ఈసీ తీరును నిరసిస్తూ లోకేశ్ ధర్నా
గుంటూరు : ఏపీలో ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ మంత్రి లోకేశ్ ఆందోళన చేపట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్రిస్టియన్ పేట వద్ద లోకేశ్ నిరసనకు దిగారు. లోకేశ్ ధర్నా చేయడంతో ప్రతిగా వైసీపీ శ్రేణులు కూడా నిరసనకు దిగాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు .. ఇరువర్గాలను నచ్చజెప్పి పంపించివేయడంతో గొడవ సద్దుమణిగింది.
ఈసీ తీరుపై ఆగ్రహం
అంతకుముందు మంగళగిరిలో లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రజలను ఈసీ పశువుల కన్నా హీనంగా చూసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వయోజనులు తమ ఓటేసేందుకు వస్తే .. సహకరించలేదని పేర్కొన్నారు. ఓటింగ్ శాతం తగ్గిన చోట రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పోలింగ్ కు సంబంధించి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత ఈసీని కోరతామని చెప్పారు.













Click it and Unblock the Notifications