మహానాడుకు హరికృష్ణ: బాబుతో విభేదాలు తొలగేనా?

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహానాడుకు రంగారెడ్డి జిల్లాలోని గండిపేట వేదిక ముస్తాబైంది. మహానాడులో పార్టీ విధాన నిర్ణయాలు తీసుకుని, దశనూ దిశనూ నిర్దేశించుకుంటుంది. ఈ మహానాడు రెండు రోజులు జరుగుతుంది. మంగళవారం మహానాడు ప్రారంభమైంది. సీమాంధ్రలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతల్లో ఉత్సాహం నెలకొని ఉంది.

తెలుగుదేశం పార్టీ మహానాడు రాజ్యసభ మాజీ సభ్యుడు హరికృష్ణ హాజరయ్యారు. ఆయన మంగళవారం ఉదయం చాలా త్వరగా మహానాడు జరుగుతున్న ఆవరణకు వచ్చారు. చాలా కాలంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో విభేదాలున్నాయి. ఆ విభేదాల కారణంగానే ఆయనకు చంద్రబాబు ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి విజయం సాధించడంతో ఆయన తిరిగి చంద్రబాబుకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే, చంద్రబాబు ఆయన చేరదీస్తారా అనేది సందేహంగానే ఉంది. ఒక్కసారి తనతో విభేదించి, తనను కాదన్నవారిని తిరిగి దరి చేర్చుకునే తత్వం చంద్రబాబుది కాదు.

ఏ పార్టీ అయినా స్థాపన జరిగిన తర్వాతి ఎన్నికల్లో విజయం సాధించాలని, అందువల్ల వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మనుగడ లేదని చంద్రబాబు నాయుడు అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పరిటాల రవి సహా ఎంతో మంది టిడిపివారిని హత్య చేశారని ఆయన ఆరోపించారు.

గతంలో ఓటమికి చిరంజీవి పార్టీ ప్రజారాజ్యాన్ని చంద్రబాబు నిందించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టించి, ఓట్లు చీల్చి కాంగ్రెసు పార్టీ తమ పార్టీని ఓిడంచారని ఆయన అన్నారు.

చంద్రబాబు నాయుడు మహానాడు ప్రారంభోపన్యాసం సాగిస్తున్నారు. తెలుగుజాతికి పార్టీ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో కూడా మంచి ఫలితాలు సాధించామని ఆయన చెప్పారు. తెలంగాణలోని పార్టీ కార్యకర్తలను ఆయన అభినందించారు. తాము బలపరిచిన బిజెపి ప్రభుత్వమే కేంద్రంలో ఉందని ఆయన చెప్పారు. కార్యకర్తల శ్రమ ఫలితమే టిడిపి విజయమని ఆయన అన్నారు.

మహానాడు ప్రాంగణంలో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఎమ్మెల్యే వెంకటరమణ స్పృహ తప్పి పడిపోయారు. ఆయనకు స్పల్వ గాయాలు అయ్యాయి. ఆయనను ఆస్పత్రికి తరలిచారు.

Live: TDP Mahanadu in Hyderabad

మహానాడు వేదికపై నారా చంద్రబాబు నాయుడితో పాటు హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఆసీనులయ్యారు. యనమల రామకృష్ణుడు కూడా మహానాడు వేదికపై కూర్చున్నారు. తెలంగాణ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వేదిక లభించింది. అంతకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీ పతాకను ఆవిష్కరించారు. ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఫొటో ప్రదర్సనను, రక్తదాన శిబిరాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహానాడు వేదిక వద్దకు చేరుకున్నారు. ఆయన చిత్తూరు జిల్లా కౌంటర్ వద్ద తన సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. మహానాడు సందర్భంగా కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.

Live: TDP Mahanadu in Hyderabad

మహానాడు వేదిక వద్దకు పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో విభేదాలున్నాయని భావిస్తున్న తరుణంలో హరికృష్ణ రావడం ప్రాధాన్యాన్ని చేరుకుంది.

రెండు రోజుల పాటు జరిగే టిడిపి మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు తరలి వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+