నన్ను ఇలానా.. సంపూర్ణేష్ తో పోలుస్తారా..? : లోకేష్ ఆవేదన
అధికార ప్రతిపక్షాల మధ్య ఉండే వివాదాలు కొన్నిసార్లు హాస్యాస్పద కామెంట్స్ కు దారి తీస్తాయి. విమర్శించే ప్రతిపక్షానికి, వినే జనానికి ఆ మాటలు నవ్వు తెప్పించినా..! టార్గెట్ చేసిన వ్యక్తులకు మాత్రం కోపం నశాలనికంటడం ఖాయం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పరిస్థితి కూడా ప్రస్తుతం ఇదే రకంగా తయారైనట్టుగా సమాచారం.
జగన్ జలదీక్ష సందర్ఛంగా వైసీపీ నేతలు లోకేష్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా మాట్లాడిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూషణం.. 'చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ను మహేష్ బాబులా తీర్చిదిద్దాలనుకున్నారని కానీ, కనీసం సంపూర్ణేష్ బాబులా కూడా తయారు చేయలేకపోయారని' విమర్శించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'లోకేష్ ను చంద్రబాబు మోహన్ బాబులా తయారు చేద్దామనుకున్నారు గానీ ఆఖరికి బాబు మోహన్ లా కూడా తయారు చేయలేకపోయారని' ఎద్దేవా చేశారు. కాగా.. ఈ వ్యాఖ్యలు కాస్త లోకేష్ చెవిన పడడంతో సదరు వైసీపీ నేత కామెంట్స్ పట్ల అసహనం వ్యక్తం చేశారట లోకేష్.
అంతేకాదు, తాను ఓ బిడ్డకు తండ్రి అయినా కూడా.. తనపై పప్పు, ఏమి తెలియని వాడంటూ ప్రతిపక్షాలు కామెంట్ చేయడంపై అసంతృప్తికి లోనవుతున్నారట లోకేష్. ముఖ్యంగా తనను సంపూర్ణేష్ బాబు కంటే తక్కువ చేసే విధంగా కామెంట్ చేయడంపై తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారట. కాగా.. దీనిపై ట్విట్టర్ ద్వారా లోకేష్ కౌంటర్ ఏమైనా ఇస్తారా..! అన్నది చర్చనీయాంశంగా మారింది.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications