వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే ఆళ్ళ లక్ష్యంగా.. మంగళగిరిలో లోకేష్ పర్యటనలు; విమర్శనాస్త్రాలు; సక్సెస్ అవుతారా?

|
Google Oneindia TeluguNews

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలైనా, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఇటీవల కాలంలో మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.

మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పర్యటనల వ్యూహం

మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పర్యటనల వ్యూహం

ప్రజల సమస్యలను తెలుసుకోవటం కోసం, ప్రజా మద్దతు కూడగట్టటం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నారా లోకేష్ పర్యటన చేయడం రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. మళ్లీ మంగళగిరి నియోజకవర్గం నుంచే ఎన్నికల బరిలోకి దిగుతానని చెప్పడమే కాదు, నియోజకవర్గ ప్రజలతో మమేకం కావడానికి లోకేష్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఏ మాత్రం సమయం దొరికినా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. ప్రభుత్వంపై స్థానిక సమస్యలపై ఒత్తిడి తెస్తున్నారు.

మంగళగిరి నియోజకవర్గంలో మండుటెండలలోనూ లోకేష్ పర్యటనలు

మంగళగిరి నియోజకవర్గంలో మండుటెండలలోనూ లోకేష్ పర్యటనలు

మంగళగిరి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆళ్ల రామకృష్ణా రెడ్డిపై పోటీ చేసిన నారా లోకేష్ ఓటమి పాలయ్యాడు. మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన లోకేష్ ఓటమి పాలు కావడంతో వైసిపి నేతలు లోకేష్ మంగళగిరి ఎన్నికల ఓటమిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా ఓడిపోయాడని, అసమర్ధుడని ఎద్దేవా చేస్తున్నారు. ఇక దీంతో వచ్చే ఎన్నికల్లో లోకేష్ పోటీ చేయడానికి వేరే నియోజకవర్గం చూసుకుంటాడు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగింది. అయితే ఆ చర్చకు చెక్ పెడుతూ లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో జోరుగా పర్యటనలు సాగిస్తున్నారు. మండుటెండను సైతం లెక్క చెయ్యకుండా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

మంగళగిరి టౌన్ లో లోకేష్ పర్యటన.. ఎమ్మెల్యే ఆళ్ళపై విమర్శలు

మంగళగిరి టౌన్ లో లోకేష్ పర్యటన.. ఎమ్మెల్యే ఆళ్ళపై విమర్శలు


ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్న లోకేష్ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలోనూ తన పర్యటనలతో ఉత్సాహం నింపుతున్నారు. మంగళగిరి టౌన్ లో పర్యటించిన లోకేష్ నియోజకవర్గ అభివృద్ధి కి బడ్జెట్ లో రూ.2600 కోట్లు కేటాయించినా స్థానిక ఎమ్మెల్యే చేతగాని తనం వల్ల కనీసం పది శాతం నిధులు కూడా తెచ్చుకోలేకపోయారని విమర్శించారు. మంగళగిరిలో అభివృద్ధి నిల్లు.. పేదల ఇళ్లు కూల్చివేతలు ఫుల్లు అంటూ ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు.

వైసీపీ ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అంటూ మండిపాటు

వైసీపీ ప్రభుత్వం చెత్త ప్రభుత్వం అంటూ మండిపాటు

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. మంగళగిరి టౌన్ లో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను ప్రజలు నా దృష్టికి తెచ్చారు. చెత్తపై పన్నేసిన చెత్త ప్రభుత్వం కనీసం ఇంటి ముందు చెత్త కూడా ఎత్తడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేసారని లోకేష్ మండిపడ్డారు. ఇక అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసి ప్రజలను ఏమార్చటంలో సీఎం జగన్ ఘనుడని లోకేష్ మండిపడ్డారు. జగన్ అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. మోసపూరిత ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని లోకేష్ పేర్కొన్నారు. మొత్తానికి లోకేష్ పర్యటనల ప్రభావం మంగళగిరి నియోజకవర్గంలో ఏ విధంగా ఉండబోతుందో ఆసక్తికర అంశమే. ఆయన వైసీపీ సర్కార్ పై ప్రజల వ్యతిరేకతను కూడగట్టటంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో తెలియాల్సి ఉంది.

English summary
Lokesh is frequently touring Mangalagiri constituency targeting MLA Alla Ramakrishnareddy. MLA Alla Ramakrishnareddy is incensed over the failures of the YSRCP regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X