లోకసభ ఎన్నికలు 2019 : అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

Recommended Video

    Lok Sabha Election 2019 : Amalapuram Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

    తూర్పు గోద‌వ‌రి జిల్లాలో అమ‌లాపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం తొలి నుండి ఎస్సీ రిజ‌ర్వ్ గానే ఉంది. ఎందరో ప్ర‌ముఖ నేత‌లు ఇక్క‌డి నుండే లోక్‌స‌భ కు ఎన్నిక‌య్యారు. లోక్‌స‌భ కు స్పీక‌ర్ గా వ్య‌వ‌హ‌రించి..హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణిం చిన బాల‌యోగి సైతం ఇక్క‌డి నుండి లోక్‌స‌భ కు ప్రాతినిధ్యం వ‌హించారు. రాజ‌కీయంగా చైత‌న్యం ఉన్న అమ‌లాపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తీ సారి కాంగ్రెస్ -టిడిపి అభ్య‌ర్ధుల మ‌ధ్య పోటీ హోరా హోరీగా నే సాగింది. 2014 ఎన్నిక‌ల నాటికి మాత్రం కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోగా..టిడిపి- వైసిపి మ‌ధ్య ప్ర‌ధాన పోటీ జ‌రిగింది.

    15 సార్లు ఎన్నిక‌లు..14 ల‌క్ష‌ల ఓటర్లు..

    1962 లో ఏర్ప‌డిన అమ‌లాపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం లో ఇప్ప‌టి వ‌ర‌కు 15 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. కాంగ్రెస్ 9 సార్లు గెల‌వ‌గా.. టిడిపి ఆరు సార్లు గెలిచింది. ఇక్క‌డ 2014 ఎన్నిక‌ల లెక్క‌ల ప్ర‌కారం మొత్తం ఓట‌ర్లు 13 ల‌క్ష‌ల 57 వేల 866 మం ది ఓట‌ర్లు ఉన్నారు. అందులో 682607 పురుష ఓట‌ర్లు ఉండ‌గా.. మ‌హిళా ఓట‌ర్లు 675259 ఉన్నారు.

    2014 లో 83 శాతం పోలింగ్..టిడిపి గెలుపు..

    2014 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం 1120927 మంది పోలింగ్ లో పాల్గొన్నారు. అందులో పురుష ఓట‌ర్లు 568534 కాగా, 552393 మంది మ‌హిళా ఓట‌ర్లు పోలింగ్ లో పాల్గొన్నారు. మొత్తంగా 83 శాతం పోలింగ్ న‌మోదైంది. టిడిపి నుండి పోటీ చేసిన పండుల ర‌వీంద్ర‌బాబుకు 594547 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన మాజీ మంత్రి పినిపె విశ్వ‌రూప్ కు 552393 ఓట్లు ద‌క్కాయి. కాగా, ఈ ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ధి ర‌వీంద్ర బాబు 120576 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు.

    #LokSabhaElection2019: All about Amalapuram Constituency

    లోక్‌స‌భ స్పీక‌ర్ గా అమ‌లాపురం ఎంపీ బాల‌యోగి..

    అమ‌లాపురం లోక్‌స‌భ స్థానంలో ఎనిమిది మంది నేత‌లు 15 సార్లు ఎన్నిక‌ల్లో గెలుపొందారు. కాంగ్రెస్ నేత రెండు సార్లు ఇక్క‌డి నుండి ఎన్నిక‌య్యారు. టిడిపి ప్ర‌భుత్వంలో రాష్ట్ర మంత్రిగా ప‌ని చేసిన జీఎంసి బాల‌యోగి మూడు సార్లు లోక్ స‌భ‌కు ఇక్క‌డి నుండి ఎన్నియ్యారు. బాల‌యోగి లోక్‌స‌భ స్పీక‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణిం చ‌టంతో.. తరువాత ఆయ‌న భార్య లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. 2014 ఎన్నిక‌ల్లో మాజీ ఎంపి హ‌ర్ష కుమార్ జై స‌మైక్యాంధ్ర పార్టీ నుండి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. టిడిపి నుండి తొలి సారిగా ర‌వీంద్ర కుమార్ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. వైసిపి నుండి పోటీ చేసిన మాజీ మంత్రి పి విశ్వ‌రూప్ పై ఆయ‌న గెలిచారు.

    లోక్‌స‌భ స‌భ్యుడిగా ర‌వీంద్ర‌బాబు..

    తొలి సారి లోక్‌స‌భ కు ఎన్నికైన పి ర‌వీంద్ర‌బాబు స‌భ్యుడిగా స‌భ‌లో యాక్టివ్ గానే వ్య‌వ‌హ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 66 చర్చ‌ల్లో ఆయ‌న పాల్గొన్నారు. ఒక ప్రయివేటు మెంబ‌ర్ బిల్లును ప్ర‌వేశ పెట్టారు. స‌భ్యుడిగా 144 ప్ర‌శ్న‌లు సంధించారు. స‌మావేశాల‌కు రవీంద్ర‌బాబు హాజ‌రు 96 శాతం గా న‌మోదైంది.

    తిరిగి పోటీ వీరిద్ద‌రేనా..
    ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి 2014 అభ్య‌ర్ధులే బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌..అభ్య‌ర్ధుల మా ర్పు గురించి చ‌ర్చ జ‌రుగుతున్నా..రెండు పార్టీల్లోనూ ఆశావాహుల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. విశ్వ‌రూప్ గ‌తంలో ఎమ్మెల్యేగానూ ప‌ని చేసారు. ర‌వీంద్ర బాబుకు తిరిగి టిడిపి నుండి పోటీ చేయ‌టానికి ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో హ‌ర్ష‌కుమార్ లేదా అయ‌న త‌న‌యుడు సైతం ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌టానికి సిద్దంగా ఉన్నారు. వారు ఏ పార్టీ నుండి పోటీ చేస్తార‌నేది మ‌రి కొద్ది రోజుల్లో తేల‌నుంది. తూర్పు గోదావ‌రి జిల్లాలో అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం లో ఈ సారి ఎవ‌రు ఎక్క‌డి నుండి పోటీ చేసినా..ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య హోరా హోరీ పోటీ త‌ప్పేలా లేదు. ఇక‌, జ‌న‌సేన సైతం ఈ జిల్లాలో బ‌లంగానే ఉంది. దీంతో..ఈ లోక్‌స‌భ నుండి ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుందో చూడాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+