యుద్ధం ఎఫెక్ట్ :వంట గ్యాస్ బుకింగ్, సరఫరాలో తాజా మార్పులు- ఇది తప్పనిసరి..!!
వంట గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. వంట గ్యాస్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు తీసు కుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా తాజాగా వంట గ్యాస్ బుకింగ్స్ పెరుగుతుండటంతో ఆయిల్ కంపెనీలు అప్రమత్తం అయ్యాయి. అదే సమయంలో కమర్షియల్ సిలిండర్ల సరఫరా తాత్కాలికంగా నిలిపి వేసారు. కాగా.. సిలిండర్ డెలివరీ విషయం లోనూ ఆయిల్ కంపెనీలు తాజా మార్గదర్శకాలు ఖరారు చేసాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వేళ వంట గ్యాస్ సరఫరా పై ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా ధరలను భారీగా పెంచారు. ఇదే సమయంలో వినియోగదారులు ముందస్తుగానే తమ గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారు. పెరుగుతున్న డిమాండ్ వేళ ఆయిల్ కంపెనీలు తమ డీలర్లకు కీలక ఆదేశాలు ఇచ్చాయి. దీని ద్వారా బుకింగ్ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. తాజా ఉత్తర్వుల మేరకు డబుల్ సిలిండర్ ఉన్న వారికి డెలివరీ అయిన నెల రోజుల తర్వాత, అలాగే సింగిల్ సిలిండర్ ఉన్న వారికి 21 రోజుల తర్వాత మరో సిలిండర్ బుక్ చేసుకునేలా గడువు విధించారు. వంట గ్యాస్ కోసం ఆన్ లైన్ లో బుకింగ్ ల కోసం ఆయిల్ కంపెనీల యాప్ లు.. వెబ్ సైట్ల పైన బుకింగ్ ఒత్తిడి పెరగడంతో ఆయా కంపెనీలు తాజా నిబంధనల మేరకు సాఫ్ట్ వేర్ లో మార్పులు చేస్తున్నాయి. యుద్దం కారణంగా భవిష్యత్ లో వంట గ్యాస్ కొరత వస్తుందనే వార్తల తో గ్యాస్ సిలిండర్ అవసరం లేకపోయినా కూడా కొంతమంది ముందస్తు కోసం గ్యాస్ బుకింగ్ చేయడంతో సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. దీనిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు.

కేంద్రం తాజా మార్గదర్శకాలు
ఇటీవల గ్యాస్ సిలిండర్లు బుకింగ్ చేసే వారి సంఖ్య రెట్టింపు అయింది. బుక్ చేసిన తరువాత గతంలో నాలుగు అయిదు రోజులు సరఫరా సమయంగా ఉండేది. ఇప్పుడు ఆ గడువు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా.. గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించు కోవాలి. లేదంటే సిలిండర్ సరఫరా నిలిచిపోతుంది. దీంతో.. వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు కొన్ని సూచనలు చేస్తున్నాయి. అవసరం ఉంటేనే బుకింగ్ చేయాలని కోరుతున్నారు. కాగా, చివరి డెలివరీ తేదీని నమోదు చేసుకోవాలని సింగిల్ సిలిండర్ ఉంటే 21 రోజులు.. డబుల్ సిలిండర్ ఉంటే 30 రోజులు తరువాత మరో సిలిండర్ రీఫిల్ కోసం బుక్ చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు ఉపయోగించే కమర్షియల్ సిలిండర్ల పైన నియంత్రణ మొదలైంది. కేంద్రం తాజాగా వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించింది. ధరలు సైతం పెరగటంతో ఇప్పుడు వంట గ్యాస్ సరఫరాలో యుద్ద ప్రభావం ఏ మేర పడుతుందనేది కీలకంగా మారుతోంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications