జగన్ పార్టీకి 'లక్కీ' డ్రా: నెల్లూరు జెడ్పీ చైర్మన్, వైస్ వశం
నెల్లూరు: నెల్లూరు జెడ్పీ చైర్మన్ పదవిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుచుకుంది. లక్కీ డిప్ ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రావు ఎన్నికైనట్లు ప్రకటించారు. జెడ్పీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి.
నెల్లూరులో 46 జెడ్పీటీసీలు ఉన్నారు. 31 మంది వైయస్సార్ కాంగ్రెసు, 15 మంది తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీలు గెలిచారు. ఇక్కడి జెడ్పీ పీఠాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సునాయాసంగా గెలుచుకోవాల్సి ఉంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పలువురు జగన్ పార్టీ జెడ్పీటీసీలు టీడీపీ వైపు మొగ్గు చూపారు.

దీంతో జెడ్పీ చైర్మన్ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడింది. ఇప్పుడు మూడోసారి ఎట్టకేలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన రాఘవేంద్ర రావు లక్కీ డిప్ ద్వారా గెలుపొందారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 31 సభ్యులలో ఎనిమిది మంది టీడీపీకీ మద్దతు తెలిపారు. దీంతో ఇరు పార్టీల బలం 23తో సమానంగా ఉంది. ఇరు పార్టీల బలం సమానంగా ఉండటంతో లక్కీ డిప్ ద్వారా జెడ్పీ చైర్మన్‌ను ప్రకటించారు. ఇందులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని అదృష్టం వరించింది. వైస్ చైర్మన్ పదవి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీనే వరించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications