వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ ఎఫెక్ట్ ... పెన్షన్ లతో పాటు ఆర్ధిక సాయం ఇచ్చేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇక ఏపీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక ఈ సమయంలో కరోనా వ్యాప్తిని అరికట్టటానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు . లాక్ డౌన్ ప్రకటించారు . ఇక ఈ సమయంలో నిరుపేదలకు కష్టం కలుగకుండా తగు చర్యలు చేపట్టిన సీఎం జగన్ ఆ దిశగా అధికారులను ఆదేశించారు.

ఏప్రిల్ 1వ తేదీన ఇళ్ళ వద్దకే పెన్షన్

ఏప్రిల్ 1వ తేదీన ఇళ్ళ వద్దకే పెన్షన్


ఏపీలో తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో బడ్జెట్ పాస్ కాకపోవడంతో మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం ఆర్డినెన్సు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం . ఇక ఈనేపధ్యంలో ముందుగా పెన్షన్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీన ఇళ్ళ వద్దకే పెన్షన్ మొత్తాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ శనివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు.

ఏప్రిల్‌ 4న ప్రతి నిరుపేద కుటుంబానికి వెయ్యి రూపాయల ఆర్ధిక సాయం

ఏప్రిల్‌ 4న ప్రతి నిరుపేద కుటుంబానికి వెయ్యి రూపాయల ఆర్ధిక సాయం

అంతే కాదు ఇదివరకే సీఎం చెప్పినట్టు ఏప్రిల్‌ 4న ప్రతి నిరుపేద కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున కరోనా సాయాన్ని పంపిణీ చేయాలని నిర్దేశించారు. ఈ మేరకు గ్రామ వాలంటీర్లు ఆర్థిక సాయాన్ని అందజేస్తారని పేర్కొన్నారు . కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్రంలో లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. ఏ పనులు చేసుకునే పరిస్థితి లేదు. ఇక ఈ నేపధ్యంలో ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో పేదలను ఆదుకోవాలని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.

 రేషన్ విషయంలో కూడా సీఎం జగన్ ఆదేశాలు

రేషన్ విషయంలో కూడా సీఎం జగన్ ఆదేశాలు

పెన్షన్ మొత్తాలను ఏప్రిల్ ఒకటవ తేదీన చెల్లించడంతోపాటు దానికి అనుగుణంగా కరోనా లాక్ డౌన్ సందర్భంగా ఇస్తామన్న వెయ్యి రూపాయలు కూడా అందించటానికి ఈ రెండు రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జగన్ . అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇక అంతే కాదు నిరుపేదలకు ఇచ్చే రేషన్ విషయంలో కూడా నిర్ణయం తీసుకున్న జగన్ మార్చి 29 నుంచి ఉచితంగా బియ్యం, కేజీ కంది పప్పు పంపిణీ చేయాలని తలపెట్టారు.

ఉచి రేషన్ మూడు సార్లు అందించాలని ఆదేశాలు

ఉచి రేషన్ మూడు సార్లు అందించాలని ఆదేశాలు

ఏప్రిల్‌ 15న మరోసారి ఉచిత రేషన్, అప్పుడు కూడా ఉచితంగా కేజీ కందిపప్పు పంపిణీ చేస్తారు. ఏప్రిల్‌ 29న మూడోసారి ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా పథకంలో లేని కార్డులకు కూడా రేషన్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఆమేరకు అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు . కరోనా సమయంలో పేదలెవ్వరికీ ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి .

English summary
The pension amount will be paid on April 1 and the corona relief financial support will be given Rs.1000. Jagan also decided to distribute rice and kg of dal for free from March 29.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X