కోడికత్తిగా .. నిన్ను ఉరికించి కొట్టడానికి టీడీపీకి అధికారమే అక్కరలేదు: వైఎస్ జగన్ కు లోకేష్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. వైసిపి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై చేస్తున్న దాడులపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఇప్పటివరకూ ముఖ్యమంత్రి అని గౌరవించి గారు అనే వాడిని, నీ వికృత క్రూరబుద్ధి చూశాక సైకో, సాడిస్ట్, డ్రగ్గిస్ట్ జగన్ రెడ్డి అంటున్నాను. నువ్వు నీ బినామీలు డ్రగ్స్ బిజినెస్ చేస్తారు. ఇదేంటి అని నిలదీసే టిడిపి నేతలపై దాడులకు పాల్పడతావా అంటూ నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా వైయస్ జగన్ ను టార్గెట్ చేశారు.

జగన్ ..పోలీసుల అండతో మాఫియా సామ్రాజ్యం నడుపుతున్నావా?


పరిపాలించమని ప్రజలు అధికారం ఇస్తే పోలీసుల అండతో మాఫియా సామ్రాజ్యం నడుపుతున్నావా అంటూ మండిపడ్డారు. టీడీపీ కార్యాలయాలపై గుండా మూకలతో దాడులకు తెగబడతావా అంటూ ప్రశ్నించారు నారా లోకేష్. ఎన్నాళ్ళని ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడులు చేయిస్తావ్.. నువ్వే రా తేల్చుకుందాం అంటూ విరుచుకుపడ్డారు. వైసిపి టెర్రరిస్ట్ ఎటాక్ అంటూ నారా లోకేష్ ఫైర్ అయ్యారు . తెలుగుదేశం స‌హ‌నం చేత‌కానిత‌నం అనుకుంటున్నావా? నీ ప‌త‌నానికి ఒక్కో ఇటుకా నువ్వే పేర్చుకుంటున్నావు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

క్యాడర్ కు మా లీడర్ కనుసైగ చేస్తే చాలు

క్యాడర్ కు మా లీడర్ కనుసైగ చేస్తే చాలు

నిన్ను ఉరికించి కొట్టడానికి తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన అవసరం లేదు అని పేర్కొన్న లోకేష్ నీ అరాచకాలపై ఆగ్రహంగా ఉన్న క్యాడర్ కు మా లీడర్ కనుసైగ చేస్తే చాలు అంటూ తేల్చి చెప్పారు. అంతేకాదు నీ కార్యాలయాల విధ్వంసం మాకు నిమిషం పని అని పేర్కొన్న లోకేష్ నీ ఫ్యాన్ రెక్కలు మడిచి, విరిచి నీ పెయిడ్ ఆర్టిస్ట్ లను రాష్ట్రం దాటేంతవరకు తరిమి కొడతారు మా కార్యకర్తలు అంటూ లోకేష్ తీవ్రపదజాలంతో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. అన్ని ఆనవాయితీ లను బ్రేక్ చేసి ప్రజాస్వామ్యాన్ని పాతరేసి నీ గొయ్యి నువ్వే తప్పుకుంటున్నావు కోడికత్తిగా అంటూ లోకేష్ నిప్పులు చెరిగారు.

వైసిపి రౌడీ బ్యాచ్ అరాచకాలపై టీడీపీ ధ్వజం

వైసిపి రౌడీ బ్యాచ్ అరాచకాలపై టీడీపీ ధ్వజం

మరోవైపు తెలుగుదేశం పార్టీ సైతం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరుగుతున్న దాడులపై నిప్పులు చెరుగుతోంది . వైసిపి రౌడీ బ్యాచ్ అరాచకాలు అంటూ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తుతుంది. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్న మాటలకే తాడేపల్లి గూండాలు ఇంతగా రెచ్చిపోయి తెలుగుదేశం కార్యాలయాలు నేతల ఇళ్ల పై రౌడీ మూకలను పంపి దాడులు చేయించిందని తెలుగుదేశం పార్టీ వెల్లడించింది. చేసే చెడు పనులను వేలెత్తి చూపితే తట్టుకోలేని వాళ్లను దద్దమ్మలు అని కాకుండా ఇంకా ఎలా పిలుస్తారు అంటూ ప్రశ్నించింది.

ఫ్యాక్షన్ నాయకుడు పాలనలో సైకో బ్యాచ్

ఫ్యాక్షన్ నాయకుడు పాలనలో సైకో బ్యాచ్

తెలుగు దేశం పార్టీ ఆఫీసులో ఉన్న అమాయక ఉద్యోగులపై దాడి చేయడం వైసిపి అరాచకానికి పరాకాష్ట అంటూ సీసీ టీవీ ఫుటేజ్ ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది టిడిపి. ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద ఇలా రౌడీ మూకలు మారణాయుధాలతో దాడి చేసారంటే ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఎంత పనికిమాలినదో అర్థం అవుతుంది అంటూ మండిపడింది. ఫ్యాక్షన్ నాయకుడు పాలనలో రాష్ట్రవ్యాప్తంగా రెచ్చిపోతున్న సైకో బ్యాచ్ అని తెలుగుదేశం పార్టీ విమర్శించింది .

Recommended Video

    NTR ని TDP నుండి సస్పెండ్ చేసి.. ఇప్పుడు నాటకాలా.. Vijaysaireddy మాస్ ట్రోలింగ్ || Oneindia Telugu
     స్టేట్ స్పాన్సర్డ్ ఎటాక్.. రాష్ట్రంలో బంద్ కు టీడీపీ పిలుపు

    స్టేట్ స్పాన్సర్డ్ ఎటాక్.. రాష్ట్రంలో బంద్ కు టీడీపీ పిలుపు

    ఇది స్టేట్స్ స్పాన్సర్డ్ ఎటాక్ అంటూ ఆరోపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి టిడిపి కార్యాలయాలపై, టిడిపి నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయంటూ ప్రజాస్వామ్యం పై దాడి జరుగుతుందంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూండా రాజ్యం కొనసాగుతుంది అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా నిప్పులు జరిగింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బంద్ కు పిలుపునిచ్చింది. టిడిపి అధినేత చంద్రబాబుఈ వ్యవహారంపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయడంతో పాటుగా, ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టటానికి, పోలీసుల వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించడానికి రంగంలోకి దిగారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+