పిన్నెల్లి ఎపిసోడ్ .. జగన్ వీడియో, మంచివాడు మోస్ట్ వాంటెడ్ అంటూ టీడీపీ రచ్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాచర్లలో ఎన్నికల పోలింగ్ నాడు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటన నేపథ్యంలో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన పట్టుబడకుండా తిరుగుతున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈవీఎంల ధ్వంసం ఘటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది.
జగన్ వీడియో తో టార్గెట్ చేసిన టీడీపీ
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రమే కాదు, ఆ పార్టీ అధినేత జగన్, పార్టీ నేతలు అందరూ నేర ప్రవృత్తి కలిగిన వారే అంటూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతుంది. ఇదే సమయంలో జగన్ వీడియోలతో టార్గెట్ చేస్తున్న టీడీపీ ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిని స్నేహితుడు, సౌమ్యుడు, మంచివాడు అని ఆయనను గెలిపించండి అంటూ విజ్ఞప్తి చేశారని టార్గెట్ చేసింది.

స్నేహితుడు, సౌమ్యుడు, మంచివాడు & ఆస్తులు కూడా అంతంతమాత్రమే ఉన్న పిన్నెల్లిని గెలిపించండి, తనతో అన్నీ నేనే దగ్గరుండి మరీ చేపిస్తాను!
— వై.ఎస్.కాంత్ (@yskanth) May 23, 2024
--- Jagan Reddy about Pinnelli pic.twitter.com/MqGj3FDA0H
దేశం మొత్తం మనవైపు చూసేలా.. జగన్ వీడియోతో పిన్నెల్లి ఎపిసోడ్ లింక్
జగన్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, తనతో అన్నీ నేనే దగ్గరుండి మరీ చేయిస్తానని జగన్ చెప్పినట్టుగా పోస్టులు పెట్టి తెలుగుతమ్ముళ్లు టార్గెట్ చేస్తున్నారు. దేశం మొత్తం మన వైపు చూసి ఇలా కూడా చేయొచ్చా అనుకునేలా దేశానికే మార్గ నిర్దేశం చేస్తాము అంటూ జగన్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ కట్ చేసి ఆ తర్వాత ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి ఎపిసోడ్ పెట్టి వీడియోలను వైరస్ చేస్తున్నారు.
పోలింగ్ బూత్ లోకి చొరబడి ఈవీఎం బద్దలు కొట్టిన పిన్నెల్లి రౌడీయిజం గురించి... ఇలాంటి వాళ్ళను సౌమ్యుడు, స్నేహితుడు అని వెనకేసుకు వచ్చిన జగన్ నేర మనస్తత్వం గురించి ఈరోజు దేశం మొత్తం చెప్పుకుంటోంది. సిగ్గు పడండి సారూ!#YSRCPRowdyism #EndOfYCP #AndhraPradesh pic.twitter.com/HAWyAZ5xNQ
— Telugu Desam Party (@JaiTDP) May 23, 2024
పిన్నెల్లి మాత్రమే కాదు జగన్ నేర మనస్తత్వం
పోలింగ్ బూత్ లోకి చొరబడి ఈవీఎం బద్దలు కొట్టిన పిన్నెల్లి రౌడీయిజం గురించి... ఇలాంటి వాళ్ళను సౌమ్యుడు, స్నేహితుడు అని వెనకేసుకు వచ్చిన జగన్ నేర మనస్తత్వం గురించి ఈరోజు దేశం మొత్తం చెప్పుకుంటోంది. సిగ్గు పడండి సారూ అంటూ తెలుగుదేశం పార్టీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
పిన్నెల్లి మోస్ట్ వాంటెడ్
అంతేకాదు పోలీసులను తప్పించుకొని తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మోస్ట్ వాంటెడ్ అంటూ ఎవరికైనా కనిపిస్తే పల్నాడు పోలీసులకు సమాచారం అందించాలంటూ టిడిపి ఒక పోస్ట్ పెట్టింది. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హింసకు పాల్పడే ధోరణి కలిగి ఉన్నారని, సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈవీఎం మెషిన్లను ధ్వంసం చేసినందుకు, అనేకమంది పౌరులను చంపేందుకు ప్రయత్నం చేసినందుకు ఆయనపైన అభియోగాలు మోపబడడంతో ఆయన పరారయ్యారని పేర్కొంది.
This YSRCP MLA Pinelli has tendency to commit violence and is prone to bouts of extreme anger. He has gone MISSING after charges were framed for destroying EVM machines and attempts to murder several innocent citizens during General Elections. Any information leading to his… pic.twitter.com/4jlI04iBLe
— Telugu Desam Party (@JaiTDP) May 23, 2024
తెలిస్తే సమాచారం ఇవ్వండి... ఉతికారేస్తున్న టీడీపీ
ఆయన ఎక్కడున్నాడో సమాచారం తెలిస్తే పల్నాడు పోలీసులకు సమాచారం అందించాలని తెలిపింది. అంతేకాదు ఈవీఎం ధ్వంసం చేసి పిన్నెల్లి ఎవరికీ దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడని, సినిమాలలోని కొన్ని వీడియోలతో ఆయనను ట్రోల్ చేస్తుంది. మొత్తంగా సోషల్ మీడియా వేదికగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఎపిసోడ్ ను టిడిపి ఉతికి ఆరేస్తోంది.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications