అనంతపురంలో మరో మహిళపై తెలుగు తమ్ముళ్ల దాడి

అనంతపురంలో మహిళల పైన మరోసారి దౌర్జన్యం జరిగింది. సోమవారం రాత్రి గుమ్మఘట్ట మండలం పూలకుంటలో లక్ష్మి అనే మహిళ పైన తెలుగు తమ్ముళ్లు దాడి చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

అనంతపురం: అనంతపురంలో మహిళల పైన మరోసారి దౌర్జన్యం జరిగింది. సోమవారం రాత్రి గుమ్మఘట్ట మండలం పూలకుంటలో లక్ష్మి అనే మహిళ పైన తెలుగు తమ్ముళ్లు దాడి చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

బాధితురాలు తెలిపిన వివరాల మేరకు... పూలకుంటలో ఆంజనేయస్వామి ఆలయంలోని సప్లయర్ సామాగ్రికి సంబంధించి లావాదేవీల బాధ్యతలను లక్ష్మి భర్త హనుమంత రెడ్డికి గ్రామపెద్దలు అప్పగించారు.

Local leader attack on woman in Anantapur district.

వచ్చే ఆదాయాన్ని గ్రామంలో వేలంపాట ద్వారా స్థానిక నాయకుడైన చెన్నప్ప రూ10వేలు వడ్డీకి వీరి వద్ద తీసుకున్నాడు. గత వినాయక చవితి నాడు ఆ డబ్బు కట్టాలని ఆడగడంతో ఆ రోజే హనుమంతరెడ్డిని కొట్టాడని చెబుతున్నారు. అప్పట్లో రాజీ కుదిర్చారు.

ప్రస్తుతం హనుమంత రెడ్డి కూలీ పనుల కోసం బెంగళూరుకు వలస వెళ్లగా భార్య లక్ష్మి, తల్లి అనంతమ్మ ఇంట్లో ఉన్నారు. సోమవారం చెన్నప్ప సోదరుడు తాగి వచ్చి.. వారిపై ఆగ్రహించినట్లుగా తెలుస్తోంది. అధికారం తమదని గొడవ చేశాడు. దాడి కూడా చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. ఆమె ఆసుపత్రిలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+