నా లవర్ ముందే నన్ను కాల్చేయండి: యువకుడి ఆత్మహత్య, ఉద్రిక్తత

విశాఖ: విశాఖలోని ఆరిలోవాలో హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి పార్థసారథి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతి తనను మోసం చేసిందని తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అతను సూసైడ్ నోట్ రాశాడు. తనను కాలుస్తుండగా, ఆ అమ్మాయి చూడాలన్నారు.

ఆమె కళ్లెదురుగానే తన అంత్యక్రియలు నిర్వహించాలని అతను తన నోట్లో పేర్కొన్నాడు. దీంతో ఆమె కళ్లెదుటే పార్థసారథి అంత్యక్రియలు జరుపుతామని, అతని కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరిలోవలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

 Lover commits suicide in Vishaka

ఏం జరిగిందంటే...?

పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదుని, పైగా యువతికి చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారని, వేధించినందుకు రూ.1.20లక్షలు తీసుకుని, ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారని, తన గ్రామంలో పరువు పోయిందని, ప్రేమికురాలు డబ్బు డిమాండ్‌ చేసిందని, ఈ ఘటనలతో తీవ్ర మనస్థానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పార్థసారథి లేఖ రాశారు.

అతని ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. ఆరిలోవ అయిదో సెక్టరు పాండురంగాపురం ప్రాంతంలో సోమవారం జరిగింది. పార్థసారథి హోటల్ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేశాడు. పెదవాల్తేరుకు చెందిన యువతిని ప్రేమించాడు. 15 రోజుల క్రితం సంబంధిత యువతి పార్థసారథి ఇంటికి వచ్చింది. ఇద్దరూ వెళ్లిపోయారు.

రెండు రోజుల తర్వాత విజయవాడలో ఉన్నానని ఇంట్లో వారికి పార్థసారథి సమాచారం పంపించాడు. దీంతో తమ కుమారుడి ఆచూకీ కోసం పార్థసారథి తల్లిదండ్రులు సంబంధిత యువతి ఇంటికి వెళ్లి అడిగితే, తమకు తెలియదని ఆమె బంధువులు చెప్పారు.

ఆ తర్వాత యువతి బంధువులు మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో పార్థసారథిపై ఫిర్యాదు చేశారు. పెద్దలతో మాట్లాడుకోమని చెప్పడంతో, యువతి బంధువులకు రూ1.20లక్షలు వారం రోజుల క్రితం అందజేసినట్లు పార్థసారథి బంధువులు తెలిపారు.

ఈ ఘటనలతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు సోమవారం ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఆ యువకుడి ఆంత్యక్రియలు జరుపుతున్నారు. అతని కోరిక మేరకు ప్రేమించిన యువతి ఎదుటే మృతదేహాన్ని కాలుస్తామని బంధువులు ఆందోళన చేపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+