మళ్లీ భారీ వర్షాలు, పెరిగిన చలి - ఈ జిల్లాలకు తాజా అలర్ట్..!!

ఏపీ జిల్లాలను వర్షాలు వెంటాడుతున్నాయి. వరుస అల్పపీడనాల తో కోస్తా, సీమ జిల్లాలకు వర్ష ముప్పు తప్పటం లేదు. ఇదే సమయంలో చలి బాగా పెరిగింది. ఏజెన్సీ ఏరియాల్లో రికార్డు స్థాయి లో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అదే విధంగా పెరుగుతున్న చలితో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

తాజా హెచ్చరికలు
దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఆగ్నేయ బం గాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఆ రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించి మరింత బలపడనుందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో మంగళవారం నుంచి నుంచి గురువారం వరకు ప్రకాశం, నెల్లూరు, బుధ-గురువారా ల్లో పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Low-pressure area over Bay of Bengal to intensify bringing heavy rain to Coastal districts

ఈ జిల్లాల్లో వర్షాలు
ఇక, ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు కోస్తాలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అలర్ట్ చేసారు. ఇక చలి గాలుల ప్రభావం పెరుగుతోంది. మధ్యభారతం మీదుగా వస్తున్న చలి గాలుల ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు, తెలంగాణకు ఆనుకుని కోస్తా ప్రాంతాల్లో చలి మరింత పెరిగింది. అనేక ప్రాంతా ల్లో మంచు కురిసింది. ఆదివారం విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగులలో 5.6, కుంతలంలో 5.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం జి.మాడుగులలో 8.9 డిగ్రీలుండగా, ఒక్క రోజులో మూడు డిగ్రీల మేర చలి పెరిగింది.

పెరిగిన చలి
మూడు రోజులుగా ఏజెన్సీలో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వరుసగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. కోస్తా జిల్లాల్లో వరి, పత్తి, పొగాకు, ఇతర పంటలు సాగుచేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ అయింది. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులతో ప్రభుత్వం యంత్రాంగం సైతం అప్రమత్తం అయింది. ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు సూచనలు చేస్తున్నారు. దీంతో, వచ్చే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో వర్షాలు కరుస్తాయనే అలర్ట్స్ మరో సారి టెన్షన్ పెంచుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+