాంటి ఉద్యమం ఎందుకు రాదనే భయం తనకు వేసిందని ఆయన అన్నారు. 20 ఏళ్ల తర్వాత ఒక్కో రాజకీయ నాయకుడు వ్యక్తిగత ప్రయోజనం కోంస రాజకీయం చేస్తే సీమాంధ్రలో, తెలంగాణలో వేర్పాటు ఉద్యమాలు వస్తాయని, దాన్ని తట్టుకోలేకనే తాను పార్టీ పెట్టానని ఆయన అన్నారు. చరిత్ర చదివానని, లక్షల్లో జీవితాలు త్యాగాలు చేస్తే గానీ స్వేచ్ఛ లభించలేదని ఆయన అన్నారు. అవకాశవాద రాజకీయ నాయకులను సమూలంగా తీసేయడానికే ఇప్పటి సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చానని ఆయన అన్నారు.

నీతినియమాలు లేని వ్యక్తులు, వ్యాపారాలు చేసే వ్యక్తులు, కాంట్రాక్టులు చేసేవారు రాష్ట్రాన్ని విభజిస్తుంటే నోరు మెదపలేకపోయారని ఆయన అన్నారు. తెలంగాణ ఎంపీలు పోరాటం చేస్తుంటే సీమాంధ్ర ఎంపీలు ఎందుకు ఆపలేకపోయారని, వీరంతా వ్యాపారులని, అందుకే వారు ఆ పని చేయలేదని ఆయన అన్నారు. విభజనను కనీస నిబద్ధతతో చేయాలనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదా, ఎంత సేపూ కాంట్రాక్టులూ వ్యాపారాలేనా అని అడిగారు.

వార్ రూం వ్యూహాలంటున్నారని, కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ 1 1గంటల పాటు అధికారం ఎలా సంపాదించాలని చూశారని, ఎన్నికల కోసం అంత చేస్తారే, రాష్ట్రాన్ని విభజించేప్పుడు ఒక్క గంట కూర్చోరా అన్నారు. మేకప్పు సినిమా కోసం వేస్తున్నానని, వాళ్లు మేకప్పు వేసుకుని వచ్చి మనలను మోసం చేస్తుంటారని ఆయన అన్నారు. తనకు వ్యక్తులపై కోపం లేదని, వారి పేర్లు చెప్పడం ఇష్టం లేదని, కొత్త రాజధాని ఎక్కడ పెట్టుకుందామని ఇరు ప్రాంతాల శానసభ్యులు పిచ్చిగా జోకులు వేసలుకుంటున్నారని ఆయన అన్నారు. పిచ్చి పిచ్చిగా బాధ్యత లేకుండా వ్యవహరించే నాయకులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. అటువంటి నాయకులను తన్ని తగలేయడానికే జనసేన పార్టీ వచ్చిందని అన్నారు.

కొత్త పార్టీ వస్తుందంటే సీనియర్ పార్టీలకు కోపం వస్తుందని, తామే పాలిస్తామంటారని అన్నారు. దాడులు చేస్తాం, కదలనివ్వం అనే నాయకులు కొంత మంది ఉన్నారని, తాము గాంధీ సిద్ధాంతాలను నమ్ముతామని, మీరు ఆలంటి మాట్లాడుతుంటే భరిస్తామని, పదే పదే కొత్తగా వ్చచిన పార్టీలను రెచ్చగొడితే, ఒక్క చెంప మీద కొడితే రెండు చెంపలు పగిలిపోయేలా కొడుతామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎదురు దాడి చేయడం చేత కాదని అనుకోవద్దని, తనకు వచ్చునని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం యుద్ధం చేస్తున్నానని, వ్యక్తిగతంగా తీసుకోవద్దని అన్నారు. తాడో పేడో తేల్చుకుందామంటే సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

కుల, మత, ప్రాంత రాజకీయాలు చేయబోనని అన్నారు. వాటితో రాజకీయాలు చేస్తే జనసేన ఎదుర్కుంటుందని ఆయన అన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పోరాడే నేతల కోసం అన్వేషిస్తామని, సిద్ధాంతాల కోసం ప్రాణత్యాగం చేయాడానికైనా సిద్ధమని అన్నారు. తాను పిడికెడు మట్టే కావచ్చు గానీ చేయెత్తితే ఓ దేశానికి ఉన్నంత పొగరు ఉందని అన్నారు. స్వార్థం లేని నాయకులు దొరికే వరకు ఎన్నికల్లో పోటీ చేయబోనని అన్నారు.

నిస్వార్థులు దొరికే వరకు పోటీ చేయం

సోనియా కూడా మారి క్షమాపణ చెబుతారని అనుకుంటున్నట్లు తెలిపారు. నీతి తప్పిన నాయకులను చట్టసభలకు పంపినందుకే రాష్ట్ర విభజన జరిగిందని అన్నారు. ఎన్నికలకు దూరంగా ఉన్నా ప్రజల తరఫున పోరాటం చేస్తానని చెప్పారు. సైద్ధాంతిక విభేదాలే గానీ ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని అన్నారు. సమాజం కోసం పనిచేసే యువ నాయకుల కోసం వెతుకున్నానని, అలాంటి నాయకులు దొరికే వరకు పోటీ చేయబోనని, అలాంటి నాయకులు దొరికితే సమాంధ్రతో పాటు తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పారు. సీమాంధ్ర ప్రజల తరఫున నిలబడింది మజ్లీస్ నాయకులేనని అన్నారు. భావోద్వేగాల వల్ల గొడవలు జరుగుతాయని, అయితే ఎక్కడో ఒక్క దగ్గర తగ్గాలని, భగవంతుడు కొట్టుకోవడానికి పుట్టించేలేదని, బతకడానికి పుట్టించాడని అన్నారు.

మోడీతో బేటీపై..

మోడీ వద్దకు ఎలా వెళ్తావని హేళన చేస్తూ రెండు ప్రాంతాల నాయకులు మాట్లాడారని అన్నారు తెలంగాణ సాధించడానికి బిజెపి, కమ్యూనిస్టు పార్టీలు - అన్ని పార్టీలు కావాలని, అయితే పవన్ కల్యాణ్ కలిస్తే తప్పా, మీకో సిద్ధాంతం నాకో సిద్ధాంతమా అని అన్నారు. తాను మోడీని కలిస్తే తప్పా అని అన్నారు యుపిఎ విధానాలతో విసిగిపోయానని, కనీసం కాకినాడలో ప్రత్యేక తెలంగాణ అని చెప్పారని, ఆ రోజుల్లో సీమాంధ్ర నాయకులు ఎవరూ మాట్లాడలేదని, అందువల్ల బిజెపి గురించి మాట్లాడలేకపోతున్నామని అన్నారు.

దేశ క్షేమం కోసం తాను దేనికీ, ఎవరికీ భయపడబోనని, నిజాన్ని కచ్చితంగా మాట్లాడగలిగే నాయకుడు కావాలని, మన దేశంలో ఎవరున్నారని, ఉత్తేజపరిచే గలిగే నాయకులు ఎవరైనా ఉన్నారా అని అడిగాతు. అలాంటి లక్షణాలు నరేంద్రమోడీలో కనిపించాయని, అందుకే తాను కలిశానని, నరేంద్ర మోడీకి భయాలు లేవని అన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కచ్చితంగా మాట్లాడింది ఒక్క నరేంద్ర మోడీయేనని అన్నారు. ఒక్క తల్లి బిడ్డలను వేరు చేయగలదా అని మోడీ అన్నారని పవన్ గుర్తు చేశారు. పార్లమెంటుపై దాడి జరిగితే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ రాజకీయ నాయకుడైనా ధైర్యంగా ఎదిరించి మాట్లాడగలిగాడా, వారికి ధైర్యమూ దమ్మూ ధైర్యమూ లేవని అన్నారు.

నరేంద్ర మోడీని ప్రధానిగా చూడాలని ఉందని ఆయన అన్నారు. 20. 28 మంది ఎంపీలను నిలబెట్టడానికి 96 మంది శానససభా స్థానాలు వెతికానని, తనకు ఓట్లు చీల్చడం ఇష్టం లేక పోటీ చేయదలుచుకోలేదని, మీకు ఇష్టమైన వారికి ఓట్లు వేయాలని అన్నారు. కొత్త రాజధానిని నిర్మించగలరని అనుకుంటారో వారికి ఓట్లు వేయాలని ఆయన సూచించారు. తాను పదవి కోసం, వ్యక్తిగత ప్రయోజనం కోసం పాకులాడినట్లు రుజువు చేయగలిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. 2014 తర్వాత సీమాంధ్రలోనూ, తెలంగాణలోనూ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజా సమస్యలు పక్కన పెట్టి పిచ్చి పిచ్చి రాజకీయాలు చేస్తే సిద్ధాంతాలు మాత్రమే మాట్లాడే జనసేన ఉద్యమ స్వరూపమేమిటో చూపిస్తామని అన్నారు. ప్రతి శాసనసభ్యుడినీ ఈ రోజు నమ్ముతున్నానని, వైజాగ్ సాక్షిగా చెబుతున్నానని, నీతినిజాయీతీ తప్పిన రోజు ఉద్యమ స్వరూపం చూపిస్తానని అన్నారు. అప్పటి దాకా తాను వింటానని అన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalayn speech at Viskahapatnam. he will release Ism book written by him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X