Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోకేష్: కత్తీడాలు పట్టారు, శంఖం ఊదారు (పిక్చర్స్)

తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ తిరుపతిలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమవారం సత్యవేడులో ఎన్నికల ప్రచారం చేశారు. బాలకృష్ణను విమర్శించే అర్హత షర్మిలకు లేదని నారా లోకేష్ మండిపడ్డారు. మండిపడ్డారు. 400 ట్రక్కుల కల్తీసారా వస్తోందని అంటూ వాటిని టిడిపి కార్యకర్తలు అడ్డుకుని పోలీసులకు పట్టించాలని లోకేష్ పిలుపునిచ్చారు.

సీమాంధ్రలో తమ పార్టీ పూర్తి ఆధిక్యతతో అధికారంలోకి వస్తుందని, 147 శాసనసభా స్థానాలనూ 22 పార్లమెంటు స్థానాలనూ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. తన రాష్ట్రవ్యాప్త పర్యటనను నారా లోకేష్ తిరుపతిలో ముగించారు. సత్యవేడు నుంచి సాయంత్రానికి తిరుపతి చేరుకుని, అక్కడ రోడ్ షో నిర్వహించి తన ప్రచారాన్ని ముగించారు. లీలా మహల్ జంక్షన్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

సీమాంధ్ర ప్రజల ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, చంద్రబాబును గెలిపించి సీమాంధ్రను స్వర్ణాంధ్రగా, నవ్యాంధ్రగా మార్చుకుంటారో, సీమాంధ్రను సింగపూర్‌కు అమ్మే జగన్‌ను గెలిపించుకుంటారో తెల్చుకోవాలని ఆయన అన్నారు. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ లక్ష కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని లూటీ చేశారని ఆయన ఆరోపించారు. జగన్‌ను గెలిపిస్తే నరకమేనని ఆయన అన్నారు.

నారా లోకేష్‌కు సత్కారం..

నారా లోకేష్‌కు సత్కారం..

చిత్తూరు జిల్లా పర్యటనలో తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌కు భారీ పూలమాల వేశారు.

జగన్‌పై విరుచుకుపడిన లోకేష్

జగన్‌పై విరుచుకుపడిన లోకేష్

తన చిత్తూరు జిల్లా పర్యటనలో నారా లోకేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.

ముస్లింలతో లోకేష్...

ముస్లింలతో లోకేష్...

తన ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ ఇలా ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే చేపట్టే పథకాలపై వివరించారు.

కత్తీడాలు పట్టిన లోకేష్

కత్తీడాలు పట్టిన లోకేష్

చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ తన చిత్తూరు పర్యటనలో కత్తి, డాలు పట్టారు. ప్రత్యర్థులపై మాటల యుద్ధం సాగించారు.

నెత్తిన రుమాలు..

నెత్తిన రుమాలు..

చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌కు తల రుమాలు పెడుతున్న ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇలా..

శంఖం పూరించారు

శంఖం పూరించారు

తన చిత్తూరు జిల్లా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నారా లోకేష్ ఇలా ప్రచార వాహనంపై నుంచి శంఖం పూరించారు.

ఇలా చేతులు కలిపారు...

ఇలా చేతులు కలిపారు...

తన చిత్తూరు జిల్లా పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ మహిళలతో ఇలా కరచాలనం చేశారు.

జగన్ అమ్ముకుంటారు..

జగన్ అమ్ముకుంటారు..

జగన్‌ను గెలిపిస్తే సీమాంధ్రను సింగపూర్‌కు అమ్మకుంటారని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయలు సంపాదించారని లోకేష్ ఆరోపించారు.

తిరుపతిలో రోడ్ షో

తిరుపతిలో రోడ్ షో

చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ సత్యవేడులో ప్రచారం నిర్వహించిన తర్వాత తిరుపతి చేరుకుని రోడ్ షో నిర్వహించి ప్రచారాన్ని ముగించారు.

చేతులు కలిపారు

చేతులు కలిపారు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ తిరుపతిలో రోడ్ షో నిర్వహించారు. ఆయనతో చేతులు కలపడానికి పలువురు ఉత్సాహం ప్రదర్శించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+