Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజీనామాలు ఆమోదించను: స్పీకర్, మళ్లీ వస్తాం.. వైసీపీ ఎంపీలు, 'హాజరైనా జాప్యం ఎందుకు'

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంగళవారం లోకసభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. రాజీనామా చేయడానికి గల కారణాలను ఆమె వారిని అడిగి తెలుసుకున్నారు. రాజీనామాలు భావోద్వేగంతో చేసినట్లుగా ఉందని, పునరాలోచించుకోవాలని ఆమె సూచించారు. అనంతరం వారం రోజుల తర్వాత కలవాలని చెప్పారు.

చదవండి: భావోద్వేగంతో రాజీనామాలు, మళ్లీ ఆలోచించండి: వైసీపీ ఎంపీలకు స్పీకర్ సుమిత్ర

స్పీకర్‌తో భేటీ అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. మా రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రాజీనామాలపై మరోసారి ఆలోచించాలని స్పీకర్ కోరారని, మేం మాత్రం తక్షణమే ఆమోదించాలని కోరామన్నారు. కర్ణాటకలో ఇద్దరు ఎంపీల రాజీనామాలు ఆమోదించారని, తమవి కూడా ఆమోదించాలని కోరినట్లు తెలిపారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు ఇచ్చామన్నారు.

ఏపీ స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదే?

ఏపీ స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదే?

ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్తే బలం చేకూరుతుందనేది తమ నమ్మకమని వైవీ అన్నారు. రాజీనామాలు ఆమోదించకుంటే మళ్లీ వచ్చి స్పీకర్‌ను అడుగుతామని చెప్పారు. టీడీపీ ఎంపీలు కూడా మాతో పాటు రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. మా ఎమ్మెల్యేలను టీడీపీ సంతలో పశువులను కొన్నట్లుగా కొన్నారని, వారిపై అసెంబ్లీ స్పీకర్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, హోదాపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

రాజీనామాలు ఆఖరి అస్త్రం

రాజీనామాలు ఆఖరి అస్త్రం

ప్రత్యేక హోదా కోసం ఆఖరి అస్త్రంగా తాము రాజీనామాలు చేశామని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. తక్షణమే రాజీనామాలు ఆమోదించాలని కోరామని, లేదంటే మళ్లీ వచ్చి అడుగుతామని స్పీకర్‌తో చెప్పామన్నారు. హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ఎంపీ వరప్రసాద్ అన్నారు. ఫిరాయింపుల అంశాన్ని కూడా స్పీకర్‌ను అడిగామని, ప్రివిలేజ్ కమిటీకి పంపామని చెప్పారని, వెంటనే చర్యలు తీసుకోకుంటే ఆ చట్టానికి అర్థం లేదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు బీజేపీతో నాలుగేళ్లు కలిసి ఉండి ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.

ఉప ఎన్నికలకు మేం సిద్ధం

ఉప ఎన్నికలకు మేం సిద్ధం

ప్రజలలోకి వెళ్లేందుకు సీఎం చంద్రబాబు భయపడుతున్నారని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. రాజీనామాలు చేస్తే ఓటమి చెందుతామని భయపడుతున్నారన్నారు. అందుకే ఎంపీల పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశాన్ని పెండింగులో పెట్టారన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరామని, ఉప ఎన్నికలకు తాము సిద్ధమన్నారు. కాగా, వారు భావోద్వేగంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారని, పునరాలోచన చేయాలని, ఇప్పుడు ఆమోదించనని, వచ్చే వారం రావాలని వైసీపీ ఎంపీలకు సూచించిన విషయం తెలిసిందే.

స్పీకర్ ఎదుట హాజరైనా ఆమోదించరా?

స్పీకర్ ఎదుట హాజరైనా ఆమోదించరా?

వైసీపీ ఎంపీల రాజీనామాల్లో చిత్తశుద్ధి లేదని తేలిపోయిందని మంత్రి యనమల రామకృష్ణుడు అంతకుముందు ఎద్దేవా చేశారు. రాజీనామాల పేరుతో వైసీపీ, బీజేపీ డ్రామాలాడుతున్నాయన్నారు. రాజీనామాలు ఆమోదించకుండా తాత్సారం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. స్పీకర్‌ ఎదుట హాజరై రాజీనామాలు ఆమోదించమని కోరితే ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీని గద్దె దించడమే టీడీపీ ధ్యేయమన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+