• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేంజరస్ జే బ్రాండ్స్ మద్యం, గంజాయి వల్లే అత్యాచారాలు: జగన్ ను వదిలిపెట్టని లోకేష్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఇప్పటికే ఏపీలో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనలపై జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న నారా లోకేష్ తాజాగా అనకాపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనలపై జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.జే బ్రాండ్ మద్యం, విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి వల్లే రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరిగిపోయాయని లోకేష్ పేర్కొన్నారు.

డేంజరస్ జె-బ్రాండ్స్ మద్యం, విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి కలిసి యువకులను రేపిస్టులుగా, హంతకులుగా మారుస్తోందని లోకేష్ పేర్కొన్నారు. గోండి 'బ్లేడ్' సాయి ప్రభుత్వ (జె బ్రాండ్స్) లిక్కర్ మరియు గంజాయికి అలవాటు పడి నర్సీపట్నంలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన రాక్షసుడిగా మారిపోయాడని లోకేష్ మూడేళ్ల క్రితం సాయి ఉన్న ఫోటోను, ప్రస్తుతం సాయి ఫోటోను షేర్ చేసి మద్యానికి , గంజాయి కి బానిసైన సాయి ఏవిధంగా మారిపోయాడో చూడండి అంటూ పేర్కొన్నారు.

Lokesh slams jagan reddy over narsipatnam rape incident due to dangerous J Brand liquor and ganja

3 సంవత్సరాల క్రితం వరకు, సాయి సాధారణ పిల్లవాడు అని లోకేష్ ట్వీట్ చేశారు. కానీ ప్రస్తుతం సాయి ఎప్పుడూ నాలుక కింద బ్లేడ్‌ని పెట్టుకుని సైకోగా మారడం షాకింగ్‌గా ఉంది. నర్సీపట్నం వీధుల్లో రాత్రిళ్లు బ్లేడ్లు, రాడ్లతో తిరుగుతూ స్థానికులను బెదిరించేవాడని చెబుతున్నారు. ఎప్పటిలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం నిద్రపోతోందని లోకేష్ విమర్శలు గుప్పించారు. సకాలంలో చర్యలు తీసుకుంటే ఇలాంటి క్రూరమైన నేరాలను నివారించవచ్చు అని లోకేష్ పేర్కొన్నారు.

అంతేకాదు మీపై కుళ్ళు, కుతంత్రాలతో దుష్ప్రచారం చేస్తున్నారని మీరు మాట్లాడడం వల్ల మీకు, మీ నాయకులకు ఆత్మసంతృప్తి కలగొచ్చునేమో కానీ ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు జగన్ రెడ్డి గారు అంటూ లోకేష్ విమర్శించారు. మీరు మాపై అక్కసుతో మాట్లాడుతున్న సందర్భంలోనే అంబులెన్స్ మాఫియా ఆగడాలు తట్టుకోలేక తిరుపతి జిల్లా నాయుడుపేటలో రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని బైక్ పై సొంత ఊరికి తీసుకెళ్ళాడు ఓ తండ్రి అంటూ తాజాగా బాలిక మృతదేహాన్ని బైక్ పై తీసుకువెళ్లిన ఘటనను ప్రశ్నించారు.

ఆసుపత్రి సిబ్బంది సహకరించక, అంబులెన్స్ మాఫియా డిమాండ్ చేసిన డబ్బు లేక చిన్నారి అక్షయ మృతదేహాన్ని 18 కి.మీ బైక్ పై సొంత గ్రామం కొత్తపల్లి కి తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితిని కల్పించింది వైసిపి ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టి పనిపై దృష్టి పెట్టండి. కాస్తయినా పరిస్థితులు మెరుగుపడతాయి అంటూ లోకేష్ హితవు పలికారు.

English summary
Lokesh targets jagan reddy over the narsipatnam rape incident. Lokesh slams the rape incidents due to dangerous J Brands liquor and ganja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X