అసలు మీకు ప్రత్యేక హోదా వాగ్దానం చేసిందెవరు - వైసీపీ ఎంపీకి స్పీకర్ ప్రశ్నతో..!!

రాష్ట్ర విభజన సమయం నుంచి ఏపీకి ప్రత్యేక హోదా అంశం నెరవేరని డిమాండ్ గా ఉంది. పార్లమెంట్ వేదికగా విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ రాజ్యసభ సాక్షిగా హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేతగా బీజపీ నేత వెంకయ్య అయిదేళ్లు కాదు..పదేళ్లు ఏపీకి హోదా కావాలని డిమాండ్ చేసారు. కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత..హోదా లేదని తేల్చి చెప్పేసింది. ఏపీ మాత్రం హోదా కోసం నిరీక్షిస్తూనే ఉంది. ఇప్పుడు లోక్ సభ స్పీకర్ వైసీపీ ఎంపీకి సభలో స్పందించిన ఒక ప్రశ్న ఆసక్తిగా మారింది.

మీకు వాగ్ధానం చేసిందెవరు..

మీకు వాగ్ధానం చేసిందెవరు..

లోకసభ లో వైసీపీ ఎంపీ మర్గాని భరత్ ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. నాటి యూపీఏ ప్రభుత్వం అశాస్త్రీయంగా చేసిన విభజన కారణంగా ఆ నష్టాల నుంచి ఇప్పటికీ ఏపీ కోలుకోలేదని భరత్ వివరించారు. ఇదే అంశం పైన లోక్ సభ స్పీకర్ స్పందించారు. ఆసక్తి కర ప్రశ్న సంధించారు.

ప్రతీ సారి సభలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతున్నారు. అసలు మీకు ప్రత్యేక హోదా వాగ్దానం ఎవరు చేసారని ప్రశ్నించారు. దీంతో విభజన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను ఎంపీ భరత్ వివరించారు. జోక్యం చేసుకున్న స్పీకర్ విభజన బిల్లు ఎప్పుడు వచ్చిందని ప్రశ్నించారు. దీనికి 2014లో అంటూ పలువురు సభ్యులు సమాధానం ఇచ్చారు.

వెంకయ్య పేరు ప్రస్తావనతో

వెంకయ్య పేరు ప్రస్తావనతో

పార్లమెంట్ లో విభజన చట్టం ఆమోదం.. జరిగిన పరిణామాలను ఎంపీ భరత్ వివరించారు. నాడు సభలో మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు అయిదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసారని ఎంపీ భరత్ చెప్పుకొచ్చారు. దీంతో, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే జోక్యం చేసుకున్నారు. నాడు వెంకయ్యనాయుడు మంత్రి కాదని గుర్తు చేసారు. టీఎంసీ ఎంపీగా సౌగత్ రాయ్ స్పందించారు.

2014లో నాటి ప్రధాని మన్మోహన్ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. హోదా పొడిగింపుపైన వెంకయ్య మాట్లాడారని వివరించారు. ఇలా..సభలో ఉన్న ఇతర పార్టీల సభ్యులు ఈ సమయంలో స్పందించారు. ఏపీకి నాడు ఇచ్చిన హామీలను గుర్తు చేసారు. సభలో ఏపీకి ప్రత్యేక హాదా ఇస్తామని చెప్పిన అంశాన్ని ప్రస్తావించారు.

టీడీపీ వాదనల్లో నిజం లేదు

టీడీపీ వాదనల్లో నిజం లేదు

ఎంపీ భరత్ ఇదే సమయంలో టీడీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. టీడీపీ ఎంపీ తాము జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నామని అబద్దాలు చెబుతున్నారన్నారు. తాము జీతాలు చెల్లించే స్థితిలోనే ఉన్నామని భరత్ చెప్పుకొచ్చారు. మరో వైపు వైసీపీ లోక్ సభ ప్లోర్ లీడర్ మిధున్ రెడ్డి సైతం సభలో ఏపీ అంశాల పైన సుదీర్ఘంగా మాట్లాడారు.

ఇక, సోమవారం రాజ్యసభలో కేంద్రం మరోసారి ప్రత్యేక హోదా అంశం పైన క్లారిటీ ఇచ్చింది. 14వ ఆర్దిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం పన్నుల వాటా రాష్ట్రాలకు పెంచిందని..ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేకంగా రెవిన్యూ లోటు భర్తీ నిధులు ఇస్తున్నామని స్పష్టం చేసింది. ఇప్పుడు మరోసారి ఏపీలో ప్రత్యేక హోదా అంశం రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+