రెండు కిమీ నడిచిన ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్

హైదరాబాద్/న్యూఢిల్లీ: గండిపేటలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి హాజరయ్యేందుకు హిందూపురం శాసన సభ్యుడు, హీరో నందమూరి బాలకృష్ణ, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌లు రెండు కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చింది.

మంగళవారం గండిపేటలో మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. గండిపేట రహదారి పసుపు వర్ణంగా మారింది. భారీగా నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. దీంతో చాలాదూరం ట్రాఫిక్ జాం అయింది. దీంతో బాలకృష్ణ, నారా లోకేష్‌లు రెండు కిలోమీటర్ల దూరం నడిచి మహానాడు వేదిక వద్దకు చేరుకున్నారు.

Lokesh and Balakrishna walk two kilometers

మోడీ ప్రజల గురించే ఆలోచిస్తారు: అశోక గజపతి రాజు

ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఢిల్లీలో అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయిందన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ మౌళిక వసతులు ఉన్నాయన్నారు. రెండు రాష్ట్రాల్లో లెక్కకు మిక్కిలి సమస్యలు ఉన్నాయన్నారు. సమస్యలను పరిష్కరించి అభివృద్ధి దిశగా రాష్ట్రాలను నడిపించాల్సిన అవసరం ఉందని అశోక గజపతి రాజు అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+