Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోకేష్ యువగళం పాదయాత్ర: 10 నియోజకవర్గాలు.. 12 కేసులు!!

యువ గళం పాదయాత్రలో నారా లోకేష్ కు అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదు. ఆయనపై కేసుల నమోదు ఆగటం లేదు. చిత్తూరు జిల్లాలో పాదయాత్రలో లోకేష్ పై 12 కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని ఇప్పటినుంచే అధికార ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున దూకుడుగా ముందుకు వెళుతున్నాయి. ఒకపక్క టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రతో ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. మరోపక్క ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల మద్దతు తనకే ఉంటుందని పదేపదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒంటరిగా 175 నియోజక వర్గాల్లో పోటీ చేసి గెలవాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు సవాల్ విసురుతున్నారు. దేవుడి దయ, ప్రజల మద్దతు తనకు ఉందని ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి గెలిచే దమ్ము తమకు ఉందని చెప్తున్నారు.

అడుగడుగునా ఇబ్బందులు.. లోకేష్ పై కేసులు

అడుగడుగునా ఇబ్బందులు.. లోకేష్ పై కేసులు

యువ గళం పాదయాత్ర ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదు. ఆదిలోనే హంస పాదు అన్నట్టు పాదయాత్ర ప్రారంభం నాడే మొదలైన అరిష్టాలు, పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యువగళం పేరుతో లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన నాటి నుండి లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నా, కేసులు నమోదు అవుతున్నా లోకేష్ మాత్రం తొడకొట్టి మరీ ముందుకు కదులుతున్నారు.

 ఉద్రిక్తతల మధ్య చిత్తూరు జిల్లా లోకేష్ పాదయాత్ర

ఉద్రిక్తతల మధ్య చిత్తూరు జిల్లా లోకేష్ పాదయాత్ర


వచ్చే ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని హామీల వర్షం కురిపిస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మైకులు లాక్కున్నా, స్టూల్స్ లాగేసినా తగ్గేదే లేదని పాదయాత్ర చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు లోకేష్ సాగించిన పాదయాత్ర విషయానికి వస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర ఇప్పటివరకు దాదాపు 400 కిలోమీటర్లు కొనసాగింది. చిత్తూరు జిల్లాలో అడుగడుగున ఉద్రిక్త పరిస్థితుల మధ్య లోకేష్ పాదయాత్రను కొనసాగించారు.

చిత్తూరు జిల్లాలో లోకేష్ పై 12 కేసులు..

చిత్తూరు జిల్లాలో లోకేష్ పై 12 కేసులు..

చిత్తూరు జిల్లాలో లోకేష్ పై ఏకంగా ఒకటి రెండు కాదు 12 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటివరకు 30 రోజులపాటు లోకేష్ సాగించిన పాదయాత్రలో పోలీసులు 12 కేసులు నమోదు చేయడం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తుంది. మొత్తం పది నియోజకవర్గాల మీదుగా సాగిన లోకేష్ పాదయాత్ర 397 కిలోమీటర్లు కొనసాగింది. 397 కిలోమీటర్ల పాదయాత్రలో మొత్తం లోకేష్ పై పన్నెండు కేసులు నమోదు చేసిన పోలీసులు పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు.

9 కేసుల్లో ఫిర్యాదు చేసింది వాళ్ళే ..

9 కేసుల్లో ఫిర్యాదు చేసింది వాళ్ళే ..

మొత్తం నమోదైన 12 కేసులలో 9 కేసులలో ఫిర్యాదుదారులు పోలీసులేనని తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒక కేసులో ఫిర్యాదుదారుగా విఆర్వో ఉన్నారు. మొత్తం లోకేష్ పైన నమోదైన 12 కేసులలో ప్రతి 33 కిలోమీటర్లకు ఒక కేసు నమోదు అయినట్టుగా తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. నారా లోకేష్ తో సహా అచ్చెన్నాయుడు, దీపక్ రెడ్డి, పులివర్తి నాని, అమర్నాథ్ రెడ్డి తో సహా మొత్తం 55 మంది టిడిపి నేతలపైన పోలీసులు కేసులో నమోదు చేసినట్టు తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు.

లోకేష్ కు ప్రజల నుండి వస్తున్న మద్దతు చూసే కేసులు.. అడ్డగింతలు: టీడీపీ

లోకేష్ కు ప్రజల నుండి వస్తున్న మద్దతు చూసే కేసులు.. అడ్డగింతలు: టీడీపీ

లోకేష్ కి ప్రజాక్షేత్రంలో వస్తున్న మద్దతును చూసి పోలీసుల ద్వారా ప్రభుత్వం లోకేష్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, సవాళ్లు విసురుతూ, టిడిపి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ, హామీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ లోకేష్ పాదయాత్ర సాగిస్తున్నారు. ఇప్పటికే 12 కేసులు నమోదు కాగా, లోకేష్ పాదయాత్ర పూర్తి అయ్యేసరికి మొత్తం ఎన్ని కేసులు నమోదు చేస్తారో అని తెలుగుదేశం పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+