వైసీపీ నాయకులు చెప్పినట్లు చేసిన ఉద్యోగులకు మొదటికే మోసం, ఎవ్వరిని వదిలిపెట్టం
గత వైసీపీ ప్రభుత్వంలోని నాయకులు, అధికారులు చెప్పినట్లు తల ఊపిన ఉద్యోగులకు ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏదోఒకరకంగా ప్రలోభాలకు తొలవొగ్గిన ఉద్యోగులు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు చేస్తున్న కొందరు జైలుకు వెలుతారని, కొందరు సస్పెండ్ కూడా అవుతారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పీ. సిసోదియా క్లూ ఇచ్చారు.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం కేసు దర్యాప్తు నిమిత్తం మదనపల్లె చేరుకుని మూడు రోజుల పాటు దర్యాప్తు కొనసాగించిన సిసోదియా శుక్రవారం విజయవాడ బయలుదేరారు మార్గం మధ్యలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించిన సిసోదియా మీడియాతో మాట్లాడారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం కేసులో ఎవ్వరూ తప్పించుకోలేరని సిసోదియా అన్నారు.

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటల్లో అనేక ఫైళ్లు కాలిపోయాయని, ఆ కేసు దర్యాప్తు వేగవంతం అయ్యిందని, ఫోరెన్సిక్ నివేదిక కోసం తాము ఎదురు చూస్తున్నామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పీ. సిసోదియా అన్నారు. ఇప్పటికే కాలిపోయిన పైళ్ల రికవరీ కోసం దర్యాప్తు వేగవంతం అయ్యిందని, త్వరలో ఫైళ్ల రికవరీ జరుగుతుందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పీ. సిసోదియా అన్నారు.
కలెక్టరేట్ తో పాటు తహసిల్దారు కార్యాలయంలోని ఫైళ్లు పరిశీలించామని, ఆ లావాదేవీలు పరిశీలించామని, 20 ఏళ్ల తరువాత ఫైళ్లు ఫ్రీ హోల్డ్ అవుతాయనే ఘటనలపై అనేక అనుమానాలు ఉన్నామని ఇప్పటికే చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో ఏకంగా 21 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయ్యాయని వెలుగు చూసిందని, అందులో4 వేల ఎకరాలకు పైగా రిజిస్టర్ అయ్యాయని తెలిసిందని సిసోదియా అన్నారు.
అన్నమయ్య, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ఆదిశగా దర్యాప్తు ముమ్మరం చేశారని, ఫ్రీ హోల్డ్ అయిన భూమల పూర్తి వివరాలు సేకరిస్తున్నామని సిసోదియా వివరించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు అందరిని విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నామని, ఆ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగుల మీద అనుమానం ఉందని సిసోదియా అన్నారు.
ఇప్పటికే ఏడు మంది ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని, కొందరు ఉద్యోగులు సస్పెండ్ అయ్యే అవకాశం కూడా ఉందని, కొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని, కాలిపోయిన ఫైళ్లు దాదాపు రికవరీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పీ. సిసోదియా మీడియాకు చెప్పారు. సిసోదియా దెబ్బతో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు దడ మొదలైయ్యిందని సమాచారం.












Click it and Unblock the Notifications