మోహన్ బాబు తగ్గి నెగ్గారు - మెగా క్యాంపు అక్కడే రాంగ్ స్టెప్ : విష్ణు గెలుపు..ప్రకాశ్ రాజ్ ఓటమి వెనుక..!!
సాధారణ ఎన్నికలను మరిపిస్తూ సాగిన "మా" ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు వచ్చాయి. హోరా హోరీ పోరులో మంచు విష్ణు గెలిచారు. ప్రకాశ్ రాజ్ ఓడారు. అయితే, ఈ ఎన్నికలు మెగా క్యాంప్ వర్సెస్ మోహన్ బాబు అన్నట్లుగా సాగాయి. తొలి నుంచి ప్రకాశ్ రాజ్ వెనుక మెగాస్టార్ మద్దతు ఉందని ప్రచారం సాగింది. ఇక, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మెగా బ్రదర్ నాగబాబు ఓపెన్ గా ఇదే విషయాన్ని చెప్పేసారు. మోహన్ బాబు సైతం ఒక ఇంటర్వ్యూలో తనకు చిరంజీవి ఫోన్ చేసి..తాను మాట ఇచ్చానని...విష్ణు పోటీ గురించి అడిగారంటూ చెప్పుకొచ్చారు.

చివర్లో అంచనాలు తారుమారు
అయితే, చివరి నిమిషం వరకు మెగా క్యాంపు ప్రకాశ్ రాజ్ విజయం పైన ధీమాగానే కనిపించింది. కానీ, పోలింగ్ ముగిసిన తరువాత మాత్రం సీన్ అర్దమైపోయింది. అయితే, అసలు ప్రకాశ్ రాజ్ ఓటమి..అదే విధంగా విష్ణు గెలుపు వెనుక కారణాల పైన రకరకాల విశ్లేషణలు వినిపిస్తు న్నాయి. ఈ ఎన్నికలో ఎన్నో వ్యూహాలు...మైండ్ గేమ్ లు..రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఇక, ప్రచారం ప్రారంభమైన సమయం నుంచి లోకల్ - నాన్ లోకల్ వ్యవహారం పైన చర్చ సాగింది. ప్రధానంగా మెగా క్యాంపు నుంచి నాగబాబు "మా" ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ గెలుపు కోసం శ్రమించారు.

మెగా క్యాంపు స్వీయ తప్పిదాలే కారణమా
ఆ సమయంలో ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు సైతం ఎన్నికల్లో ప్రభావితం చేసాయి. ప్రధాని ప్రస్తావన తేవటం .. ఇండస్ట్రీలో కొందరు సీనియర్ల గురించి చేసిన వ్యాఖ్యలు సైతం చర్చకు కారణమయ్యాయి. ప్రకాశ్ రాజ్ కొన్ని సందర్భాల్లో ఆవేశ పూరితంగా చేసిన వ్యాఖ్యలు..సీనియర్లను ప్రశ్నించే వారు ఉండాలంటూ మాట్లాడి న విధానం..జీవిత-హేమ లాంటి వారిని పోటీ నుంచి తప్పించి తమ శిబిరంలో చేర్చుకోవటం వంటివి సభ్యుల పైన ప్రభావం చూపాయి. అయితే, మోహన్ బాబు అంతా తానై తన కుమారుడి విజయం కోసం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

మోహన్ బాబు నిగ్రహం కలిసొచ్చింది
సహజంగా ఆవేశంగా.. ఆగ్రహంగా కనిపించే మోహన్ బాబు ఈ ఎన్నికల సమయంలో మాత్రం ఎదుటి పక్షం ఆవేశాన్ని క్యాష్ చేసుకున్నారు. వారిని ట్రాప్ లో చిక్కుకొనేలా చేసి.. వ్యూహాత్మకంగా దెబ్బ తీసారు. పవన్ కళ్యాణ్ తన పైన వ్యాఖ్యలు చేసినా..ఎన్నికల తరువాతనే స్పందిస్తానని చెప్పారు. నాగబాబు తన కుమారుడి పైన వ్యాఖ్యలు చేసినా స్పందించలేదు. ఇక పోలింగ్ జరుగుతున్న సమయంలో తనకు ఎవరి పైనా కోపం లేదని చెప్పే విధంగా పవన్ భుజం పైన చేతులు వేసి...పక్కకు తీసుకెళ్లి మాట్లాడి పాజిటివ్ సంకేతాలు ఇచ్చారు.

పోలింగ్ వేల వ్యూహాత్మకంగా మోహన్ బాబు
అదే విధంగా విష్ణు - ప్రకాశ్ రాజ్ చేతులు కలిపి పెద్ద తరహాలో వ్యవహరిస్తున్నానే ఇండికేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఆ సీన్ చాలా మంది ఓటర్లను ఆకట్టుకుంది. నరేశ్ ను ముందుంచి వెనుక నుంచి మోహన్ బాబు వ్యూహాలు రచించారు. "మా" సభ్యులతో పాటుగా..ఎదుటి పక్షం బలాలు - బలహీనతల పైన పూర్తి అవగాహన ఉండటంతో దానికి అనుగుణంగా అడుగులు వేసారు. ఇండస్ట్రీలో సహజంగా ఉండే విభేదాలు..ఆలోచనలను ఈ ఎన్నికల్లో పూర్తిగా తనకు అనుకూలంగా మలచుకున్నారు. ఆగ్రహం లేకుండా నిగ్రహంతో ఉంటూ కుమారుడి గెలుపులో కీలకంగా మారారు.

మొత్తం బాధ్యతలు తానే తీసుకొని
పోలింగ్ సెంటర్ కు ఉదయాన్నే వచ్చి.. ఫలితాలు ప్రకటించే దాకా ఉంది.. ఇక వచ్చే ఎన్నికల నుంచి ఏకగ్రీవమే అంటూ స్పష్టం చేసి విజయంతో తిరిగి వెళ్లారు. ప్రతీ సభ్యుడికి ఫోన్ చేసి వారి మద్దతు కూడగట్టారు. మోహన్ బాబు తన సహజ శైలికి భిన్నంగా మౌనంగా తన పని తాను చేసుకొని పోతుంటే.. మెగా క్యాంపు నుంచి నాగబాబు..ప్రకాశ్ రాజ్..జీవిత లాంటి వారు కాంట్రవర్సీ లకే సమాధానం ఇస్తూ ఎన్నికల వ్యూహాల పైన ఫోకస్ చేయలేదు. దీంతో..మోహన్ బాబు టీం ట్రాప్ లో పడి అసలు విషయం పక్క దారి పట్టింది.

అతి విశ్వాసం దెబ్బ తీసిందంటూ
జీవిత సైతం ఓడిపోయారు. శ్రీకాంత్ గెలవటం ఊరటనిచ్చే అంశం. ఇక, విష్ణు సైతం తన తండ్రి ఎక్కడా టెంపర్ కోల్పోకుండా పక్కనే ఉంటూ కూల్ చేస్తూ జాగ్రత్త పడ్డారు. దీంతో..మెగా క్యాంపు మద్దతిచ్చిన ప్రకాశ్ రాజ్ ఓడిపోయారు అనే దాని కంటే ఓటమి తెచ్చుకున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. విష్ణు గెలుపు కోసం నరేష్ అండ్ టీం ఎంతగా పని చేసిందో.. జీవిత ఓటమి కోసం అదే స్థాయిలో ఎదురు చూసింది.

ఇంకా వివాదం కొనసాగుతుందా
ఫలితాల ప్రకటన సమయంలో జీవిత ను ఓడిచిన రఘుబాబును అభినందించటం..నరేశ్ ఆనందం చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఇక, ఫలితాలు వచ్చిన వెంటనే నాగబాబు రాజీనామా చేయటం ఈ రోజు ప్రకాశ్ రాజ్ సైతం "మా" సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇప్పుడే అసలు కధ మొదలైందని వ్యాఖ్యానించటం ఈ "మా" సీరియల్ మరి కొంత కాలం సాగే అవకాశం స్ఫష్టంగా కనిపిస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications