కారు వదిలి పారిపోయిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి.. అరెస్ట్ లో కొనసాగుతున్న హైడ్రామా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన జరిగిన ఎన్నికల పోలింగ్లో కొనసాగిన దాడులు, జరిగిన విధ్వంసాలు అన్ని ఇన్ని కావు. ఏపీలో ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో మాచర్లలో జరిగిన దాడులు, ఈవీఏం ధ్వంసం ఘటనలు అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయ్యాయి. మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటన దేశాన్ని ఒక సరిగా నివ్వెరపోయేలా చేసింది.
పిన్నెల్లి అరెస్ట్ కు పోలీసులు రెడీ
ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఎన్నికల కమీషనర్ ముకేష్ కుమార్ మీనాను దీనిపై వివరణ కోరింది. ఇప్పటివరకు ఆయనపై కేసు నమోదు చేసి ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని ప్రశ్నించింది. వెంటనే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.

పిన్నెల్లి కోసం గాలింపు.. రంగంలో ప్రత్యేక బృందాలు
ఆయన కోసం ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ రోజు ఆయనను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలు హైదరాబాద్ కు చేరుకున్నాయి. ఎస్పీ మలికా గార్గ్ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులతో పాటు తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు
కారొదిలి పారిపోయిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంగారెడ్డి వైపు వస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు సంగారెడ్డి జిల్లా కంది వద్ద ఆయన కారును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో కారు వదిలి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారయ్యారు.
పిన్నెల్లి అరెస్ట్ వ్యవహారంలో కొనసాగుతున్న హైడ్రామా
దీంతో ఆయనను అరెస్టు చేయడానికి గాలింపు చేస్తున్న పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు వ్యవహారంలో ప్రస్తుతం హై డ్రామా కొనసాగుతుంది. ఏది ఏమైనా కేంద్ర ఎన్నికల సంఘం ఈ వ్యవహారంలో సీరియస్ గా ఉన్న నేపధ్యంలో పిన్నెల్లి అరెస్ట్ ఏపీ పోలీసులకు, ఏపీ ఎన్నికల సంఘానికి పెద్ద టాస్క్ అనే చెప్పాలి.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications