చిరంజీవి కోరిక: 150వ సినిమాలో మాధురి దీక్షిత్?
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు, మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం చేయనున్న నేపథ్యంలో... ఆయన మైలురాయి చిత్రం దర్శకుడు, హీరోయిన్ తదితరాల పైన రోజుకో ప్రచారం జరుగుతోంది. తాజాగా, చిరంజీవి 150వ చిత్రంలో మాధురీ దీక్షిత్ నటించవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో నటి రేఖ కూడా ఈ సినిమాలో కనిపించవచ్చుననే ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి పిలిస్తే తాను నటించేందుకు సిద్ధమని రేఖ ప్రకటించారని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరు మైలురాయి చిత్రంలో ఆమె కనిపించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.

మరోవైపు, చిరంజీవి చిత్రంలో నటి తమన్న లీడ్ రోలు చేయనుందని, మాధురీ దీక్షిత్ అతిథి పాత్రలో కనిపించే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మాధురీ దీక్షిత్‌తో నటించే అవకాశం తనకు రాలేదని చిరంజీవి గతంలో చెప్పారు. అయితే, చిరంజీవి 150వ చిత్రంలో ఎవరెవరు నటిస్తారనే విషయమై స్పష్టత వచ్చే వరకు ప్రచారానికి తెరపడే అవకాశాలు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications