• search
  • Live TV
శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమ ఎంత పని చేసింది .. డమ్మీ పిస్టల్ తో చోరీ చేసి దొంగని చేసింది, ఆపై అడ్డంగా బుక్ చేసింది

|
Google Oneindia TeluguNews

ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే అంటూ పాటలు పాడుతున్న ఓ యువకుడు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ప్రియురాలిని ఇంప్రెస్ చేయడం కోసం ఏదైనా చేయాలని భావించిన ప్రియుడు తాను చేస్తున్నది తప్పు అని అర్థంకాని స్థితిలో దొంగగా మారాడు. ప్రేయసి మీద విపరీతంగా ఉన్న ప్రేమ అతడిని చోరీలకు పాల్పడేలా చేసింది. అసలు ఇంతకీ ప్రేయసి కోసం ప్రియుడు చేసిన ఘనకార్యం ఏమిటి అంటే...

ఫ్లిప్ కార్ట్ లో డమ్మీ పిస్టల్ కొనుక్కుని జ్యూవెలరీ షాప్ లో చోరీ చేసిన ప్రియుడు

ఫ్లిప్ కార్ట్ లో డమ్మీ పిస్టల్ కొనుక్కుని జ్యూవెలరీ షాప్ లో చోరీ చేసిన ప్రియుడు


తాను ప్రేమించిన అమ్మాయిని తన ప్రేమతో బాగా ఇంప్రెస్ చేయాలనుకున్నాడు ఓ యువకుడు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ఒరిస్సాకు చెందిన సూరజ్ కుమార్ కద్రకా లవర్ కి గిఫ్ట్ ఇవ్వడం కోసం దొంగతనానికి పాల్పడ్డారు. దొంగతనం చేయడం కోసం ప్లాన్ చేసుకున్న సూరజ్ కుమార్ ఫ్లిప్ కార్ట్ లో డమ్మీ పిస్టల్ ను కొనుగోలు చేశాడు. ఇక దీనితో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని జీకే జ్యువెలరీ లో షాపు యజమానిని బెదిరించి మూడు గోల్డ్ చైన్లు దొంగతనం చేశాడు. ఇక చోరీ చేసి పారిపోతుండగా స్థానికులు సూరజ్ కుమార్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమ మార్కు విచారణ చేయగా అసలు విషయం వెల్లడించాడు సూరజ్ కుమార్ .

ప్రియురాలికి గిఫ్ట్ ఇవ్వటానికి ప్రియుడు చోరీ

ప్రియురాలికి గిఫ్ట్ ఇవ్వటానికి ప్రియుడు చోరీ

ప్రియురాలికి గిఫ్ట్ ఇవ్వడానికి తాను చోరీ చేశానని అంగీకరించాడు. నిందితుడి నుండి డమ్మీ పిస్టల్, 90 వేల విలువచేసే 3 గోల్డ్ చైన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ కోసం దొంగతనానికి పాల్పడిన ప్రియుడు, ప్రియురాలి దగ్గర ఇంప్రెషన్ మాట అటుంచి, ఇప్పుడు అనవసరంగా కటకటాలపాలయ్యాడు. ఇక ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేక చోట్ల నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ప్రేమ మత్తులో తప్పు ఒప్పు విచక్షణ తెలియకుండా అనేక ఘటనలకు పాల్పడి కేసులను ఎదుర్కొంటున్న వారు ఎందరో ఉన్నారు.

గతంలో గర్ల్ ఫ్రెండ్ కోసం బేబీ క్యామెల్ దొంగతనం చేసిన ప్రియుడు జైలు పాలు

గతంలో గర్ల్ ఫ్రెండ్ కోసం బేబీ క్యామెల్ దొంగతనం చేసిన ప్రియుడు జైలు పాలు

ఆ మధ్య గర్ల్ ఫ్రెండ్ కోసం దుబాయ్ కి చెందిన ఓ వ్యక్తి అత్యంత ఖరీదైన బేబీ కామెల్ (ఒంటె పిల్ల) ను దొంగతనం చేసి పుట్టినరోజున ప్రియురాలికి బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు ఒంటె పిల్లను దొంగతనం చేసిన వ్యక్తి ఆ కేసు నుండి తప్పించుకోవడం కోసం పోలీసులనే తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. దీంతో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ప్రియురాలి కోసం అతడే ఒంటె పిల్లను దొంగతనం చేసినట్లు గా గుర్తించారు.దీంతో ప్రేమికులు ఇద్దరు కటకటాల పాలయ్యారు.

లవర్స్ బీ కేర్ ఫుల్ .. ప్రేమ మత్తులో తప్పులు చెయ్యకండి

లవర్స్ బీ కేర్ ఫుల్ .. ప్రేమ మత్తులో తప్పులు చెయ్యకండి

ప్రేమ గుడ్డిది అంటారు అందుకు నిదర్శనంగా అనేక ఘటనలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒక్కోసారి తాము ప్రేమించిన వారి సంతోషం కోసం ఆలోచించకుండా చేసే పనులు అనర్థాలకు దారితీస్తాయి. చివరికి వారి ప్రేమను, భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేస్తాయి. ప్రేమించడం తప్పు కాదేమో కానీ, ప్రేమించిన వారి మెప్పు పొందడం కోసమో, లేక ప్రేమించిన వారిని సంతోషపెట్టడం కోసమో చేయరాని పనులు చేయడం మాత్రం తప్పే. అందుకే లవర్స్.. బి కేర్ ఫుల్, అనవసరంగా ప్రేమ మత్తులో పడి తప్పులు చేసి చిక్కుల్లో పడకండి. తర్వాత లబోదిబోమనకండి.

English summary
Suraj Kumar from Orissa in Ichhapuram in Srikakulam district committed theft for giving a gift to Lover. Suraj Kumar kadraka, who was planning to steal, bought a dummy pistol in a flip cart. He then threatened the shop owner at GK Jewelery in Ichapuram, Srikakulam district and stole three gold chains. And then he caught. It seems that the boyfriend did this robbery just for the lover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X