వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కామెంట్స్ తో విభేదించిన మంచు విష్ణు-ప్రకాష్ రాజ్ రిప్లైకు డిమాండ్-పేర్ని అబద్ధాలాడరంటూ

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ సినిమా టికెట్ల వివాదంపై రచ్చ కొనసాగుతోంది. ఇప్పటికే ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేశారు. దీంతో ఫిలిం ఛాంబర్ ఆయన వ్యాఖ్యలకు తమకూ ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఇప్పుడు టాలీవుడ్ మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అధ్యక్ష అభ్యర్ధి మంచు విష్ణు కూడా అదే మాట చెప్పాడు. అంతటితో ఆగకుండా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించేలా పలు వ్యాఖ్యలు చేశాడు.

 మరింత ముదిరిన ఆన్ లైన్ టికెట్ల వివాదం

మరింత ముదిరిన ఆన్ లైన్ టికెట్ల వివాదం

ఏపీలో సినిమా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై నెలకొన్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ నిర్ణయానికి అనుకూలంగా, వ్యతిరేకంగా సినీ పరిశ్రమ వర్గాలే చీలిపోతున్న పరిస్ధితి. ముఖ్యంగా వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్, ఆయన అనుకూల వర్గం వ్యతిరేకిస్తుుండగా.. మిగిలిన వారంతా సమర్ధిస్తున్నారు. దీంతో ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై సినీ పరిశ్రమలోనూ ఎవరికి వారే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇప్పటికే మా ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో ఆన్ లైన్ టికెట్ల వివాదం ప్రభావం దీనిపైనా పడుతోంది.

 ఆన్ లైన్ టికెట్లపై పవన్ విమర్శలు

ఆన్ లైన్ టికెట్లపై పవన్ విమర్శలు

ఆన్ లైన్లో సినిమా టికెట్లు అమ్మాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై జనసేనాని, సినీ హీరో కూడా అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం తీసుకున్న వైసీపీ సర్కార్ పై తాజాగా ఆయన నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఇదే క్రమంలో నిర్ణయానికి కారకుడైన సమాచార మంత్రి పేర్నినానిపైనా ఆయన సన్నాసి అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ఆయన కూడా అదే రేంజ్ లో కౌంటర్ కూడా ఇచ్చేశారు. ఆ తర్వాత మిగతా మంత్రులు కూడా పవన్ ను టార్గెట్ చేయడంతో ఈ వ్యవహారం కాస్తా పూర్తిగా రాజకీయ రంగు పులుపుముంటోంది. దీంతో ఈ వ్యవహారం తమపై ఎక్కడ ప్రభావం చూపుతుందేమోనని మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారితో పాటు వారికి అండగా ఉన్న వారు కూడా భయపడుతున్నారు.

 పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించని మంచు విష్ణు

పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించని మంచు విష్ణు

ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంలో తాజాగా వైసీపీ సర్కార్ పై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలతో తాను ఏకీభవించడం లేదని మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మంచు విష్ణు ఇవాళ స్పష్టం చేశారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ఇప్పటికే ఫిలిం ఛాంబర్ దీనిపై ఇచ్చిన స్పందనతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తెలుగు ఇండస్ట్రీ బిడ్డగా, నిర్మాతగా, నటుడిగా ఫిలిం ఛాంబర్ ఇచ్చిన లేఖతోనే తాను ఏకీభవిస్తున్నానని మంచు విష్ణు తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ వివాదంలో మంచు విష్ణు కూడా దూరినట్లయింది.

 ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేసిన విష్ణు

ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేసిన విష్ణు

పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించి ఏకీభవించడం లేదని చెప్పిన మంచు విష్ణు మా ఎన్నికల్లో తన ప్రత్యర్ధిగా ఉన్న ప్రకాష్ రాజ్ ను సైతం ఇందులోకి లాగారు. ఇప్పటికే పవన్ వ్యాఖ్యల్ని సమర్ధించిన ప్రకాష్ రాజ్.ను మీరు ఇండస్ట్రీ పక్కన ఉన్నారా లేక పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారా అని మంచు విష్ణు ప్రశ్నించారు. ఫిల్మ్ ఇండస్ట్రీ తమ జీవనాధారమని, దీనిపై ప్రకాష్ రాజ్ మీడియాకు క్లారిటీ ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో ఇప్పటివరకూ వైసీపీ వర్సెస్ జనసేనగా ఉన్న ఈ వివాదం కాస్తా మా ఎన్నికల అజెండాగా కూడా మారిపోయినట్లు తెలుస్తోంది.

పేర్నినాని అబద్ధాలు చెప్పరన్న విష్ణు

పేర్నినాని అబద్ధాలు చెప్పరన్న విష్ణు

నిర్మాతలు దేవుళ్లని, వారికి నటులుగా తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని స్వయంగా నిర్మాత కూడా అయిన మంచు విష్ణు తెలిపారు. వారు ప్రభుత్వంతో ఆన్ లైన్ టికెట్లపై చర్చలు ప్రారంభించారని, వారే ఆన్ లైన్ టికెట్లు కోరారని మంత్రి పేర్నినాని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఓ మంత్రిగా పేర్నినాని అబద్ధాలు చెప్పరు కదా అని మంచు విష్ణు ఆయన్ను వెనకేసుకొచ్చారు. కాబట్టి మంత్రి పేర్నినానితో సమావేశానికి వెళ్లిన నిర్మాతలే దీనిపై మాట్లాడాలని మంచు విష్ణు కోరారు. దీనిపై వారు స్పందిస్తేనే బావుంటుందన్నారు.

రాజకీయ జోక్యం వద్దని విష్ణు హితవు

రాజకీయ జోక్యం వద్దని విష్ణు హితవు

మా ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దని రాజకీయ పార్టీలకు తాను ఇప్పటికే కోరినట్లు మంచు విష్ణు వెల్లడించారు. అయినా ప్రస్తుతం ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందేనని విష్ణు వ్యాఖ్యానించారు. మా ఎన్నికల సందర్భంగా ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంపై ఇంత రచ్చ జరుగుతుందని అంతా భావిస్తున్న నేపథ్యంల మంచు విష్ణు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే ఆన్ లైన్ టికెట్ల వ్యవహారాన్ని కదపడం ద్వారా మా ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ పై ఇండస్ట్రీ పెద్దలు విసుక్కుంటున్న నేపథ్యంలో మంచు విష్ణు కూడా పవన్ ను టార్గెట్ చేసేలా ఆ విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.

దీంతో ఈ వివాదంలో పవన్ కళ్యాణ్ ఒంటరి అయ్యారన్న వాదన వినిపిస్తోంది. అయినా ఆయన సోదరుడు చిరంజీవి కూడా మా ఎన్నికల నేపథ్యంలో దీనిపై ఏమీ మాట్లాడలేని పరిస్ధితి నెలకొంటోంది. దీంతో పవన్ వ్యాఖ్యలపై మెగా ఫ్యామిలీ నోరెత్తడం లేదు.

English summary
tollywood maa election presidential candiate manchu vishnu on today differ with actor cum politician pawan kalyan's recent comments on andhrpradesh government over online ticket sales.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X