వైఎస్ జగన్ గజినీలా నటించినా గూగుల్ మర్చిపోదుగా .. ఆ వీడియో పోస్ట్ చేసి చూడమన్న లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు దిగుతూ సభలో గందరగోళం సృష్టిస్తున్నారు. ఇక తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలపై, సభలో జగన్ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అసెంబ్లీలో సీఎం జగన్ నీతులు వల్లించడం పై, అసెంబ్లీలో ప్రతిపక్ష వ్యవహరించాల్సిన తీరు ఎలా ఉండాలో చెప్పడంపై నారా లోకేష్ పై సెటైర్లు వేశారు.

అప్పుడు వైఎస్ జగన్ చిందులు అంటూ వీడియో పోస్ట్
గజినీలా జగన్ నటించినా గూగుల్ మర్చిపోదు అంటూ ఇలా కొడితే అలా వచ్చేసిందంటూ ఓ వీడియోను అప్లోడ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు పై నారా లోకేష్ తనదైన శైలిలో కౌంటర్ వేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్ జగన్ చిందులు వేశారు అని, అధికారంలోకి రాగానే నీతులు చెబితే ఎలా అంటూ ప్రశ్నించారు లోకేష్. జగన్ రెడ్డిది నోరు కాదు అబద్ధాల పుట్ట అంటూ లోకేష్ మండిపడ్డారు.

వైఎస్ జగన్ మార్ఖత్వం, నిర్లక్ష్యం కారణంగానే అసెంబ్లీ సభ్యులకు కరోనా
అంతకుముందు మరో ట్వీట్ లో వేల మంది చనిపోయిన తర్వాత కూడా వైయస్ జగన్ మూర్ఖత్వాన్నివదలలేదని, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్నారు అంటూ ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కరోనా బారిన పడిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించారు నారా లోకేష్. ఇప్పటికైనా జగన్ రెడ్డి వైసిపి నాయకులు మాస్క్ వేసుకుంటారని ఆశిస్తున్నా అంటూ పేర్కొన్నారు.

బాధ్యత లేని అధికార పక్షానికి బాధ్యత ఉన్న ప్రతిపక్షానికి తేడా చెప్పిన లోకేష్
అంతేకాదు బాధ్యత లేని అధికారపక్షానికి బాధ్యత ఉన్న ప్రతిపక్షానికి తేడాని చెబుతూ ఒక పోస్ట్ చేసిన నారా లోకేష్ అందులో మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తున్న ప్రతిపక్ష నేతలను, మాస్కులు ధరించకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్న అధికారపక్షం నేతలను చూపించారు. జాతీయ మీడియా ఉతికి ఆరేసిన తరువాత కూడా వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని, కరోనా సూపర్ స్ప్రెడర్స్ గా మారి కరోనా ని వ్యాప్తి చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారని ఫైర్
అంతకుముందు ఏపీ లో ఇసుక కొరతపై, ఇసుక నూతన పాలసీ పై టీడీపీ చేసిన ఆందోళన నేపథ్యంలో వైసిపి ఇసుకాసురులు ప్రజల్లో దోచుకుంటున్నారని టిడిపి హయాంలో ట్రాక్టర్ల ఇసుక ఇసుక గరిష్టంగా ఐదు వేలు ఉంటే , జగన్ పాలనలో ట్రాక్టర్ ఇసుక 6000 లారీ ఇసుక 30 వేల రూపాయలు చేసి ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు అంటూ మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు అన్నీ ప్రభుత్వ హత్యలేనని స్పష్టం చేశారు.

అసెంబ్లీలో, మండలిలో అధికార పక్షం తీరుపై లోకేష్ నిప్పులు
ఇసుక అక్రమ రవాణా ఆపాలని, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిమాండ్ చేస్తూ నిరసన తెలిపాం అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఏది ఏమైనా ఈరోజు ఉదయం నుండి వరుస ట్వీట్లతో లోకేష్ వైయస్ జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అసెంబ్లీలో, మండలిలో అధికార పక్షం తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.
-
జగన్కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!!












Click it and Unblock the Notifications