జగన్ దొంగబ్బాయ్.. ఎందుకంటే: లోకేష్, 'సాక్షి'పై ఆగ్రహం, హోదా పైనా..
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కల్తీ మద్యం విషయంలో జగన్ టిడిపి ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
విజయవాడలో కల్తీ మద్యం వల్ల ఐదుగురు చనిపోతే పరామర్శించేందుకు వచ్చిన జగన్ తమను విమర్శించడం సరికాదన్నారు. ఆయన తల్లి కాంగ్రెస్ పైన ఒక్క మాట మాట్లాడలేదన్నారు. అసలు ఆ బార్ ఎవరిదో జగన్‌కు తెలియదా అని ప్రశ్నించారు.
'అయ్యా జగన్ ఆ బార్ ఎవరిదో తెలియదా?' అని లోకేష్ నిలదీశారు. చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలంలోని శ్రీరంగ రాజపురంలో లోకేష్ జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

నారా లోకేష్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కల్తీ మద్యం బాధితులను పరామర్శించిన సమయంలో కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట అనలేదని మండిపడ్డారు.

నారా లోకేష్
విజయవాడలో కల్తీ మద్యం వల్ల ఐదుగురు చనిపోయారని, అందుకు కారణమైన బార్ ఎవరిదో జగన్‌కు తెలియదా అని లోకేష్ నిలదీశారు. టిడిపిని టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.

నారా లోకేష్
ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని లోకేష్ అన్నారు. అయితే, అదే సమయంలో కేంద్రంతో విభేదిస్తే ఆర్థిక వరులు సమకూరే అవకాశాలు ఉండవని చెప్పారు.

నారా లోకేష్
ఈ నేపథ్యంలో కేంద్రంతో సన్నిహితంగా ఉంటూనే మన డిమాండ్లు నెరవేర్చుకోవాలన్నారు. టిడిపి కేంద్రంతో విభేదిస్తే... జగన్ కేంద్ర ప్రభుత్వంలో చేరి మంత్రి పదవులు తీసుకోవాలని చూస్తున్నారని లోకేష్ ఆరోపించారు.

నారా లోకేష్
జగన్ తీరును ప్రజలు గమనించాలని లోకేష్ అన్నారు. నాడు రాజ్యసభలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు నేటి కేంద్రం అమలు చేయాలన్నారు. అమలు చేసే వరకు టిడిపి పోరాడుతుందన్నారు. పిల్ల కాంగ్రెస్ లాగా మన వద్ద దొంగ పేపర్, దొంగ ఛానల్ లేదని సాక్షిని ఉద్దేశించి మండిపడ్డారు.

నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాడు కేంద్ర ప్రభుత్వం ఏ హామీలైతే ఇచ్చిందో వాటన్నింటిని సాధించుకునే వరకు తెలుగుదేశం ప్రభుత్వం పోరాడుతుందని లోకేశ్ అన్నారు.

నారా లోకేష్
భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నూతన రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామన్నారు. అమరావతి నిర్మాణం కోసం ఒక్క రైతును కూడా ఇబ్బంది పెట్టకుండా భూములు సేకరించిన ఘనత చంద్రబాబుదే అన్నారు.

నారా లోకేష్
ఏపీలో 2019 ఎన్నికలు వచ్చే లోగా ఇక్కడ అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలు పూర్తి చేస్తామని లోకేష్ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినంత మాత్రాన అన్ని సమస్యలు పరిష్కారం కావని, కేంద్రం నిధులు కూడా సమకూర్చాలన్నారు.

నారా లోకేష్
వచ్చే సంవత్సరంలో రేణిగుంటలో సెల్‌ఫోన్ కంపెనీని ప్రారంభించనున్నారని, ఆ కంపెనీ ద్వారా యువతకు సుమారు 30 వేల ఉద్యోగాలను కల్పించే బాధ్యత చంద్రబాబు తీసుకుంటున్నారని లోకేష్ చెప్పారు. కడపలో కూడా ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారనున్నట్లు తెలిపారు.

నారా లోకేష్
మన దురదృష్టం కొద్దీ మాయ మాటలు చెప్పే దొంగబ్బాయి ఇక్కడ ఉన్నాడని, అతనితో జాగ్రత్తగా ఉండాలని, ఆ మాటలను ప్రజలు నమ్మవద్దని జగన్‌ను ఉద్దేశించి లోకేశ్ అన్నారు.

నారా లోకేష్
దొంగబ్బాయి ఎలాంటి మాయమాటలు చెబుతారని మీరు నన్ను ప్రశ్నించవచ్చునని, దానికి కొన్ని ఉదాహరణలు నేను చెబుతానన్నారు.

నారా లోకేష్
'రాయలసీమను రత్నాలసీమగా మార్చే ఉద్దేశ్యంతో పట్టిసీమ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించారు. ఆ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు దొంగబ్బాయి ఏమి చేశాడు? గోదావరి జలాలన్నింటిని రాయలసీమకు తరలిస్తున్నారంటూ అక్కడి ప్రజలకు దొంగబ్బాయి నూరిపోశాడు. అదే దొంగబ్బాయి రాయలసీమకు వచ్చి, పట్టిసీమ నుంచి ఒక్క చుక్క నీరు కూడా మనకు రాదని చెప్పాడు. ఇవి మాయమాటలు కాదా?' అని లోకేష్ ప్రశ్నించారు.

నారా లోకేష్
'అంతేకాకుండా.. రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడంటూ దొంగబ్బాయి కొత్త స్వరం ఆలపిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆ దొంగబ్బాయికి ఒక ప్రశ్న వేస్తున్నాను. మీ నాన్న, వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా ఒక్క ప్రాజెక్టు అయినా రాయలసీమకు వచ్చిందా? ఎవ్వరైనా పెట్టుబడులు పెట్టారా?' అని లోకేష్ నిలదీశారు.












Click it and Unblock the Notifications