బ్రోకర్ సజ్జలా .. డ్రగ్స్ కింగ్ పిన్ జగన్ నేర సామ్రాజ్యం; కేంద్ర సంస్థల దర్యాప్తుకి సిద్ధమా? లోకేష్ ఛాలెంజ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. తాజాగా సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్టున్నారు.. అందుకే దుబాయ్ కి లోకేష్ వెళ్తున్నాడు అంటూ చేసిన వ్యాఖ్యలపై రివర్స్ ఎటాక్ చేసిన నారా లోకేష్ సజ్జల రామకృష్ణారెడ్డిని బ్రోకర్ అంటూ విరుచుకుపడ్డారు.

బ్రోకర్ సజ్జల ఎందుకు భుజాలు తడుముకున్నారు : లోకేష్

డ్రగ్స్ బాస్ ఎవరు అంటే బ్రోకర్ సజ్జల ఎందుకు భుజాలు తడుముకున్నారు అంటూ నారా లోకేష్ తీవ్రపదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాన్న మారిషస్, నేను దుబాయి అంటూ బొంబాయి కబుర్లు మాని, డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ వైయస్ జగన్ బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై విచారణ జరిపించండి అంటూ లోకేష్ సజ్జల రామకృష్ణా రెడ్డిని టార్గెట్ చేశారు. ఇదే సమయంలో 40 ఏళ్ల మా నాన్న రాజకీయ జీవితంలో ఒక కేసు అయినా ఉందా అంటూ ప్రశ్నించిన లోకేష్ మీ రెండున్నరేళ్ల పాలనలో నాపై కక్ష కట్టి మరీ పెట్టిన ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు తప్పించి, మీరు ఆరోపించిన వాటిలో ఒక్క రూపాయి అయినా అవినీతి అక్రమాలు నిరూపించగలిగారా అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు.

జగన్ రెడ్డి ఇప్పుడు తన నేర సామ్రాజ్యాన్ని డ్రగ్స్ దందా దాకా విస్తరించారు

జగన్ రెడ్డి ఇప్పుడు తన నేర సామ్రాజ్యాన్ని డ్రగ్స్ దందా దాకా విస్తరించారు

సీబీఐ, ఈడీ, మనీలాండరింగ్, ఐటీ కేసులతో ఆర్థిక ఉగ్రవాది అయిన జగన్ రెడ్డి ఇప్పుడు తన నేర సామ్రాజ్యాన్ని డ్రగ్స్ దందా వరకు విస్తరించారని లోకేష్ ధ్వజమెత్తారు. 72వేల కోట్ల హెరాయిన్ దిగుమతిపై డి ఆర్ ఐ కేసులోనూ జగన్ రెడ్డి ఏ 1 అని పేర్కొన్నారు లోకేష్ . ప్రజల ఆరోగ్యం కాపాడే పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వ్యాపారం మాదని పేర్కొన్న లోకేష్, జనం ప్రాణాలు తీసే.. లక్షల కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చిన హెరాయిన్, గంజాయి, ప్రాణాంతక మద్యం మాఫియాలు మీవి అంటూ విరుచుకుపడ్డారు.

కేంద్ర సంస్థల దర్యాప్తుకి తాను సిద్ధం .. మీరు సిద్ధమా : లోకేష్ ఛాలెంజ్

కేంద్ర సంస్థల దర్యాప్తుకి తాను సిద్ధం .. మీరు సిద్ధమా : లోకేష్ ఛాలెంజ్

అంతే కాదు ఎస్.. నేను దుబాయిలో నా కుటుంబ సభ్యులతో ఉన్నానని పేర్కొన్న లోకేష్, నా పర్యటన పైన మీ డ్రగ్ బిగ్ బాస్ బినామీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీక్రెట్ గా వెళ్ళిన డ్రగ్స్ హెవెన్ ఐవరీ కోస్ట్ టూర్ పైన కేంద్ర సంస్థల దర్యాప్తుకి సిద్ధమా? బ్రోకర్ సజ్జలా !! అంటూ లోకేష్ ఛాలెంజ్ చేశారు. అక్టోబరు 1న ఛాలెంజ్ చేసి మరీ డ్రగ్స్ పరీక్షలకు టిడిపి యువ నేతల బృందం వస్తే తోకముడిచిన మీ వైసీపీ నేతలే డ్రగ్స్ మాఫియా సూత్రధారులు, వాడకందారులు అని తేలిపోయింది అంటూ లోకేష్ ధ్వజమెత్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి తీరు డ్రగ్స్ దొంగే.. దొంగా .. దొంగా అని అరిచినట్లు ఉందని లోకేష్ స్పష్టం చేశారు.

చంద్రబాబు, లోకేష్ లపై సజ్జల చేసిన వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

చంద్రబాబు, లోకేష్ లపై సజ్జల చేసిన వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ విమర్శలపై టీడీపీ అధినేత చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేసి ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారాన్ని వైసీపీ నేతలకు ఎలా లింక్ పెట్టాలా అని చూస్తున్నారని, దొంగే దొంగ అన్నట్లుగా వ్యవహారం ఉందని, తెలుగుదేశం పార్టీ నేతలకే ఇలాంటి దందాలపై గట్టి పట్టు ఉందని సజ్జల ఎటాక్ చేశారు. టిడిపి వాళ్ళు డ్రగ్స్ బిజినెస్ లోకి దిగారేమో అన్న అనుమానం కలుగుతోందని సజ్జల అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తాను సంపాదించిన డబ్బులు డ్రగ్స్ వ్యాపారంలోకి మళ్లించారని, రాజకీయంగా ఎదుగుదల లేకపోవడంతో చంద్రబాబు కుటుంబం డ్రగ్స్ బిజినెస్ లోకి దిగిందని ఆరోపించారు. దుబాయ్ లో నారా లోకేష్ కు ఏం పని అని ప్రశ్నించారు. చంద్రబాబు హాంకాంగ్, సింగపూర్, మాల్దీవులు, మారిషస్ వెళ్లారని డ్రగ్స్ కు లింక్ పెట్టి విమర్శలు చేశారు. సజ్జల వ్యాఖ్యలకు లోకేష్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+