టీడీపీ తిర‌గ‌బ‌డితే వైసీపీ ఉండ‌దు: గోదావ‌రి నీటికి చిన‌బాబు హారతి: జ‌గ‌న్ పైనా లోకేశ్ సెటైర్లు..!

టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్ వైసీపీ ప్ర‌భుత్వం మీద విమ‌ర్శ‌లు కంటిన్యూ చేస్తున్నారు. టీడీపీ హాయంలో నిర్వ‌హించి ప జ‌ల‌హార‌తుల‌ను ఇప్పుడు ప్ర‌తిపక్షంలో ఉన్నా కొనసాగిస్తున్నారు. అదే స‌మయంలో వైసీపీ ప్ర‌భుత్వం ప‌క్కాగా ఫ‌లానా చేశామ‌ని చెప్ప‌లేక‌పోతున్నార‌ని ఎద్దేవా చేసారు. టీడీపీ నేత‌ల పైన వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నార‌ని..అదే టీడీపీ తిర‌గ‌బ‌డితే మాత్రం ఎక్క‌డా వైసీపీ ఉండ‌ద‌ని హెచ్చ‌రించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ 45 రోజుల్లో ఎన్ని యూ ట‌ర్న్‌లు తీసు కున్నారో లెక్క లేద‌న్నారు. రాజ‌ధానిలో నిర్మాణాలు అపేసార‌ని..అమ‌రావ‌తిలో దొంగ‌లు ప‌డ్డార‌ని వ్యాఖ్యానించారు.

Recommended Video

    జగన్ ది అబద్ధాల ప్రభుత్వం అంటున్న లోకేష్

    గోదావ‌రి నీటికి లోకేశ్ హార‌తి..
    నూజివీడు - సీతారాంపురం దగ్గర పట్టిసీమ నుంచి వచ్చే నీటికి హారతులిచ్చి టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్న అయిదేళ్ల కాలంలో అనేక ప్రాంతాల్లో ఈ జ‌ల హారుతులు నిర్వ‌హించేవారు. గోదావ‌రి పుష్క రాల స‌మ‌యంలో రాజ‌మండ్రిలో..కృష్ణా పుష్క‌రాల స‌మ‌యంలో విజ‌య‌వాడ‌లో..అదే విధంగా అనంత‌పురంలో.. చిత్తూరు లో అనేక ప్రాంతాల్లో జ‌ల హారుతులు నిర్వ‌హించారు.

    Lokesh observed Harathi for Godavari water in Krishna dist. He says in 45 days governance YCP totally failed

    ఇక‌, ఇప్పుడు అధికారంలో లేక‌పోయినా అదే విధానం కొన‌సాగించారు. అయితే, ఇప్పుడు ప్ర‌భుత్వ ప‌రంగా కాకుండా పార్టీ కార్య‌క్ర‌మంగా నిర్వ‌హించారు. మాజీ మంత్రి లోకేశ్ పార్టీ నేత‌ల‌తో క‌లిసి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఇప్పుడు దీని పైన సొంత పార్టీ నేత‌ల నుండే భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ప‌ట్టిసీమ పైన నాడు విమ‌ర్శ‌లు చేసిన వారే ఇప్పుడు అక్క‌డ పంపులు ఆన్ చేసి నీటిని విడుద‌ల చేస్తున్నార‌ని..ఇప్ప‌కైనా చంద్ర‌బాబు దార్శ‌నిక‌త గుర్తించార‌ని వివ‌రించారు. ఇక‌, వైసీపీ 45 రోజుల పాల‌న మీద లోకేశ్ ప‌లు విమ‌ర్శ‌లు చేసారు.

    టీడీపీ తిర‌గ‌బ‌డితే...వైసీపీ ఉండ‌దు..
    రాష్ట్రంలో ఈ 45 రోజుల పాల‌న‌లో వైసీపీ అనేక చోట్ల టీడీపీ శ్రేణుల మీద దాడుల‌కు దిగింద‌ని లోకేశ్ ఆరోఫించారు. ఇదే విధంగా టీడీపీ తిర‌గ‌బ‌డితే ఎక్క‌డా వైసీపీ ఉండ‌ద‌ని హెచ్చ‌రించారు. రాష్ట్ర వ్యాప్తంగా విత్త‌నాల కొర‌త ఏర్ప‌డితే ముఖ్య‌మంత్రి రైతు దినోత్స‌వం చేస్తున్నార‌ని ఎద్దేవా చేసారు. రైతులు అల్లాడుతుంటే ప్ర‌భుత్వం మాత్రం ఆ నెపం టీడీపీ మీద నెట్టి త‌ప్పించుకొనే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని ఆరోపించారు.

    రాజ‌ధానిలో ప‌నులు ఆగిపోయాయ‌ని.. కొత్త ప్ర‌భుత్వ పాల‌న‌లో అమ‌రావ‌తిలో దొంగ‌లు ప‌డ్డారంటూ ఎద్దేవా చేసారు. అదే విధంగా అన్నా క్యాంటీన్లు.. చంద్ర‌న్న భీమా..రంజాన్ తోఫా ఎత్తివేసార‌ని..పెట్టుబ‌డులు ఆగిపోయాయ‌ని వివ‌రించారు. ఈ 45 రోజుల పాల‌న‌లో వైసీపీ ప్ర‌భుత్వం తాము ఏం చేసామో చెప్పుకోలేని ప‌రిస్థితుల్లో ఉంద‌ని లోకేశ్ పేర్కొన్నారు. కార్య‌క‌ర్త‌ల జోలికి వ‌స్తే తాము స‌హించేది లేద‌ని హెచ్చ‌రించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+