వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ జీవోలతో టీచర్లపై కక్ష.. విద్యార్థులకు శిక్ష; జగన్ నూతన విద్యా విధానమిదే: లోకేష్

|
Google Oneindia TeluguNews

వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. వైసిపి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీచర్లపై కక్ష విద్యార్థులకు శిక్ష ఇదే వైసీపీ సర్కార్ అమలుచేస్తున్న నూతన విద్యా విధానం నారా లోకేష్ తాజాగా వైసీపీ సర్కార్ అమలుచేస్తున్న జీవోలపై విరుచుకుపడ్డారు.

క్లాస్‌రూమ్‌లో పాఠం చెప్తూనే కుప్పకూలిన టీచర్ మృతి.. ఏపీలో ఘటనక్లాస్‌రూమ్‌లో పాఠం చెప్తూనే కుప్పకూలిన టీచర్ మృతి.. ఏపీలో ఘటన

 టీచర్లపై కక్ష సాధించేలా 117 జీవో అమలు చేస్తున్న వైసీపీ సర్కార్

టీచర్లపై కక్ష సాధించేలా 117 జీవో అమలు చేస్తున్న వైసీపీ సర్కార్


విద్యాసంస్క‌ర‌ణ‌ల పేరుతో వైసీపీ స‌ర్కారు అమ‌లు చేస్తోన్న 117 జీవో టీచ‌ర్ల‌పై క‌క్ష సాధించేలా ఉందని నారా లోకేష్ పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం అమలు పేరుతో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పాఠశాలల విలీనం కోసం స‌ర్కారు జారీచేసిన జీవోలు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాయన్నారు. జీవోలు 117, 128, 84, 85ల‌తో విద్యావ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తంగా మారిందని నారా లోకేష్ విమర్శించారు.

ఆ ఉపాధ్యాయులపై కక్ష సాధించటం కోసమే నూతన విద్యా విధానం

ఆ ఉపాధ్యాయులపై కక్ష సాధించటం కోసమే నూతన విద్యా విధానం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠ‌శాల‌ల విలీనంతో నిరుపేద పిల్ల‌లు విద్య‌కి పూర్తిగా దూర‌మై బాల‌కార్మికులుగా మారే ప్ర‌మాదం ఉందని నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. సీపీఎస్ ర‌ద్దు, త‌మ‌కు రావాల్సిన ప్ర‌యోజ‌నాల కోసం పోరాడిన ఉపాధ్యాయుల‌పై క‌క్ష సాధించేందుకు నూత‌న విద్యావిధానాన్ని తీసుకువచ్చారని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. తమని వ్యతిరేకించిన టీచర్లపై జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు నూతన విద్యా విధానాన్ని ఒక ఆయుధంగా వాడుతుందని నారా లోకేష్ పేర్కొన్నారు.

తాజా జీవోతో టీచర్లపై విపరీతమైన పని భారం

తాజా జీవోతో టీచర్లపై విపరీతమైన పని భారం


వైసీపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో, సర్కారు తీసుకువచ్చిన జీవోతో టీచర్లపై విపరీతమైన పని భారం పెరుగుతుందని లోకేష్ తెలిపారు. వారానికి 24 నుండి 30 పీరియడ్లు మాత్రమే చెప్ప‌గ‌లిగిన ఉపాధ్యాయులు వైసీపీ స‌ర్కారు తెచ్చిన జీవో ప్రకారం వారానికి 40 నుండి 48 పీరియడ్లు ప‌నిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందని లోకేష్ విమర్శించారు. కొత్త‌గా అమ‌లు చేస్తోన్న విద్యావిధానంలో అనేక‌ హైస్కూళ్ల‌లో హెడ్‌మాస్ట‌ర్‌, పీఈటీ, స‌బ్జెక్ట్ టీచ‌ర్లు కూడా ఉండరని నారా లోకేష్ పేర్కొన్నారు.

 కార్పోరేట్ ప్రైవేట్ స్కూల్స్ కు లబ్ది చేకూర్చేలా ఉన్న జీవోలు వెనక్కు తీసుకోవాలని లోకేష్ డిమాండ్

కార్పోరేట్ ప్రైవేట్ స్కూల్స్ కు లబ్ది చేకూర్చేలా ఉన్న జీవోలు వెనక్కు తీసుకోవాలని లోకేష్ డిమాండ్


జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి, ప్రైవేట్ పాఠశాలలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తోందని నారా లోకేష్ ఆరోపించారు. కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ కి లబ్ధి చేకూర్చేలా ఉన్నా117, 128, 84, 85జీవోలు వెన‌క్కి తీసుకోవాలని లోకేష్ సూచించారు. వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో లకు వ్యతిరేకంగాఉద్య‌మిస్తున్న ఉపాధ్యాయ సంఘాల‌కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తుందని లోకేష్ వెల్లడించారు.

English summary
Nara Lokesh said that Jagan Reddy's new education policy is destroying the education system by punishing students and revenge on teachers with those G.Os. Lokesh demanded to take back those G.Os
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X