పాకిస్తాన్‌లా, టి రావొద్దనే: తెరాసను ఏకిపారేసిన జెపి
హైదరాబాద్: లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్‌పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం, అధికారం కోసం తెలుగు గడ్డను బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లలాగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం తెలంగాణ రాష్ట్ర సమితికి ఏమాత్రం ఇష్టం లేదన్నారు.
తెలంగాణ వస్తే తమ పప్పులు తమ పప్పులు ఉడకవని, కాంగ్రెసు పార్టీ సీట్లన్నింటిని కొట్టుకుపోతుందని తెరాస ఆందోళన చెందుతోందని మండిపడ్డారు. తెలంగాణను ఆపితేనే బాగుండని తెరాస భావిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రస్తుత సంక్షోభానికి ప్రజల వద్దనే పరిష్కారముందని చెప్పారు.

రాజకీయాలు ఎంత దిగజారాయో చెప్పడానికి శాసన సభే నిదర్శనమన్నారు. ప్రజలు ఎన్నుకున్న సభలే కళావిహీనంగా మారాయని, సభలో అరాచకత్వం రాజ్యమేలుతోందన్నారు. అధికార పక్ష సభ్యులే సభను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. అధికారం ఉంటే చాలు ఏం చేసినా చెల్లుతుందా అని ప్రశ్నించారు. భిన్న ప్రాంతాల ప్రయోజనాలకు సమన్వయం చేసే వేదికలు లేకుండా పోయాయని, ఏదో రూపంలో ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే నేతల లక్ష్యంగా మారిందని ఆరోపించారు.
రేపటికి శాసన సభ వాయిదా
రెండుసార్లు వాయిదా పడిన శాసన సభ మధ్యాహ్నం సమావేశమైంది. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభాపతి నాదెండ్ల మనోహర్ సభను బుధవారానికి వాయిదా వేశారు.
పనబాకను అడ్డుకున్న సమైక్యవాదులు
తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడల రేవులో కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఓన్జీసి కంట్రోల్ రూంను ప్రారంభించేందుకు తాటిపాక చమురు శుద్ధి ప్లాంటుకు వచ్చిన పనబాకను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications