సహజీనవం చేసి చచ్చిపొమ్మన్నాడు: ప్రియురాలి ఆత్మహత్య

Subscribe to Oneindia Telugu

గుంటూరు: ప్రేమించిన ప్రియుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో ఓ యువతి తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లాలోని బాపట్లలో చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ప్రియుడు మోసగించడంతో గత శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కొక్కిలగడ్డ జ్యోతి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

నిజాంపట్నానికి చెందిన జ్యోతి గత ఆరు సంవత్సరాలుగా పట్టణంలోని 11వ వార్డు దేవుని మాన్యం నివాసి తన్నీరు బాలమురళీకృష్ణతో గత కొద్ది నెలలుగా సహజీవనం చేస్తోంది. అయితే, బాలమురళీకృష్ణ ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించి మరొక యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో జ్యోతి ఏప్రిల్‌ 20వ తేదీన పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ప్రియుడు బాలమురళీకృష్ణ అతని తల్లి వెంకాయమ్మ, తండ్రి శ్రీనివాసరావులపై ఫిర్యాదు చేసింది.

Lover fraud: girl committed suicide

కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు విచారించి నిందితులను రిమాండ్‌కు పంపారు. జ్యోతి బుధవారం బాలమురళీకృష్ణకు ఫోన్‌చేసి తనతో మాట్లాడాలని తన పరిస్థితిని తెలపాలని కోరింది. బాలమురళీకృష్ణ మాట్లాడటానికి తెనాలి రమ్మని పిలిచాడు. గురువారం జ్యోతి తెనాలి వెళ్ళి బాలమురళీకృష్ణతో మాట్లాడింది. తాను ఏడునెలల గర్భవతిని అని తన పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది.

తనకు దారిచూపకపోతే ఆత్మహత్యే శరణ్యమని తెలిపింది. అయితే, బాలమురళీకృష్ణ మాత్రం ఏమాత్రం కనికరం లేకుండా 'చస్తే చావు' అంటూ ఆమెను కసురుకుని అక్కడ్నుంచి వెళ్లిడిపోయాడు. దీంతో శుక్రవారం జ్యోతి బాపట్లలోని ప్రియుడి ఇంటివద్దకు వచ్చి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పు అంటించుకుంది. అప్పటి నుంచి మృత్యువుతో పోరాడిన జ్యోతి సోమవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కన్నుమూసింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl allegedly committed suicide in Guntur district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి