తీవ్ర రూపం దాల్చిన అల్పపీడనం: భారీ వర్షాలు, మత్య్సకారులకు హెచ్చరిక

Subscribe to Oneindia Telugu

విశాఖ‌ప‌ట్నం: బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఒడిశా తీరం, ఉత్తర కోస్తాంధ్రపై కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.

తీవ్ర అల్పపీడనంపై 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు నైరుతి దిశలో ఉపరితల ఆవర్తనం వ్యాపించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పారు. దక్షిణ కోస్తాలో చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని, కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపారు.

Low pressure to intensify into depression over AP and Odisha: IMD

దక్షిణ కోస్తాకి వాయువ్య దిశలో 50 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని సముద్రంలోకి వెళ్ళే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గడచిన 24 గంటల్లో ఇచ్ఛాపురం, వరరామచంద్రపురంలో 5 సెం.మీ, కొయ్యలగూడెంలో 4 సెం.మీ, టెక్కలి, తిరువూరు, పాతపట్నం, సోంపేట, చింతూరులో 3 సెం.మీల‌ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. ఒడిశాలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.

Normal Monsoon in India this year predicts Skymet

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The low pressure area over the north-west Bay of Bengal and adjoining coastal areas of Andhra Pradesh and Odisha and Gangetic West Bengal is likely to intensify into a depression during the next 24 hours leading to heavy rain in the state, an IMD bulletin said.
Please Wait while comments are loading...