ఏపీకి తీవ్ర హెచ్చరిక.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావం వల్ల సోమ, మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలతోపాడు పిడుగులు పడే అవకాశం ఉందని, రైతులు, రైతు కూలీలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నంద్యాల, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం, కృష్ణా, ఏలూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

ఉష్ణోగ్రతలు కూడా అధికంగనే
శ్రీ సత్యసాయి, మన్యం, నెల్లూరు, అల్లూరి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో నిన్న వానలు కురిశాయి. అత్యధికంగా విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో 79.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నెల్లూరు, కోనసీమ, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఓవైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఎండలు కూడా మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సాధారణంకంటే అత్యధికంగా మూడు నుంచి నాలుగు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

low pressure in west central bay of bengal rain update in andhra pradesh

బంగాళాఖాతంలో రెండు సుడిగాలులు
తుఫాను తరహాలో రెండు సుడిగాలులు బంగాళాఖాతంలో ఉన్నాయి. ఒకటి ఏపీకి తీర ప్రాంతంలో ఉండగా, మరొకటి మయన్మార్ దగ్గరగా ఉంది. అల్పపీడనం వాయుగుండంగా, అక్కడి నుంచి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. దీనికితోడు ఏపీపై ద్రోణి విస్తరించింది. ఈరోజు కోస్తా, ఉత్త, మధ్య తెలంగాణతోపాటు హైదరాబాద్ లో కూడా వానలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం నుంచి రాయలసీమలో తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం వివరించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం ఈరోజు, రేపు నగరంలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం రాత్రి నగరంలో భారీ వర్షం కురిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+