కిడ్నాప్... కాదు నా ప్రియుడే వదిలేయండి: రోడ్డుపై యువతి హంగామా
గుంటూరు: జిల్లాలోని తాడేపల్లి బైపాస్ రోడ్డులో గురువారం ఓ యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. అయితే, సాయంత్రానికి మాత్రం ఆమె.. మేమిద్దరం ప్రేమికులమని, వదిలేయాలని ప్రాథేయపడింది. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన యువతి కొన్నేళ్లుగా హైదరాబాదులో ఉంటోంది.
ఇటీవల ఆర్గనైజర్‌కు, ఆ యువతికి మధ్య గొడవ జరిగింది. దీంతో, గుంటూరులో బంధువుల ఇంట్లో ఉంటోంది. గురువారం ఓ యువకుడు బలవంతంగా ద్విచక్ర వాహనం పైన లాక్కొచ్చాడంటూ బైపాస్ రోడ్డులో హడావుడి చేసింది. విజయవాడ పోలీసులు ప్రశ్నించగా.. తనను కిడ్నాప్ చేసాడని చెప్పింది.

దీంతో పోలీసులు వారిని వాహనంలో తీసుకెళ్లారు. తొలుత అతను ఎవరో తనకు తెలియదని చెప్పిన ఆ యువతి ఆ తర్వాత మాట మార్చింది. అతను తన భర్తేనని, తమ ఇద్దరిదీ ప్రేమ వివాహం అని చెప్పింది. యువతి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. తామిద్దరం ప్రేమించుకున్నామని, గొడవ పడటంతో కోపంలో అతనెవరో తెలియదని చెప్పానని పేర్కొంది. అతనిని వదిలేయమని కోరింది.












Click it and Unblock the Notifications